APTF

APTF
  • Home
  • Sitemap
  • search

WEB LINKS 1

CFMS
E-SR
CHILD INFO
CSE AP
AP SCERT
CPS
MDM
EHS
ZPPF SLIPS
APGLI

WEB LINKS 2

DIKSHA
INCOME TAX
DSC LISTS
TRANSFERS 2022
Home » Semua Post Kategori APGLI
Showing posts with label APGLI. Show all posts
Showing posts with label APGLI. Show all posts

APGLI budget released orders.

Mohan
APTF Updated at: July 24, 2021

APGLI ప్రీమియం పెంచుకోవాలంటే DDO కు ఇవ్వవలసిన అప్లికేషన్

Mohan
APTF Updated at: March 15, 2021

ఉపాధ్యాయినీ , ఉపాధ్యాయులు తమ APGLI ప్రీమియం పెంచుకోవాలంటే ఈ అప్లికేషన్ ను నింపి DDO కు ఇవ్వాలి.. APGLI ప్రీమియం మనకు ఇష్టమైతే G.O.NO.26 , తేదీ.22.02.1995 ప్రకారం మీ ప్రస్తుత బేసిక్ పే కు 20% కూడా పెంచుకోవచ్చు . అయితే APGLI ప్రీమియం బేసిక్ పే కు 20% పెంచినపుడు డాక్టర్ Good Health Certificate, గత మూడు సంవత్సరాలుగా నేను ఎటువంటి మెడికల్ లీవ్ పెట్టలేదు అని తెలిపే Non-Availment Certificate కూడా అప్లికేషన్ కు జత పరచాలి.అప్లికేషన్ ప్రింట్ కు అనుకూలంగా PDF లో కూడా ఇవ్వడమైనది. ప్రింటెడ్ కాపీ అందుబాటులో లేకపోతే ఒక వైట్ పేపర్ మీద పై సమాచారం/వివరాలు నింపి సదరు DDO కు అందచేయవచ్చు.

Sanction of APGLI Department Loan Amount of 50 Crore ₹/-G.O.RT.No. 336 Datd: 26-02-2021

Mohan
APTF Updated at: February 26, 2021

APGLI  బోనస్, మెచ్యూరిటీ లెక్కింపు గైడ్ - APGLI మెచ్యూరిటీ, బోనస్ ONLINE సాఫ్ట్ వెర్

APGLI బోనస్, మెచ్యూరిటీ లెక్కింపు గైడ్ - APGLI మెచ్యూరిటీ, బోనస్ ONLINE సాఫ్ట్ వెర్

Mohan
APTF Updated at: September 24, 2019

APGLI  బోనస్, మెచ్యూరిటీ లెక్కింపు గైడ్ - APGLI మెచ్యూరిటీ, బోనస్ ONLINE సాఫ్ట్ వెర్

 మనం ప్రతీ నెల కట్టే APGLI  పాలసీ ద్వారా మనం రిటైర్ అయ్యే సమయానికి ఎంత మెచ్యూరిటీ వస్తుంది, మనం కట్టే చందాకు వచ్చే బోనస్ ఎంత కింద సవివరం గా వివరించబడినది

దీని తో పాటు మీ APGLI  నెంబర్ ఎంటర్ చేసి మీరు రిటైర్ అయ్యే సమయానికి ఎంత మెచ్యూరిటీ, బోనస్ వస్తుందో ఒక్క క్లిక్ లో అతి సులభంగా కింది వెబ్ పేజీ లో సాఫ్ట్వేర్ ఉపయోగించి కనుక్కోవచ్చు

APGLI Maturity, Bonus Guide


Online APGLI Maturity, Bonus Calculator One Click Software



నా వయస్సు 57 ఇయర్స్.నేను ఇప్పుడు APGLI ప్రీమియం పెంచవచ్చా?

నా వయస్సు 57 ఇయర్స్.నేను ఇప్పుడు APGLI ప్రీమియం పెంచవచ్చా?

