APTF
  • Home
  • Sitemap
  • search

WEB LINKS 1

CFMS
E-SR
CHILD INFO
CSE AP
AP SCERT
CPS
MDM
EHS
ZPPF SLIPS
APGLI

WEB LINKS 2

DIKSHA
INCOME TAX
DSC LISTS
TRANSFERS 2022
Home » TEACHING » పెన్షనర్లు -లైఫ్ సర్టిఫికెట్స్ -సబ్మిట్ చేసే ప్రాసెస్ - వివరాలు

పెన్షనర్లు -లైఫ్ సర్టిఫికెట్స్ -సబ్మిట్ చేసే ప్రాసెస్ - వివరాలు

Posted by APTF 1938
» TEACHING
» Wednesday, 21 December 2022

 ఆంధ్ర ప్రదేశ్ గవర్నమెంట్ పెన్షనర్లు - (లైఫ్ సర్టిఫికెట్) యాన్యువల్ వెరిఫికేషన్ సర్టిఫికెట్ - అప్లోడ్  చేయడానికి  Government of Andhra Pradesh - Treasuries and Accounts Department వారి సర్కులర్ మెమో నెంబరు D4/1381/2019 dt 12/11/2021  మేరకు  1 జనవరి నుండి 28 పిబ్రవరి వరకూ  మాత్రమే సబ్మిట్ చేయాలి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పెన్షనర్లు నవంబరు, డిశంబరునెలలో ఇచ్చిన (లైఫ్ సర్టిఫికెట్) యాన్యువల్ వెరిఫికేషన్ సర్టిఫికెట్ చెల్లదు.

పెన్షనర్స్ (లైఫ్ సర్టిఫికెట్) యాన్యువల్ వెరిఫికేషన్ సర్టిఫికెట్ ను  ట్రెజరీలో గాని, ఆన్లైన్ సెంటర్ లోగానీ,  మనవద్ద బయోమెట్రిక్ డివైజ్ ఉంటే మనమే నేరుగా cfms సైట్ ద్వారా లేదా జీవన్ ప్రమాణ్ పోర్సల్ ద్వారా కానీ  సబ్మిట్ చేయవచ్చు.

ప్రస్తుతం బయోమెట్రిక్ , ఐరిష్ వంటి డివైస్ లతో పని లేకుండా మన వద్దనున్న హేండ్రాయిడ్ ఫోన్ ఉపయోగించుకొని ఫేషియల్ యాప్  డౌన్లోడ్ చేసుకొని జీవన్ ప్రనాణ్ లో చాలా సులువుగా యాన్యువల్ వెరిఫికేషన్ సర్టిఫికెట్ సబ్మిట్ చేయుటకు కేంద్రప్రభుత్వం చర్యలు తీసుకుంది.

ఈ యాప్ ఎలా డౌన్లోడ్ చేసుకోగలమో క్రింద వివరంగా తెలుసుకుందాం.


 AVC submitt చేయడానికి మన దగ్గర ఉండవలసినవి

1.Aadhar card

2.Aadhar linked Cell .

3.PPO No.

4.CFMS No. ( cfms ద్వారా పంపాలంటే)

5.cfms Password.

యాన్యువల్ వెరిఫికేషన్ సర్టిఫికెట్ సబ్మిట్ చేయుటకు మనకున్న  అన్ని పద్దతులు పరిశీలిద్దాం.


1. జీవన్ ప్రమాణ్  ద్వారా యాన్యువల్ వెరిఫికేషన్ సర్టిఫికెట్ అందచేసే విధానం:- 

మనసిస్టమ్ లో జీవన్ ప్రమాణ్ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి.

బయోమెట్రిక్ డివైజ్ ఉండిలి. దాని సాప్ట్వేర్ మన సిస్టంలో ఇన్ స్టాల్ చేసుకోవాలి.

మన ఆధార్ నెంబరు కు మన సెల్ నెంబర్ లింక్ అయి ఉండాలి. 

ఇ మెయిల్ ఉంటే మంచిది. కంపల్సరీ కాదు.

