ఏకకాలంలో రెండు డిగ్రీలు చదవొచ్చని వెల్లడించిన యూజీసీ బుధ వారం అందుకు సంబంధించి మార్గదర్శకాలను జారీ చేసింది . వాటిని దేశంలోని అన్ని వర్సిటీ లకు పంపింది . విద్యార్థుల ప్రయోజనార్థం ఒకే సారి రెండు డిగ్రీలు చదువుకునే అవకాశం ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలని యూజీసీ ఆయా వర్సిటీ ఉపకులపతులకు లేఖలు రాసింది . మార్గదర్శకాల పేరిట కేవలం అయిదు అంశాలను మాత్రమే పేర్కొనడం గమనార్హం . ఇవీ మార్గదర్శకాలు శేఖర్ APTF * ఒక విద్యార్థి ఏకకాలంలో ప్రత్యక్షంగా రెండు పూర్తిస్థాయి కోర్సులు చదవొచ్చు . ప్రత్యక్షంగా రెండు చోట్ల చదవాలనుకుంటే తరగతుల సమయాలు వేర్వేరుగా ఉండాలి . * రెండు కోర్సులను ప్రత్యక్షంగా లేదా ఒకటి ప్రత్యక్షం- మరొకటి దూరవిద్య / ఆన్లైన్లో లేదా రెండు కోర్సులు కూడా దూరవిద్య / ఆన్లై న్ చేయొచ్చు . యూజీసీ / కేంద్ర ప్రభుత్వ గుర్తింపు ఉన్నత విద్యాసంస్థలు అందించే దూర విద్య / ఆన్లైన్ కోర్సులు చేస్తేనే రెండో డిగ్రీ చెల్లుబాటు అవుతుంది . * కొత్త విధానంలో అందించే కోర్సులకు యూజీసీ / ఇతర మండళ్ల నిబంధనలు వర్తిస్తాయి . ఆ సంస్థల నియం త్రణ ఉంటుంది . * యూజీసీ నోటిఫికేషన్ ఇచ్చిన నాటి నుంచి ( ఏప్రిల్ 13 ) ఈ మార్గద ర్శకాలు అమల్లోకి వస్తాయి . ఇప్పటి నుంచి రెండు డిగ్రీలు చేస్తేనే చెల్లుతుంది . ఒకవేళ అంతకుముందు చేసినా అవి పనికిరావు
Download Guidelines for Pursuing Two AcademicProgrammes Simultaneously