Mohan
APTF Updated at: September 17, 2019

జీఓ.36 తేదీ:5.3.2016 ప్రకారం 55 ఇయర్స్ తర్వాత ప్రీమియం పెంచటం కుదరదు.బాండ్ కూడా ఇవ్వరు

APGLI - పాలసీదారులకు మరియు డి.డి.ఓ.లకు ముఖ్య సూచనలు

APGLI - పాలసీదారులకు మరియు డి.డి.ఓ.లకు ముఖ్య సూచనలు

Mohan
APTF Updated at: July 18, 2019

*APGLI..*

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ బీమా నిర్దేశాలయము, అమరావతి, ఇబ్రహీంపట్నం

 పాలసీదారులకు మరియు డి.డి.ఓ.లకు ముఖ్య సూచనలు
               〰〰〰〰〰〰〰〰

➤ Submission of the Proposal form is mandatory.
➤ No Proposal - No Insurance Risk.
➤ DDO is solely responsible for the above items.
                〰〰〰〰〰〰〰〰

         ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ జీవిత బీమా శాఖ రాష్ట్ర ప్రభుత్వ, పంచాయతీరాజ్ మరియు మున్సిపల్ ఉద్యోగుల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం తరపున జీవిత బీమా సేవలను అందిస్తున్నది. పాలసీదారులకు మరింత చేరువ కావడానికి క్రింది సమాచారము తెలియచేయడమైనది.

*పాలసీలు పొందడం:*
       (21) నుంచి (55) సంచత్సరముల వయస్సు కలిగిన ఉద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగం పొంది మొదటి నెల జీతం డ్రా చేయు వారితో సహా ఈ శాఖ జారీ చేయు పాలసీలు పొందుటకు అర్హులు. అందుకు వారు ప్రభుత్వ ఉత్తర్యుల సంఖ్య 
36, ఆర్థిక (Admn.DI&IF) శాఖ, తేదీ: 05-03-2016 ప్రకారం దిగువ చూపినవిధముగా మూలవేతనాలకు లోబడి తప్పనిసరిగా నెలసరి ప్రీమియం జీతాల నుంచి తగ్గింపు చేసి, అట్టి తగ్గింపు చేసిన ప్రీమియం వివరాలతో కూడిన ప్రతిపాదనను డి.డి.ఓ. గారితో ధృవీకరింపచేసి సంబంధిత జిల్లా బీమా కార్యాలయములకు బాండు జారీ నిమిత్తము పంపవలెను.

*👉 2015, ఆర్.పి.యస్. ప్రకారం Pay Slabs -- నెలసరి ప్రీమియం*
➤ రూ. 12000 నుంచి రూ. 16400 వరకు -- రూ. 500/
➤ రూ. 16401 నుంచి రూ. 21230 వరకు -- రూ. 650/
➤ రూ. 21231 నుంచి రూ. 28940 వరకు -- రూ. 850/
➤ రూ. 28541 నుంచి రూ. 351200 వరకు -- రూ. 1150/
➤ రూ. 35121 నుంచి రూ. 49870 వరకు -- రూ. 1400/
➤ రూ. 43671 నుంచి ఆ పైన   -- రూ. 2000/

ప్రభుత్వ ఉత్తర్చుల సంఖ్య 26, ఆర్థిక మరియు ప్రణాళిక (అ.వి.II) శాఖ, తేది : 22-02-1995 ప్రకారం ఉద్యోగి తన అభీష్టం ప్రకారం వారి ఆరోగ్య చరిత్రకు లోబడి Pay లో 20% వరకు ప్రీమియం చెల్లించవచ్చు. ప్రీమియం పెంపుదల చేసి ప్రతిపాదన సమర్పించనిచో చురణించినపుడు INSURANCE RISK కవర్ చేయబడదు. *ప్రస్తుతం పాలసీలు ఉండి ప్రీమియం పెంచినపుడు కూడా పెంచిన మొత్తానికి అనుగుణంగా ప్రతిపాదనలు నిర్బంధంగా సమర్పించాలి.*  ఆవిధముగా జరగనపుడు బీమా అనేది ప్రతిపాదకునికి ఈ శాఖకు మధ్య జరిగే కాంట్రాక్టు కనుక మెచ్యూరిటీ / మరణము సంభవించినపుడు బీమా ప్రయోజనములు నష్టపోవలసి వస్తుంది.