జీవన్ ప్రమాణ్ లో మన ఆధార్ ,రిజిష్టర్ సెల్ నెంబర్ ఎంటర్ చేస్తే సెల్ కు ఓ టి పి వస్తుంది. ఆ ఓటిపి ఎంటర్ చేస్తే బయోమెట్రిక్ స్కేన్  ఇవ్వమంటుంది.  ఫింగర్ ప్రింట్ మేచ్ అయితే  డిటేల్స్ వస్తాయి. ఆ డిటేల్స్ వెరిపై చేసి వివరాలు సరిపోయినవని టిక్ చేస్త్ మన పింగర్ ప్రింట్ స్కేన్ అడుగుతుంది. మన పది వేళ్ళలో ఏదోఒక పింగర్ స్కేనర్ పై ఉంచితే స్కేన్ అయి మన ఫోటోతో కూడిన AVC , మన జీవన్ ప్రణామ్ ID వస్తుంది. మనం ప్రింట్ కాపీని జీవన్ ప్రణామ్ ID ద్వారా జీవన్ ప్రమాణ్ పోర్సల్ లో లాగిన్ అయి ప్రింట్ తీసుకోవచ్చు. 


గమనిక .-జీవన్ ప్రమాణ్ పోర్సల్ సంవత్సరమంతా నిరంత రాయంగా పనిచేస్తూ ఉంటుంది.రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లు  జనవరి- పిబ్రవరి నెలలలో ఇస్తేనే సంబంధిత ట్రెజరీ అధికారులకు

ఏ వి సి వివరాలు చెరతాయి. కొందరు రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లు నవంబరు డిశెంబరు నెలలోనే జీవన్ ప్రమాణ్ పోర్షల్ నందు లైఫ్ సర్టిఫికెట్స్ ఇచ్చిఉన్నారు. అట్టి వారు ఖచ్చితంగా మరోసారి జనవరి1 నుండి పిబ్రవరి నెలాఖరులోపున మరలా నమోదు చేసుకోవలసి ఉంటుంది.


2. cfms  సైట్ ద్వారా యాన్యువల్ వెరిఫికేషన్ సర్టిఫికెట్ అప్లోడ్ చేసే విధానం:—

http://cfms.ap.gov.in 

సైట్ ఓపన్ చేసి లాగిన్ క్లిక్ చేయండి. ఓపన్ అయిన విండోలో cfms id ,Password ద్వారా లాగాన్ కాగానే  cfms Home page విండో ఓపన్ అవుతుంది. దానిలో Biometric/ Iris Device Configuration , ESS అనేవి కనిపిస్తాయి. మనం  బయోమెట్రిక్ option పై క్లిక్ చేయాలి.

అక్కడ మన యూజర్ ఐ డి , User Name , Aadhar Number desplay అవుతాయి.

తరువాత Selected Device అనే option దగ్గర మనం ఉపయోగిస్తున్న బయోమెట్రిక్ స్కేనర్  సెలెక్ట్ చేయండి.

(మనసిస్టంలో ఇప్పటికే బయోమెట్రిక్ డివైజ్ ఇన్టాల్ చేసి ఉండాలి.)

క్రింద ఉన్న సబ్మిట్ బటన్ పై క్లిక్ చేయండి.

Aadhar Biometric Finger Verification వస్తుంది. మన 10 ఫింగర్స్ లో ఏదో ఒక వేలు స్కానర్ పై ఉంచి స్కాన్ చేయండి.

సిస్టమ్ మన ఫింగర్ స్కేన్  మేచ్ అయితే యువర్ స్కేన్ సక్సెస్ పుల్ అని వస్తుంది.

తరువాత మనం ESSలోకి వెళ్ళి చూస్తే 1) Persional Information

2)Leave management.

3)Payroll Service

4)Miscellaneous Requests

5)AGLI అనే ట్యేబ్స్ కనబడతాయి.

ఇందులో 4వ అంశం *Miscellaneous Requests లో Annual Verification Certificate ( AVC) option పై clik చేయాలి.అక్కడ select any one అనే దానిపై క్లిక్ చేస్తే 3 options CFMS/Aadhar/Bank accout వస్తాయి. వాటిలో ఓ option click చేసీ details ఇస్తే మన డిటేల్స్ వస్తాయి.

