NTR district
ఎన్టీఆర్ జిల్లాలో ఏపీ గిరిజన రెసిడెన్షియల్ పాఠశాలల్లో 2022-23 సంవత్సరానికి 18 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థులు ఈనెల 31 లోపు దరఖాస్తు చేసుకోవాలని గిరిజన గురుకులాల జిల్లా కన్వీనర్ జాన్సన్ దేవరాజ్ తెలిపారు. శుక్రవారం విలేకరులతో ఆయన మాట్లాడారు. సంవత్సరకాలానికి అవుట్ సోర్సింగ్ పద్ధతిలో నియామకాలు చేస్తున్నామని, ఆప్కాస్ ద్వారా వేతనాలు చెల్లిస్తామని తెలిపారు. ఏపీ టెట్‌లో ఉత్తీర్ణులై, ఇంగ్లీష్ మీడియంలో ప్లస్-2 లెవెల్స్ చదివి ఉండాలని, ఆంగ్లంలో బోధన చేయాల్సి ఉంటుందని తెలిపారు. బోధించే పాఠశాల ఉన్న గ్రామంలోనే నివసించాలని, సెలెక్షన్ కమిటీ ద్వారా డెమో నిర్వహిస్తామని తెలిపారు. బాలి కల పాఠశాలలో మహిళలను, బాలుర పాఠ శాలలో పురుషులను మాత్రమే నియమిస్తామని, గురుకులం రూల్స్, రూల్స్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం నియమాకాలు ఉంటాయని, పేర్కొ న్నారు. విస్సన్నపేట బాలుర గిరిజన రెసిడె న్షియల్ పాఠశాలకు దరఖాస్తులు పోస్టు ద్వారా లేదా నేరుగా ఇవ్వవచ్చని చెప్పారు. వివరాలకు 94911 10211కు ఫోన్ చేసి తెలుసుకోవచ్చని ఆయన సూచించారు.