     మరియు పై ప్రభుత్వ ఉత్తర్వుల సంఖ్య 36లోని 9వ పేరా ప్రకారం Pay Slab లను అనుసరించి ఉద్యోగుల వేతనాల నుంచి ప్రీమియము రికవరీ చెయ్యడం, ప్రతిపాదనలు ధృవీకరించి వెంటనే జిల్లా బీమా కార్యాలయాలకు పంపడం సంబంధిత డి.డి.ఓ.ల ప్రాధమిక బాధ్యత. అటుల చేయని యెడల సదరు ప్రీమియంలను అనధీకృత మొత్తములుగా పరిగణిస్తూ రిస్క్  గాని, బీమా మొత్తం గాని, వడ్డీ గాని, బోనస్ గాని చెల్లించబడదు.

*☸ ఋణములు :*
       పాలసీ సరెండర్ విలువలో 90% మరియు ప్రకటిత బోనస్ మేరకు ఋణాలు మంజూరు చేయబడతాయి. ఈ ఋణాలను అసలు + వడ్డీతో సులభ వాయిదాలతో (12 నుండి 48 నెలలు) వేతనాల నుంచి చెల్లింపు చేయవచ్చు.

*✳ క్లెయిములు:*
     పాలసీ మెచ్యూరిటీ అయిన పిదప పాలసీ బాండ్లు జతచేస్తూ క్లెయిము దరఖాస్తు  పూర్తి చేసి , డి.డి.ఓ.  గారి ధృవీకరణతో జిల్లా బీమా కార్యాలయానికి పంపిన అనంతరం హామీ ఇచ్చిన బీమా మొత్తం ప్రకటిత బోనస్ తో కలిపి 
పాలసీ దారునికి చెల్లించబడును. పాలసీదారుడు మరణించినట్లైతే, పాలసీ బాండ్లు జతచేస్తూ నామినీ నిర్ణీత దరఖాస్తు ఫారం పూర్తి చేసి సంబంధిత డి.డి.ఓ. గారితో ధృవీకరింపచేసి మరణ ధృవపత్రము Legal Heir Certificate, Department Information Letter సంబంధిత జిల్లా కార్యాలయములో సమర్పించవలెను.

        మంజూరైన ఋణములు మరియు క్లెయిము మొత్తములు Online Payment ద్వారా నేరుగా సంబంధిత బ్యాంకు ఖాతాకు జమ చేయబడును. అందు నిమిత్తం బ్యాంకు ఖాతా వివరములు గల Passbook మొదటి పేజీ జిరాక్సు ప్రతిని దరఖాస్తుతో  తప్పనిసరిగా జతచేయవలెను.

*👉 పాలసీదారులు / DDO లు తప్పనిసరిగా పాటించవలసిన సూచనలు :*
1. ఎ.పి.జి.యల్.ఐ. నెలసరి షెడ్యూలు నందు సరైన పాలసీ సంఖ్యను నమోదు చేయవలెను.
2, ఉద్యోగి సర్వీసు పుస్తకంలో మొదటి పేజీ నందు పాలసీ సంఖ్య విధిగా నమోదు చేయవలెను.
3. ప్రీమియం పెంచిన ప్రతిసారి ప్రతిపాదన పత్రము నింపి డి.డి.ఓ.తో ధృవీకరింపచేసి సంబంధిత జిల్లా బీమాకార్యాలయములో సమర్పించి బాండులను పొందవలెను.
4. www.apgli.ap.gov.in నందు Annual Slip ను తరచుగా పరిశీలిస్తూ Missing 
Credits ఉన్నట్లయితే సంబంధిత జిల్లా బీమా కార్యాలయాన్ని సంప్రదించి సరిచేయించుకోవచ్చు.
5. ప్రతిపాదన పత్రములోని 12, 13 మరియు 14 ప్రశ్నలలో వాస్తవాలు మాత్రమే తెలియచేయాలి.
6. ప్రతిపాదన సకాలంలో సేకరించి ఈ శాఖకు  సమర్పించి పాలసీ పట్టా పొందనిచో అట్టి సందర్భములలో ఏమైనా న్యాయపరమైన చిక్కులు భవిష్యత్తులో ఏర్పడినట్లైతే సదరు డి.డి.ఓ. వారే పూర్తి బాధ్యత వహించవలసి ఉంటుంది.మరియు అట్లాంటి సందర్భములలో ఈ బీమా శాఖ ఎలాంటి ఆర్ధిక భారం వహించదు.
7. పాలసీదారులు తమ పాలసీ సంఖ్యను ఎ.పి.జి.యల్.ఐ. పేరుతో తమ ఫోన్ బుక్ నందు Save చేసుకున్నట్లయితే, వారి రిఫరెన్సు నిమిత్తం అనుకూలంగా ఉంటుంది. ఉత్తర ప్రత్యుత్తర సమయములో పాలసీదారుని పేరు, పాలసీ
నెం., పుట్టిన తేది తప్పనిసరిగా పేర్కొనవలెను.