 డిటేల్స్ ప్రక్కన ఉన్న Validate button click చేస్తే బయోమెట్రిక్ స్కేన్  ఇవ్వమంటుంది.  ఫింగర్ ప్రింట్ మేచ్ అయితే  డిటేల్స్ వస్తాయి.  ఆ డిటేల్స్ వెరిపై చేసి వివరాలు సరిపోతే Submitt click చేయాలి. 

ఆ మన వివరాలు మన STOగారి పంపబడతాయి. అక్కడ వెరిఫికేషన్ అయ్యాక   AVC Approved అనే  చూపిస్తుంది.


 cfms site లో AVC సబ్మిట్ చేయడం మంచిది. ఈ సైట్ లో మన AVC approve అయితే ఆవివరాలు ఖచ్చితంగా అక్కడ చూపబడి సబ్మిషన్ గడువు ముగిసాకా మన AVC రాలేదు కాబట్టీ పెన్షన్ ఆపాం అనేఅవకాశం ట్రెజరీ వారికి ఉండదు. మనం మన AVC approved/ Not approved అనే అంశం మనమే గమనించుకోగలుగుతాం.   జీవన్ ప్రమాణ్ పోర్సల్ లోనో, మరోవిధంగానో మనం మన AVC సబ్మిట్ చేసినపుడు ట్రెజరీ వారు దృవీకరించేవరకూ Approve అయింది లేనిది మనకు తెలియదు .  ఇతర రాష్ట్రాలలో / (ప్ర)దేశాలలో ఉన్న మన రాష్ట్ర పెన్షనర్లు వారు ఉన్న ప్రాంతంనుంచే ఆన్లైన్ లో యాన్యువల్ వెరిఫికేషన్ సబ్మిట్ చేయవచ్చు.


3) బయోమెట్రిక్ ద్వారా వేలిముద్రలు పడనివారు, ఐరీష్  ద్వారా ఏ వి సి పై రెండు పద్దతులలో ఇవ్వవచ్చు.


4) బయో మెట్రిక్ / ఐరిష్ విధానంలో ప్రయత్నించి వేలిముద్రలు, ఐరిష్ విఫలమయినవారు సదరు విషయం తెలియచేస్తూ మేన్యువల్ గా  పాత పద్దతిలో పారమ్ నింపి పొటో అతికించి మీ ట్రెజరీ పరిధిలోని గెజిటెడ్ ఆఫీసర్ అటెస్టేషన్ చేయించి నేరుగా మీ STO గారిని కలసి మీ లైఫ్ సర్టిఫికెట్  సమర్పించవచ్చు.


 5) కదలలేని పరిస్థితులలో ,బెడ్ రెస్ట్ లో పెన్షనర్ ఉంటే వారి వారసులు/ బంధువులు/ మిత్రులు  సదరు విషయం మీ sto office వారికి తెలియపరచితే వారి కార్యాలయ సిబ్బంది మీ ఇంటికి వచ్చి బయోమెట్రిక్  తీసుకుంటారు.


6) Government Pensioners can use the “Doorstep Service for submission of Digital Life Certificate through Postman”. This facility was launched by the Department of Posts along with Meity in November 2020. To make this facility available, the IPPB is using its national network of over 1,36,999 access points in Post Offices and more than 1,89,000 Postmen and grain Dao Sevaks. To use this facility, pensioners need to download the Posting App from Google Play Store. 


7)Government pensioners can use the Face Authentication technology based on UIDAI Aadhaar software to submit Life Certificates. The software allows the capturing of live photographs of pensioners through any Android-based smartphone for the generation of the Digital Life Certificate on the Jeevan Pramaan app.

Digital Life Certificate for Pensioners సబ్మిట్ చేయుటకు Government of India వారు  Biometric device is not required for Jeevan Pramaan Face App (Android), the app uses the camera of the mobile phone to capture the face ఇవ్వటం జరిగింది. దీని ద్వారా జనవరి నుంచి(LC)  AVC సబ్మిట్ చేయవచ్చను.  


