APTF
  • Home
  • Sitemap
  • search
Home » AP INTIGRATED EDUCATIONAL RULES-1966):
AP  INTIGRATED EDUCATIONAL RULES-1966):

AP INTIGRATED EDUCATIONAL RULES-1966):


ఆంధ్రప్రదేశ్ ఇంటిగ్రేటేడ్ ఎడ్యుకేషనల్  రూల్స్-1966:
(ANDHRA PRADESH INTIGRATED EDUCATIONAL RULES-1966):

పాఠశాల నిర్వహణ-కొన్ని ముఖ్య విషయాలు:

v A.E.R Rule-46(A): ప్రవేశ సం॥లో ఆగస్టు-31 నాటికి 5సం॥(5+) వయస్సు కలిగియున్న విద్యార్ధులను ఒకటో తరగతిలో చేర్చుకోవాలి.
v A.E.R-46(B): అనుబంధం 10 ప్రవేశ దరఖాస్తు ద్వారా పాఠశాలలో విద్యార్ధులను చేర్చుకోవాలి.
v A.E.R Rule 42(C): ఒక విద్యా సం॥లో పాఠశాల ఖచ్చితంగా 220 పనిదినాలు కలిగియుండాలి.
v A.E.R.-46(J): పాఠశాలను విడిచి వేరొక పాఠశాలకు పోవునపుడు,వేరొక పాఠశాల నుండి ఈ పాఠశాలలో చేరినపుడు రికార్డు షీటు నిర్వహించాలి.
v A.E.R-45: ఒక నెలరోజులు దాటిననూ,సెలవు లేకుండా పాఠశాలకు హాజరుకాని విద్యార్ధులను పాఠశాల రోలు నుండి తొలగించవచ్చును.
v A.E.R-35: విద్యార్ధుల హాజరును, ఉదయము, మధ్యాహ్నం మొదటి పీరియడ్ ఆఖరున పుర్తిచేయాలి.
v A.E.R Rule123(B): ఉపాధ్యాయుల హాజరుపట్టిని అనుబంధం-4 ఫారాలున్న పేజీలనువాడాలి.
v A.E.R-33: ప్రధానోపాధ్యాయులు విద్యా సం॥ ప్రారంభంలోనే పాఠశాల సిబ్బంది యొక్క రోజువారీ కార్యక్రమాలను "జనరల్ టైం టేబుల్" ద్వారా తెలియజేయాలి.ఆఫీస్ రూంలోనూ,ప్రతి తరగతి గదులోనూ టైం టేబుల్ ను వ్రేలాడదీయాలి.
v Rc.No.527/E2/97,Dt:16-07-1997:పాఠశాల ప్రధానోపాధ్యాయులు, సహోపాధ్యాయులు,ఇతర సిబ్బంది తప్పనిసరిగా అసెంబ్లీ(Prayer) కు హాజరుకావాలి.లేట్ పర్మిషన్లు ఉపాధ్యాయులకు వర్తించవు.
v A.E.R Rule 77: ప్రతి ఉపాధ్యాయునికి కనీసం 24 పీరియడ్లు కేటాయించాలి.
v A.E.R Rule 99: విదేశాల నుండి, ఇతర రాష్ట్రాల నుండి T.C పై ప్రవేశము కోరు విద్యార్థులు వారు చేరే జిల్లా విద్యాశాఖాధికారి గారి కౌంటర్ సిగ్నిచర్ విధిగా ఉండవలెను.
v A.E.R Rule 124(A): అడ్మిషన్ రిజిస్టరుకు ప్రతి పేజీకి నెంబరు తప్పనిసరిగా వేయాలి. సీరియల్ నెంబరును చిన్న స్కూళ్లకు 5 సంవత్సరముల కు ఒకసారి, పెద్ద స్కూళ్లకు 3 సంవత్సరములకు ఒకసారి సంఖ్య పెద్దదై అసౌకర్యముగా ఉంటే మార్చుకోవాలి.

 ఉపాధ్యాయుల రిక్రూట్ మెంట్ లోకల్,నాన్ లోకల్ నిర్ణయించు విధానం:

v స్కూల్ స్టడీ 7 సంవత్సరములలో ఏ జిల్లాలో ఎక్కువ కాలం చదివితే దానినిబట్టి లోకల్,నాన్ లోకల్ నిర్ణయిస్తారు.
v ఒక వ్యక్తి 10వ తరగతి వరకు వేరే జిల్లాలో చదివితే అతను సొంత జిల్లాలో నాన్ లోకల్ గా పరిగణించబడతారు
v ఎక్కడా చదవకుండా ప్రయివేటుగా పరీక్ష వ్రాస్తే ఎక్కడ నివాస సర్టిఫికెట్ చూపిస్తే ఆ జిల్లాకు లోకల్ అవుతారు.
v 2 లేదా 3 జిల్లాల్లో చదివితే 7 సంవత్సరాలలో ఎక్కువ కాలం ఏ జిల్లాలో ఉంటే అదే లోకల్ అవుతుంది.
v రెండు జిల్లాలోనూ సమానంగా 3+3 ఉంటే చివరి 3 సంవత్సరాలు చదివిన జిల్లాయే లోకల్ అవుతుంది.


No comments:

Subscribe to: Comments (Atom)

Total Pageviews

Copyright © - APTF |