*👉 పాలసీదారులకు కల్పిస్తున్న సౌకర్యాలు :*
1. ఎండోమెంట్ పాలసీలలో ఆసియాలోనే అత్యధికంగా ప్రతి రూ. 1000/-కి రూ. 100/- వార్షిక బోనస్.
2. చెల్లించిన ప్రీమియం పైన, మెచ్యూరిటీ మొత్తం పైన ఆదాయపు పన్ను చట్టం 80 (సి) మినహాయింపు కలదు.
3. ఈ బీమా పాలసీలు తాకట్టు పెట్టడానికి వీలుపడదు. డిక్రీల నుంచి మినహాయింపు కలదు.
4. పాలసీలు పొందడానికి వైద్య పరీక్షలు అవసరం లేదు. పాలసీదారులు నిర్భంద ప్రీమియం కంటే అధికంగా వారి అభీష్టం మేర 20% వరకు ప్రీమియం చెల్లించుచున్న సందర్భాలలో మాత్రం వైద్య ధృవపత్రాలు అవసరం,
5. పాలసీలపై తక్కువ వడ్డీతో, సులభ వాయిదాలలో ఋణ సదుపాయం కలదు.
6, ఏ.పి.జి.యల్.ఐ. ఫండ్ రూల్సు రూల్ 31 ప్రకారం నామినేషన్ సదుపాయం కలదు.
7. పాలసీదారుల సౌలభ్యం కోసం ఏర్పాటు చేసిన www.apgli.ap.gov.in వెబ్ సైట్ నందు ప్రతిపాదన పత్రము ఋణ / క్లెయిము దరఖాస్తులు, నామినేషన్ ఫారం వంటి తదితర శాఖీయ పత్రాలు పాలసీ బాండ్లతో సహా డౌన్ లోడ్ చేసుకోవచ్చు. పాలసీల సంఖ్య వాటి వివరములు, సమర్పించిన దరఖాస్తుల ప్రస్తుత పరిస్థితి తెలుసుకోవచ్చు. పాలసీ సంఖ్య మరచిపోయినటైతే పుట్టిన తేదీ, తండ్రి పేరు వివరాలతో పాలసీ సంఖ్యను తెలుసుకోవచ్చు.

*🤝 హెల్ప్ డెస్క్ :*
      పాలసీదారులు / డి.డి.ఓ.లు సలహాలు, సందేహాల నివారణకు సంబంధిత జిల్లా బీమాధికారి వారిని నేరుగా / ఫోన్ ద్వారా సంప్రదించవచ్చు. జిల్లా బీమాధికారుల ఫోన్ వివరములు ఈ శాఖ వెబ్ సైట్ నుంచి పొందవచ్చును.

               *_పై సూచనలు తూ.చ. తప్పక పాటిస్తూ, మరింత మెరుగైన సేవలు అందించుటకు సహకరించవలసినదిగా పాలసీదారులను / డి.డి.ఓ. లను కోరడమైనది._*

సం//
బి. కన్నారావు, ఎం.ఏ.
 సంచాలకులు,
బీమా నిర్దేశాలయము,
ఆంధ్రప్రదేశ్, అమరావతి.  

ప్రభుత్వ ఉద్యోగులకు ధీమా  APGLI

ప్రభుత్వ ఉద్యోగులకు ధీమా APGLI

Mohan
APTF Updated at: May 16, 2019



 🔹ప్రభుత్వ ఉపాధ్యాయులు, ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం బీమా సదుపాయాన్ని కల్పించింది. ప్రభుత్వరంగ సంస్థ అయిన ఎల్‌ఐసీ నుంచి ప్రయివేటు భీమా కంపెనీలు పుట్టగొడుగుల్లా వెలిసిన సంగతి తెలిసిందే. వాటికి ప్రీమియం చెల్లించి బీమా చేసుకోవాలి. దానికి కట్టాలా వద్దా అన్నది వారిష్టం. అయితే ప్రభుత్వరంగ సంస్థల్లో పనిచేస్తూ ప్రభుత్వ ఖజానాద్వారా జీతాలు పొందుతున్న వారందరికి ప్రభుత్వం కూడా బీమా సౌకర్యాన్ని కల్పించింది. అదే ఏపీజీఎల్‌ఐ (ఆంధ్రప్రదేశ్‌ గవర్నమెంట్‌ లైఫ్‌ ఇన్సూరెన్సు). ప్రభుత్వ ఉద్యోగంలో చేరినప్రతీ ఒక్కరూ తప్పనిసరిగా ఈ బీమాను కట్టాల్సిందే.

