పెండింగ్ ...పెండింగ్ ,పెండింగ్ 🚩
ఉద్యోగ,ఉపాద్యాయులకు సంవత్సరాలుగా డి ఏ పెండింగ్, 150 నెలలుగా డి ఏ అరియర్స్ పెండింగ్,ఉపాద్యాయులు దాచుకొన్నప్రావిడెంట్ ఫండ్ లోన్లు సంవత్సరకాలంగా పెండింగ్, మెడికల్ రీయెంబర్స్ మెంట్ బిల్స్ సంవత్సరాల తరబడి పెండింగ్,ఎపిజిఎల్ ఐసి లోన్స్ పెండింగ్,సి పి యస్ ఉద్యోగుల మ్యాచింగ్ గ్రాంట్ పెండింగ్,ఉద్యోగ ఉపాద్యాయుల రిటైర్మెంట్ బెనిఫిట్స్ పెండింగ్, ఉపాద్యాయులు సంపాదిత లీవులు సంవత్సర కాలంగా పెండింగ్,వారంలో రద్దు చేస్తానన్న సి పి యస్ 3 సంవత్సరాలుగా పెండింగ్,ఇలా చెప్పుకుంటూ పోతే వేలాది కోట్లరూపాయలు బకాయీ పడ్డ ప్రభుత్వం సుమారు 3 సంవత్సరాలుగా పెండింగ్ లో పెట్టడం తో ఉపాద్యాయుల కుటుంబాలలో కుమార్తెల పెళ్ళిళ్లు ఆగిపోయాయని,రిటైర్డ్ ఉద్యోగుల ఆపరేషన్ లు వాయిదాపడుతున్నాయని అనేక ఉద్యమ కార్యాచరణలద్వారా ప్రభుత్వం దృష్టి కి తెచ్చినా సమస్య పరిష్కరించకపోగా,ప్రతి నెలా ఒకటో తారీకు జీతం పెన్షన్ ఇవ్వడంలేదని,అశాస్త్రీయ సిపియస్ రద్దు చేయకుండా జి పి యస్ అనే కొత్త సమస్యను సృస్టిస్తున్నదని మరో వైపు నూతన జాతీయ విద్యావిధానం ముసుగులో వేలాది ఉపాద్యాయ పోస్టులు రద్దుచేస్తూ నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు భర్తీ లేకుండాచేస్తుంది...అసంభద్ద బదిలీ ఉత్తర్వులతో ఉపాద్యాయుల మద్య వైశమ్యాలు సృస్టిస్తూంది...పై సమస్య సత్వర పరిష్కారానికి ఎపిటిఎఫ్1938 రాష్ట్ర శాఖ పిలుపు మేరకు అనంతపురము జిల్లాశాఖ ఆద్వర్యంలో జిల్లా కలెక్టరేట్ ముందర ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో జిల్లా అద్యక్ష కార్యదర్శులు జి రవీంద్ర,శ్రీనివాసరెడ్డి,నాయకులు పి.వి.ప్రసాద్,విశ్వనాద్,వెంకటరెడ్డి,రఫ్ఫి,వెంకటసుబ్బయ్య,శ్రీనివాసనాయక్,బహేస్వర,నాగరాజు,నాగార్జున,రమేశ్ రెడ్డి,కె టి రంగాప్రసాద్...జిల్లా రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు.
 |
అనంత జిల్లాలో ధర్నా లో మాట్లాడుతున్న జిల్లా అద్యక్షులు జి .రవీంద్ర
|