- ఈసారి ఆరు పేపర్లే.. సైన్స్‌లో ఒకటే
- తొలిసారిగా రోజు మార్చి రోజు పరీక్ష
- ఉదయం 9.30 నుంచి 12.45 వరకూ
- 15న ముగియనున్న రెగ్యులర్ పరీక్షలు
రాష్ట్రంలో పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ఏప్రిల్ 3వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ ఏడాది ఆరు పేపర్లతోనే పరీక్ష నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు పరీక్షల షెడ్యూలును పాఠశాల విద్య కమిషనర్ ఎస్.సురే్‌షకుమార్ శుక్రవారం విడుదల చేశారు. గతేడాది వరకూ సెలవులు వస్తే మినహా వరుస రోజుల్లో పరీక్షలు జరిగేవి. అయితే ఇప్పుడు తొలిసారిగా రోజు విడిచి రోజు పరీక్షల విధానం ప్రవేశపెట్టారు. ప్రతి రెండు పరీక్షల మధ్య కనీసం ఒకరోజు ఖాళీ ఉండేలా షెడ్యూల్ రూపొందించారు. అలాగే గతేడాది వరకూ సైన్స్ పరీక్షను రెండు రోజులు జరిపి మొత్తం ఏడు పేపర్లతో పరీక్షలు నిర్వహించేవారు. ఇప్పుడు ఆ పరీక్ష ఒకరోజు మాత్రమే జరగనుంది. దీంతో మొత్తం పేపర్ల సంఖ్య ఆరుకే పరిమితమైంది. రెగ్యులర్ పరీక్షలన్నీ 15వ తేదీతోనే ముగుస్తుండగా, 17, 18 తేదీల్లో ఓరియంటల్ ఎస్‌ఎ్‌ససీ, ఒకేషనల్ పరీక్షలు జరగనున్నాయి. అన్ని పరీక్షలు ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు నిర్వహిస్తారు. అయితే ప్రథమ భాష పేపర్-2 (కాంపోజిట్ కోర్సు) పరీక్ష 9.30నుంచి 11.15 వరకు, ఎస్‌ఎ్‌ససీ ఒకేషనల్ కోర్సు థియరీ పరీక్ష 9.30 నుంచి 11.30 వరకు జరగనున్నాయి. ఇప్పటి వరకూ 6,60,859 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలకు దరఖాస్తు చేసుకున్నారు. కాగా, నిర్దేశిత రుసుము కంటే అదనంగా వసూలు చేసే ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలపై చర్యలు తీసుకుంటామని కమిషనర్ హెచ్చరించారు.
♦️పరీక్షల షెడ్యూలు ఇలా..
తేదీ సబ్జెక్టు మార్కులు
▪️ఏప్రల్ 3 - ప్రథమ భాష 100 / ప్రథమ భాష-1 (కాంపోజిట్ కోర్సు) 70
▪️ఏప్రిల్ 6 ద్వితీయ భాష 100
▪️ఏప్రిల్ 8 ఇంగ్లిష్ 100
▪️ఏప్రిల్ 10 గణితం
▪️ఏప్రిల్ 13 సైన్స్
▪️ఏప్రిల్ 15 సోషల్ స్టడీస్ 1
▪️ఏప్రిల్ 17 ప్రథమ భాష-2 (కాంపోజిట్ కోర్సు) 30
▪️ఓఎస్‌ఎస్‌సీ మెయిన్ లాంగ్వేజ్ పేపర్-1 100
▪️ఏప్రిల్ 18 ఓఎస్‌ఎస్‌సీ మెయిన్ లాంగ్వేజ్ పేపర్-2 100
▪️ఎస్‌ఎస్‌సీ ఒకేషనల్ కోర్సు (థియరీ) 40, 30