బీమా తప్పనిసరి

🔹ఉద్యోగుల అభిప్రాయాలతో సంబంధం లేకుండా ప్రతీ ఉద్యోగి బీమా సభ్యత్వాన్ని తీసుకోవలసిందే. తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం చట్టం కూడా చేసింది. ఎస్జీటీ నుంచి ప్రధానోపాధ్యాయుడి వరకు, నాల్గవ తరగతి ఉద్యోగి నుంచి గ్రూప్‌-1 అధికారి వరకు పాలసీ తీసుకోవాలి. ఏ ప్రభుత్వ శాఖ అయినా వారివారి డ్రాయింగ్‌ అధికారి ద్వారా పాలసీ చేయాలి. నెలనెలా జీతం నుంచి ప్రీమియం చెల్లింపు జరుగుతుంది.

🍁ప్రీమియాలు ఇలా ఉంటాయి

♦ఉద్యోగుల జీతం ఆధారంగా ప్రీమియాలను ప్రభుత్వమే నిర్ధారించింది. జీవో నెం.36 ప్రకారం 2016 ఏప్రిల్‌ 1వ తేదీనుంచి స్లాబ్‌ రేట్లు పెరిగాయి. గతంలో రూ.150 ఉండే స్లాబ్‌ రేటును రూ.500కు పెంచారు. అందువల్ల ఉద్యోగులు వేతనం నుంచి రూ.500కు తక్కువ కాకుండా మినహాయించి ఏపీజీఏల్‌ఐకి జమచేస్తారు. గరిష్ఠంగా రూ.2 వేల వరకు ప్రీమియం నిర్ధారించారు. అయితే పేలో 20 శాతం వరకు ప్రీమియం ఉండేలా పాలసీ తీసుకునే వీలుంది.

🍁ప్రీమియం స్లాబ్‌ రేటు

రూ.13,000-రూ.16,400 మధ్య పే ఉంటే రూ.500
రూ.16,401-రూ.21,230 మధ్య పే ఉంటే రూ.650
రూ.21,231-రూ.28,940 మధ్య పే ఉంటే రూ.850
రూ.28941-రూ.35,120 మధ్య పే ఉంటే రూ.1,150.
రూ.35,121-రూ.49,870 మధ్య పే ఉంటే రూ.1,400
రూ.49,871 కంటే ఎక్కువ పే ఉంటే రూ.2,000

🍁దరఖాస్తు ఇలా చేయాలి

🔸ఏపీజీఎల్‌ఐ దరఖాస్తును ఆన్‌లైన్‌లో పంపవచ్చు. శాఖాధికారి ధ్రువీకరణ పత్రంతోపాటు దరఖాస్తులో పేర్కొన్న వివరాలు పూర్తి చేసిన ఆన్‌లైన్‌ పంపవచ్చు లేదా కార్యాలయంలో అందజేయవచ్చును. ప్రభుత్వ ఉద్యోగి పాలసీ తీసుకోవాలంటే 21-55 సంవత్సరాల మధ్య వయసు ఉండాలి. పాలసీ తీసుకున్న ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఏపీజీఎల్‌ఐ శాఖ పాలసీ బాండ్లను వారు పని చేస్తున్న శాఖాధికారుల ద్వారా పంపిస్తుంది. లేకుంటే ఆన్‌లైన్‌లోనే బాండు తీసుకోవచ్చు. ఈ బాండు పొందిన పాలసీదారులకు ప్రమాద బీమా ఉంటుంది. బాండు పోతే డూప్లికేట్‌ బాండు పొందిన తర్వాతనే పరిహారం ఇస్తారు.

