ఉద్యోగ, ఉపాధ్యాయుల హాజరును నమోదుకు రాష్ట్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన పేసియల్ యాప్ లోపాల పుట్టగా మారింది. వారి సొంత ముఖాలు దెయ్యపు ప్రతిబింబాలై వెక్కిరిస్తున్నాయి. కనుచూపు మేరలో ఈ సమస్య పరిష్కారమవుతుందనే నమ్మకం లేకపోయినా వాటియొక్క ప్రకంపనలను మీ ముందుంచే ప్రయత్నం చేస్తున్నా.
ఈనేపథ్యంలో యాప్స్ గురించి, వాటిని ప్రవేశపెట్టాల్సిన అవసరాన్ని గురించి ఒకసారి విశ్లేషిద్దాం.
సాఫ్ట్వేర్ మార్కెట్లో అనేక యాప్ లు అందుబాటులోకి వచ్చాయి. ఇటీవలికాలంలో ముఖ గుర్తింపు వ్యవస్థలు బాగా ప్రాచుర్యం పొందుతున్నాయి. వ్యక్తి యొక్క నిజ గుర్తింపును గుర్తించడానికి మరియు ప్రామాణీకరించడానికి సిస్టమ్‌లు ప్రత్యేకమైన ముఖ లక్షణాలను కొలుస్తాయి మరియు సరిపోల్చుతాయి. ఫేస్ స్కానింగ్ టెక్నాలజీ ఇమేజ్‌లను గుర్తించడానికి మరియు వాటిని డేటాబేస్‌తో సరిపోల్చడానికి కెమెరాను ఫేషియల్ రికగ్నిషన్ సాఫ్ట్‌వేర్‌తో అనుసంధానిస్తుంది. వాస్తవానికి ఈ యాప్ లు బాధితులను గుర్తించడానికి లేదా నిందితులను పట్టుకోవడానికి ఈ యాప్ లు తొలినాళ్లలో పాశ్చాత్య దేశాలు ఎక్కువగా వినియోగిస్తూ వచ్చాయి. నిరంతరం గుర్తించాల్సిన చట్ట అమలు సంస్థలచే ఎక్కువగా ఉపయోగించబదుతున్నాయి.
“లెన్సులు,” మరింత వ్యావహారికంగా సెల్ఫీ ఫిల్టర్లు లేదా “ఫిల్టర్‌లు” అని పిలుస్తారు, ఇవి పూర్తిగా పనికిమాలిన ఫీచర్‌గా అనిపించవచ్చు. కానీ వాటి వెనుక ఉన్న ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీ అధునాతనమైనది, ఆకట్టుకునేది… మరియు కొంచెం భయానకంగా ఉంది. చాలా బ్యాంకింగ్ సాఫ్ట్‌వేర్ ఈ ముఖ గుర్తింపు వ్యవస్థను కూడా ఉపయోగిస్తోంది, ఇది వ్యక్తిని ప్రామాణీకరించడంలో సహాయపడుతుంది మరియు బ్యాంకింగ్ సిస్టమ్‌ను యాక్సెస్ చేయడానికి మరియు లావాదేవీలను పూర్తి చేయడానికి వారిని అనుమతిస్తుంది. వాస్తవానికి, నిర్దిష్ట మొబైల్ పరికరాలు పరికరాన్ని యాక్సెస్ చేయడానికి వినియోగదారుని అనుమతించే మార్గంగా ఉపయోగిస్తాయి. డిజిటల్ యుగంలో ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ కోసం చాలా అప్లికేషన్లు ఉన్నాయి.
ముఖ గుర్తింపు వ్యవస్థలు ఎలా పని చేస్తాయి?
ఒక వ్యక్తిని గుర్తించడానికి అవి ముఖ లక్షణాలకు సరిపోతాయి. భౌతిక లక్షణాలు వ్యక్తిని ప్రత్యేకంగా చేసే లక్షణాల వైపు చూపడం లక్ష్యంగా పెట్టుకుంటాయి. కెమెరా లేదా ఇతర మూలాధారాలను ఉపయోగించి డేటా తీసుకోబడుతుంది మరియు ఆ డేటా ఇన్‌పుట్ సిస్టమ్ లేదా సర్వర్‌లో ఇప్పటికే ఉన్న డేటాతో సరిపోలుతుంది. మొదట, కెమెరాను ఉపయోగించి గుర్తించడం జరుగుతుంది. గుర్తించే దశ ముగిసిన తర్వాత, గుర్తించబడిన ముఖం కోసం ఫేస్‌ప్రింట్ సృష్టించబడిన దశను చూస్తారు. చివరగా, రెండూ సరిపోల్చి గుర్తింపు ప్రక్రియను పూర్తి చేస్తారు.
ఒక మాల్‌లో ముఖాన్ని క్యాప్చర్ చేయడానికి ఉపయోగించే సీసీటీవీ కెమెరాలు ఉన్నాయనుకోండి. ఈ సీసీటీవీ కెమెరాలు ఫేస్ డిటెక్షన్ పాయింట్‌గా ఉంటాయి. గుర్తించడం పూర్తయిన తర్వాత, ఫేస్‌ప్రింట్ కంప్యూటర్‌లో సృష్టించబడుతుంది. చివరగా, ఫేస్‌ప్రింట్ స్థానికంగా మాల్ కంప్యూటర్‌లో నిల్వ చేయబడిన డేటాబేస్‌తో సరిపోలుతుంది. ఫేస్ ప్రింట్ తగిన ముఖ లక్షణాలను మరియు విన్యాసాన్ని విస్తృతంగా కలిగి ఉంటుంది.