దీని కొరకు మన ఫోన్

 Requirements for Face (Android) App

  1. Android 8.0 or above (Un-rooted device)

  2. RAM - 4+ GB.

  3. Minimum 500 MB free storage.

  4. Camera Resolution - 5MP or greater.

  5. Download Face RD Service from Google Play Store (AadhaarFaceRd) డౌన్ల్డ్ చేసాక install చేసిన తర్వాత ఆధార్ నంబర్ cell number ను enter చేసి submit చేసిన తర్వాత OTP వస్తుంది. దానిని entar చేసిన తర్వాత మీ డేటా కనిపిస్తుంది. Certificate కు టిక్ చేసి submit చేచేయాలి. మీ cell phones camera open అవుతుంది.  మీ కళ్లు పెద్దవి చేసి చూడాలి. మీ screen పై కనిపిస్తుంది. Capture అయిన తరువాత LC submit అయిపోతుంది.


డిజిటల్  యాన్యువల్ వెరిఫికేషన్ సర్టిఫికెట్  సమర్పించుచున్న పెన్షనర్స్ కు సూచనలు. 

# మనకు పిబ్రవరి 28 వరకు సమయం ఉంది కదా! అని అశ్రర్ధ చేయక  జనవరి 1నుండే వీలయినంత తొందరగా  బయోమెట్రిక్ / ఐరిష్ / ఫేషియల్ యాప్ ద్వారా మీ డిజిటల్  యాన్యువల్ వెరిఫికేషన్ సర్టిఫికెట్  సమర్పించండి .


# మనం అప్డేట్ చేయబడిన  లైఫ్ సర్టిఫికెట్  వివరాలు జీవన్ ప్రమాణ్  పోర్టల్ నుండి  మనం పెన్షన్ తీసుకుంటున్న ఎస్ టి ఓ గారికి ఆమోదం నిమిత్తం పంపబడు తుంది. వారి ఆమోదం అనంతరం మాత్రమే లైఫ్ సర్టిఫికెట్ సబ్మిషన్ ప్రోసెస్ పూర్తవుతుందని గమనించండి.


#  మీ AVC సబ్మిషన్ అయినతరువాత అకనాలెడ్జిమెంట్ తీసుకొని పరిశీలించి చూడండి. మీ అబ్యర్ధన STO గారికి పంపబడిందని అందులో ఉంటుంది.అక్కడ ఇవ్వబడ్డ STO కార్యాలయం -మీరు పెన్షన్ పొందుతున్న కార్యాలయం ఒకటా?కాదా ?నిర్ధారించుకొండి .


# ముఖ్యంగా PPO ఒక ట్రెజరీ నుండి మరొక ట్రెజరీకి ట్రాన్ఫర్ అయిన వారు AVC  ఎవరికి పంపబడిందో చూసుకోవలసి ఉంది. మనం పెన్షన్ డ్రా చేస్తున్న STO కి కాక వేరే STOకు AVC పంపబడితే వారి పరిధిలో లేనందున వారు అప్రూవ్ చేయలేరు. అపుడు పెన్షన్ ఆగే అవకాశం ఉంటుంది. అట్టి వారు AVC సబ్మిట్ అయినఅనంతరం మీ STO గారిని కలసి విషయం తెలియచేయండి. వారు సరి చేస్తారు.


# రిటైర్ అయి  మొదటి సారి జీవన్ ప్రమాణ్ లో ఏ వి సి ఇచ్చేవారి పేరు, తండ్రిపేరు , PPO No, Aadhar No, Cell No, STO office మొదలగు వివరాలను అప్డేట్ చేయాలి.  రెండవసారి ఆపై ....ఎవిసి ఇచ్చేడపుడు ఆధార్ నెంబరు , సెల్ నెంబరు ఇమెయిల్ ఐ డి (ఆప్షనల్ ) ఇస్తే సరిపోతుంది.


#  CFMS సైట్ నందు AVC submitt చేస్తే అది నేరుగా మన పెన్షన్ డ్రా చేయబడుతున్న STO కార్యాలయ సిబ్బంది-STO కు అప్రూవల్ నిమిత్తం పంపబడి మనకు డిస్ప్లే అవుతాయి. ఎప్రూవయిన తరువాత సంవత్సర కాలం AVC Approved అని చూపెడుతుంది. అకనాలడ్జెమెంట్ తో పని ఉండదు.