🍁ప్రయోజనాలు ఎన్నో

🔸ప్రతీ వెయ్యి రూపాయల పాలసీకి రూ.100 చొప్పున ప్రతిసంవత్సరం బోనస్‌ జమ అవుతుంది.

🔹ఉద్యోగ విరమణ చేసిన తరువాత పాలసీ మొత్తంతో పాటు ఆ సమయంలో అమల్లో ఉన్న బోనస్‌ను ఉద్యోగి ఖాతాకు జమ చేస్తారు.

🔸ఇన్‌కంటాక్సు మినహాయింపు పొందవచ్చును. సెక్షన్‌ 80 (సి) ప్రకారం ప్రీమియం సొమ్ము నమోదు చేయాలి.

🔹ఉద్యోగి దురదృష్టవశాత్తు మృతి చెందితే తీసుకున్న పాలసీ మొత్తంతో పాటు అంతవరకు ప్రకటించిన బోనస్‌ను కూడా ఉద్యోగి కుటుంబానికి చెల్లిస్తారు.

🔸ఉద్యోగి మరణించిన తర్వాత ప్రీమియం కట్టనవసరం లేదు.

🔹పిల్లల పెళ్లిళ్లు, ఇంటి నిర్మాణాలు, వాహనాలు, గృహాల కొనుగోలు వంటి పలు రకల అవసరాల కోసం పాలసీల నుంచి అప్పు తీసుకోవచ్చు.

🔸కట్టిన పాలసీలో 90 శాతం వరకు రుణం పొందవచ్చు.

🔹కేవలం 9శాతం వడ్డీకి మాత్రమే రుణ సదుపాయం కల్పించారు.

🔸నెలనెలా జీతంతో పాటు రుణ బకాయిల సొమ్మును జీతం నుంచి మినహాయించి సంస్థకు చెల్లిస్తారు.

