ఎయిడెడ్ పాఠశాలల్లో అదనంగా ఉన్న ఉపాధ్యాయులను అవసరమయ్యే బడులకు సర్దుబాటు చేసేందుకు పాఠశాల విద్యాశాఖ చర్యలు చేపట్టింది. విద్యార్థుల సంఖ్య ఆధారంగా హేతుబద్ధీకరణ చేసి, మిగిలిన వారిని అవసరమయ్యే పాఠశాలలకు కేటాయిస్తారు. ఎయిడెడ్ పాఠశాలల్లో పోస్టులు భర్తీచేయాలని యాజమాన్యాలు న్యాయస్థానాన్ని ఆశ్రయించిన నేపథ్యంలో మిగులు టీచర్ల వివరాలను విద్యాశాఖ సేకరిస్తోంది. దీనికి సంబంధించిన పట్టికను జిల్లా విద్యాధికారులకు పంపించింది.