# సబ్ ట్రెజరీ  కార్యాలయంలో   లైఫ్ సర్టిఫికెట్ జీవన్ ప్రమాణ్ లో అప్డేట్ చేసిన వారికి   STO కార్యాలయంలో  పని ఒత్తిడి, స్టేషనరీ కొరత వల్ల అకనాలడ్జెమెంట్  ప్రింట్  తీసి ఇవ్వడం లేదు.   పోస్టల్ డిపార్టుమెంట్ వారిద్వారా ఎ వి సి సబ్మిట్ చేసినవారికి కూడా అకనాలెడ్జ్మెంట్  ఇవ్వడంలేదు. అట్టివారు మీ సెల్ కు వచ్చిన మెసేజో లో ఇవ్వబడ్డ జీవన్ ప్రమాణ్ ఐ డి ద్వారా మీరే మీ సెల్ నందు అకనాలెడ్జిమెంట్ డౌన్లోడ్ చేసుకొనే అవకాశం ఉంది. ఇది సులువుగా రెండు సైట్లలో చేసుకొనే వీలుంది. 

 ఆ విధానం -Step by step  పరిశీలిద్దాం!! 

1) Jeevan Pramaan లో..,

మీ సెల్ లో గుగుల్  లో 

http://jeevanpramaan.gov.in

సైట్ ఓపన్ చేయండి.

 మెనూబార్ లో A A+A- ....లో చివరఉన్న బొమ్మ పై క్లిక్ చేయండి. Pensioners sign in అని ఓపన్ అవుతుంది. 

అక్కడ  మనం బయోమెట్రిక్ /ఐరిష్  ద్వారా జీవన్ pramaan పోర్షల్ లో AVC upload చేసినతరువాత  మన సెల్ కు మన లైఫ్ సర్టిఫికెట్ సబ్మిట్ అయినట్టుగా వచ్చిన జీవన్ pramaan  ఐడి  ఎంటర్ చేయండి. 

Captcha Code enter చేసి Generate OTP పై క్లిక్ చేయండి.

మీ సెల్ కు రాబడిన OTP  enter చేసి లాగిన్ అవ్వండి.

మీ పేరుతో జీవన్ ప్రమాణ్ విండో ఓపన్ అవుతుంది. 

అక్కడ క్రింద ఇవ్వబడిన Download Certificate పై క్లిక్ చేయండి.

మీ ఏ వి సి ఓపన్ అవుతుంది. 

ఆపేజీ కుడివైపున ఉన్న మూడు చుక్కలపై క్లిక్ చేసి Send to  Click చేసి మీ వాట్సప్ కు పంపండి.


2) UMANG app 

 మీ సెల్ లో గుగుల్ ప్లేస్టోర్ ద్వారా UMANG app  instal చేయండి. 

ఇనస్టాల్ అయిన యాప్ లో మీ సెల్ ఫోన్ నెంబరు తో రిజిస్టర్ అయి password/MPIN సెట్ చేసుకొండి.

UMANG యాప్లో Govt. services ఉంటాయి. అందు Jeevan Pramaan పై క్లిక్ చేయండి. 

ఓపన్ అయిన విండో

Jeevan Pramaan Digital Life Certificate for Pensioners అని Generate Certificate / View Life Certificate కనిపిస్తుంది. అందులో

View Life Certificate పై క్లిక్ చేయండి.

ఓపన్ అయిన విండోలో Select mode లో Pramaan ID/ Aadhar ID లో ఒకటి ఎంచుకొని క్రింద ID/ Aadhar No enter చేసి 

Generate OTP పై క్లిక్ చేయండి.

మీ ఫోన్ కు వచ్చిన OTP enter చేయండి.

ఓపన్ అయిన విండో లో Success అని మన డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ ప్రత్యెక్షమౌతుంది. 

దానిని Save as PDF గా మన ఫోన్లో సేవ్ చేసుకోవచ్చు

Share this post in

No comments:

Newer Post
Older Post
Home
Subscribe to: Post Comments (Atom)

EXAMS

APPSC
SSC
NMMS
NTSE
HM ACT TEST
PAT
D.El.Ed
LPT
TCC
TTC
AP OPEN SCHOOL

deo websites

SRIKAKULAM
Vizianagaram
VISAKHA
W.GODAVARI
E.GODAVARI
KRISHNA
GUNTUR
PRAKASAM
NELLORE
CHITTOOR
KURNOOL
KADAPA
ANATHAPURAM

Total Pageviews

Copyright © - APTF |