APGLI"* గురించి కచ్చితంగా ప్రతి ఒక్కరు తెలుసుకోవలసిన విషయం

APGLI"* గురించి కచ్చితంగా ప్రతి ఒక్కరు తెలుసుకోవలసిన విషయం

Mohan
APTF Updated at: January 05, 2018

*ప్రభుత్వోద్యోగుల భీమా పాలసీ*
 *"APGLI"* గురించి కచ్చితంగా ప్రతి ఒక్కరు తెలుసుకోవలసిన విషయం
LIC, PLI ల కంటే APGLI మంచిదని  చాలా మందికి తెలియదు. LIC, PLI ల గురించి ఏజెంట్లు వివరిస్తారు కాబట్టి వాటి గురించి కొంత అవగాహన ఉంటుంది. కానీ APGLI గురించి మనకు ఎవరూ చెప్పరు,
ఏదో APGLI మంచిది అంటారు కాని దాని గురించిన పూర్తి సమాచారం తెలియదు మనకి.
ఇప్పడు నేను APGLI గురించి నాకు తెలిసింది మీకు వివరిస్తాను.
ఉదాహరణకు మనం 2009 లో బర్తీ అయినప్పుడు మన APGLI చందా 350/- ఉండేది, దానికి అందరికీ 'A' బాండ్ వచ్చింది,  2015 PRC తో జీతం పెరగ్గానే ఇంకో 300/- పెరిగి చందా 650/- అయ్యింది. పెరిగిన 300/- ల కి 'B' బాండ్ వచ్చింది. కొందరికి ఇంకా రాలేదు. ఇంకొందరు అయితే బాండ్ కోసం దరఖాస్తు కూడా పెట్టి ఉండరు, దరఖాస్తు పెట్టాలనే విషయం కూడా కొందరికి తెలియదు. కొందరు APGLI గురించి అవగాహన ఉన్న వాళ్ళు వ్యక్తిగతంగా వాళ్ళ సామర్థ్యాన్ని బట్టి చందాను పెంచుకున్నారు. దానికి పెరిగిన మొత్తానికి మళ్ళీ బాండ్ లు వస్తాయి.  ఇక్కడ మీకు ఒక ముఖ్యమైన విషయం తెలియజేస్తాను.
ఎప్పుడైతే మనం APGLI అమౌంట్ ని పెంచుకుంటామో... అది జీతంలో కట్ అయి పే స్లిప్ రాగానే వెంటనే ప్రపోసల్ ఫామ్ తీసుకుని దరఖాస్తు చేయాలి. అది ఎందుకో ఒక ఉదాహరణ చెప్తాను.
మన తోటి ఉద్యోగి కానిస్టేబుల్ ఒకతను... అందరూ APGLI మంచిది అని చెప్తే తన చందా 350/- కి 2650/- కలిపి 3000/- చేశాడు. కానీ బాండ్ కోసం దరఖాస్తు చేయలేదు. దరఖాస్తు చేయాలనే విషయం అతనికి తెలియదు, ఎవరూ చెప్పలేదు. అలా రెండున్నర సం"లు గడిచిపోయాయి, దురదృష్టం వల్ల అతను ప్రమాదంలో మరణించాడు. మరణానంతరం అతనికి రావాల్సిన అన్ని బెనిపిట్స్ తో పాటు APGLI బెనిపిట్స్ కూడా వచ్చాయి, కానీ 300 రూ"ల ఒక 'A' బాండ్ బెనిపిట్స్ మరియు మాత్రమే వచ్చాయి, 2650 రూ"ల బెనిపిట్స్ రాలేదు. ఎందుకంటే అతను 'B' బాండ్ కోసం దరఖాస్తు చేయలేదు కాబట్టి. నెల నెలా 2650రూ"లు అతని జీతం నుండి కట్ అయి అతని APGLI ఖాతాలో కలిసాయి. కానీ 'B' బాండ్ కోసం దరఖాస్తు చేయకపోవడం వల్ల 2650 రూ"ల 'B' బాండ్ బెనిపిట్స్ రాలేదు, నెల నెలా కట్ అయిన 2650 రూ"ల రెండున్నర సం"ల మొత్తాన్ని వాపసు చేశారు. అతను 'B' బాండ్ కి దరఖాస్తుకు చేయకపోవడం వల్ల అతని కుటుంబం ఎన్ని లక్షల డబ్బులను కోల్పోయిందో నేను మీకు తర్వాత వివరిస్తాను.
APGLI పాలసీలో.... ఉద్యోగి యొక్క వయస్సుని బట్టి అతను కట్టే ప్రీమియంకు రేటు నిర్ణయిస్తుంది ప్రభుత్వం.
అంటే... 21 సం"ల వయస్సు నుండి 53 సం"ల వయస్సు వరకు(53 సం"ల వయస్సు తర్వాత APGLI చేయరాదు)ఈ వయస్సుకు ఇన్ని రూ"లు అని మనం కట్టే ప్రీమియం రూ"లను బట్టి మనకు బాండ్ వాల్యూ నిర్ణయించబడుతుంది. కింద చెప్పేది జాగ్రత్తగా చదివి అర్థం చేస్కోండి. ఇప్పడు నా వయస్సు ఉదా: 29 సం"లు. నేను 4000 రూ"ల ప్రీమియం కడితే నేను కట్టిన ఒక్కోరూపాయికి ప్రభుత్వం 329 రూపాయల 50 పైసలు ఇస్తుంది. అంటే 4000x329.50=13,18,000 రూ"లు. అక్షరాల 13 లక్షల 18 వేల రూ"లు నా బాండ్ వాల్యూ. 29 సం"ల వయసున్న నాకు ఇంకా 29 సం"ల సర్వీసు ఉంది, ఈ సర్వీసు కాలం 29 సం"లకు నా బాండ్ వాల్యూ 1318000 రూ"లకు సంవత్సరానికి 10% బోనస్ ఇస్తుంది. అంటే 1318000X290%=3822200/- అక్షరాల 38 లక్షల 22 వేల 200 రూ"లు నా పదవీ విరమణ సమయంలో బోనస్ గా వస్తుంది. మరియు బాండ్ వాల్యూ+బోనస్ కలిపి అంటే 1318000+3822200=5140200/- అక్షరాలా 51 లక్షల 40 వేల 200 రూ"ల వరకు(కొంచం అటూ ఇటూ గా) నేను నా పదవీ విరమణ సమయంలో తీసుకుంటాను.