ఈ సాంకేతిక పరిజ్ఞాన పరిచయమే ఆంధ్రప్రదేశ్ లో ఉద్యోగ ఉపాధ్యాయుల పాలిట యమపాశమై చుట్టుకొంది. ఉపాధ్యాయుల సెల్ ఫోన్ నుంచే హాజరును సేకరించే వ్యవస్థ ఆగష్టు నెల నుంచీ అమల్లోకి వచ్చింది. అయితే మూడు నెలలు దాటినా బాల్యారంభ దోషాలను అధిగమించడం లేదు. ప్రపంచ బ్యాంకు దృష్టిలో ఉత్తమ నాణ్యతా ప్రమాణాలతో విద్యా వ్యవస్థను నిర్వహిస్తున్నామని చాటుకు ఉబలాటంలో ఉన్న ప్రభుత్వానికి వాస్తవ సమస్యల పరిష్కారానికి చొరవ చూపడం లేదు. ఒకవైపు ఇంటర్నెట్ సమస్య, మరోవైపు యాప్ లో లోపాలు మానసిక వేదనను సృస్తిస్తున్నాయి. తొలి ప్రయత్నంలో హాజరు సకాలంలో నమోదుకాక మానసికంగా ఉద్వేగానికి గురవుతున్నారు. హాజరు వేసే ప్రతీసారీ సింక్ చేయాల్సిరావడం, నిర్ణీత పని ప్రదేశంలో లేరని, బాక్స్ లొనే ముఖం ఉంచాలనడం, నవ్వులు కోరడం, కళ్ళు బ్లింక్ చేయమనడం వంటి సందేశాలు ప్రత్యక్షమై యాప్ కోతిని చేసి అందిస్తోంది. ఉపాధ్యాయుల విద్యార్థుల సమక్షంలో అష్ట వంకరలు తిరిగి చేస్తున్న విన్యాసాల వల్ల విపరీతమైన కాలహరణమవుతోంది. ఇక సెలవుల నమోదుపై స్పష్టత లేదు. రెండుపూటలా సెలవు పెట్టి తొలి పూట గానీ రెండో పూట గానీ కార్యస్థానానికి హాజరైనప్పటికీ మీరు సెలవులో వున్నారు, మీ హాజరు నమోదు కాదంటూ మెసేజ్ వస్తోంది. కొన్ని పర్యాయాలు అసలు ఫోటోలోని వ్యక్తి మీరు కాదంటోంది. ప్రభుత్వానికి, సాంకేతిక సహకారాన్ని అందిస్తున్న సంస్థలకు మధ్య ఒడంబడిక ఏంటో తెలీదు కానీ ఫలితాలను చవిచూస్తున్నది ఉపాధ్యాయులే! సమస్యలు పరిష్కారించడానికి ఏర్పాటైన హెల్ప్ డెస్క్ కూడా ఏమీ చెప్పలేక పోతోంది. డీడీఓ లాగిన్ కూడా లోపభూయిష్టంగా ఉంది. సెలవుల సంఖ్య కూడా ఇతిమిద్దంగా లేవు. అసలు ముఖ ఆధారిత హాజరు నమోదును ఉపాధ్యాయులంతా ముక్తకంఠంతో తిరస్కరించినా కొన్ని సంఘాలు ప్రభుత్వ పెద్దల వద్ద నోరు మెడపలేక నాలుక వెనక్కు ముడుచుకొని వచ్చాయి. ఇది వాస్తవం. పోనీ పోరాటాలకు ఉపాధ్యాయులు సంసిద్ధులుగా లేరంటూ సుద్దులు చెప్పినా చావుతప్పి కన్ను లొట్టబోయి నిరంకుశ విధానాలను అంగీకారాన్ని తెలిపారు. సరే అనుకున్నా, యాప్ లోపాలతో ఉపాధ్యాయులను విసిగిస్తోంది, వేధిస్తోంది, గుండు చేయించుకున్న వారికి యాప్ చుక్కలు చూపిస్తోంది.
పాఠశాలల నిర్వహణ పూర్తిగా యాప్ లపై ఆధారపడి ఉన్న దృష్ట్యా తగిన సామగ్రి సంపత్తిని అందుబాటులో ఉంచడం ప్రభుత్వ బాధ్యత. లేదంటే ఉపాధ్యాయులు మానసిక వికలాంగులయ్యే ప్రమాదం ఉంది
ప్రభుత్వం ఇప్పటికైనా పాఠశాలలకు పూర్తిస్థాయిలో బయోమెట్రిక్ యంత్రాలను సరఫరా చేయడంతో పాటు ప్రాంగణంలో ఇంటర్నెట్ సౌకర్యం కల్పించాలని కోరుతున్నాం.
- మోహన్ దాస్, ఎపిటీఎఫ్.