 *ఇది మీరు నమ్మగలరా....?*
నేను కట్టే నెల నెలా 4000 లు 29 సం"లకి 13,92,000 మాత్రమే... కానీ నేను నా 58 సం"ల వయస్సలో అరకోటి పైగా తీస్కుంటాను. LIC కాదు, PLI కాదు ఏ భీమా కంపెనీ కూడా ఇంత పెద్ద మొత్తం ఇవ్వదు ఒక APGLI మాత్రమే ఇస్తుందని ఘంటాపథంగా చెప్పగలను. ఇది నిజం ఎందుకంటే... వేరే భీమా కంపెనీలు వాళ్ళ వేల మంది ఉద్యోగులకు జీతాలివ్వాలి, ఏజెంట్లకు కమీషన్ లు ఇవ్వాలి, అవన్నీ ఎక్కడి నుండి ఇస్తాయి మనం కట్టే డబ్బుల నుండే కదా.... మళ్ళీ లాభాలు రావాలి.
APGLI ప్రభుత్వాదినిది, దీంట్లో వచ్చే లాభాలు ఎవరూ పంచుకోరు, ప్రభుత్వం దీని నుండి రాబడి ఆశించదు. అందువల్ల మనకు ఎక్కువ బెనిఫిట్స్ ఇస్తుంది.
మరణించిన మన తోటి ఉద్యోగి కానిస్టేబుల్  అతని 25 సం"ల వయస్సులో 2650/- కి అతని చందా పెంచి, 'B' బాండ్ కి దరఖాస్తు చేయక, 28 సం"ల వయస్సులో అతను మరణించడం వల్ల  అతని కుటుంబం కోల్పోయిన మొత్తం రెండున్నర సం"ల బోనస్ తో కలిపి ఎంతో తెలుసా....?
అక్షరాలా 12 లక్షల 38 వేల 610 రూ"లు. ఇది ఎవరూ ఆర్చలేని, తీర్చలేని నష్టం.
అతను తెలియక చేసిన తప్పును మనం ఎవరమూ చేయకూడదు.
 ఇప్పుడు నేను, వయస్సుల వారిగా.... మనం కట్టే రూపాయికి ప్రభుత్వం ఇచ్చే వెలను కింద ఇస్తాను. మీరు బాగా అలోచించి APGLI చందాను మీ సామర్థ్యాన్ని బట్టి ఎంత పెంచాలో నిర్ణయించుకుని ఆ విధంగా ముందుకు వెళ్ళండి.
*Age*     -     *Rate*
25        -     389.50
26        -     374.10
27        -     359  
28        -     344.10
29        -     329.50 
30        -     315.10 
31        -     301
32        -     287.20
33        -     273.60
34        -     260.30
35        -     247.30
చూడండి బ్రదర్స్... వయస్సు పెరిగినా కొద్దీ.... ప్రభుత్వం ఇచ్చే వెల తగ్గుతూ వచ్చింది కదా... ఎందుకంటే వయస్సు పెరుగుతున్న కొద్దీ మనిషికి రిస్క్ పెరుగుతుంది. అందుకని ఏ జీవిత భీమా కంపెనీ అయినా వయస్సును బట్టి పాలసీని నిర్ణయిస్తాయి.
తాత ముత్తాతలు సంపాదించిన ఆస్తి అయినా ఉండాలి లేదంటే యవ్వనంలో చేసిన APGLI బీమా పాలసీలైనా ఉండాలి అని.
చిన్న వయస్సులోనే పాలసీ చేస్తే  చాలా ఎక్కువ భీమా అమౌంట్ మనకు వస్తుంది. అందుకని ఆలస్యం చేయకండి.
సమయం లేదు మిత్రులారా.... పెంచని వాళ్ళు పెంచండి, పెంచిన వాళ్ళు బాండ్ లకి దరఖాస్తు చేయండి.
ఈ సమాచారాన్ని అన్ని బ్యాచ్ ల తమ్ముళ్ళకి తెలియజేసి వాళ్ళతో  APGLI అమౌంట్ పెంచుకోమని చెప్పండి. అలాగే సీనియర్స్ కి కూడా తెలియజేయండి.
x

Older Posts
Subscribe to: Comments (Atom)

EXAMS

APPSC
SSC
NMMS
NTSE
HM ACT TEST
PAT
D.El.Ed
LPT
TCC
TTC
AP OPEN SCHOOL

deo websites

SRIKAKULAM
Vizianagaram
VISAKHA
W.GODAVARI
E.GODAVARI
KRISHNA
GUNTUR
PRAKASAM
NELLORE
CHITTOOR
KURNOOL
KADAPA
ANATHAPURAM

Total Pageviews

Copyright © - APTF |