APTF

APTF
  • Home
  • Sitemap
  • search

WEB LINKS 1

CFMS
E-SR
CHILD INFO
CSE AP
AP SCERT
CPS
MDM
EHS
ZPPF SLIPS
APGLI

WEB LINKS 2

DIKSHA
INCOME TAX
DSC LISTS
TRANSFERS 2022
Home » Semua Post Kategori CPSNEWS
Showing posts with label CPSNEWS. Show all posts
Showing posts with label CPSNEWS. Show all posts

NPS ఉద్యోగులకు షాక్...జనవరి నుంచి కొత్త రూల్స్...ఇక వాళ్ళు ఆన్లైన్ లో డబ్బులు విత్ డ్రా చేయలేరు

Mohan
APTF Updated at: December 28, 2022



కోవిడ్ 19 కారణంగా పెన్షన్ రెగ్యులేటర్ పీఎఫ్ఆర్ఏడీఏ గతంలో రూల్స్‌ను సవరించింది


2021 జనవరి నుంచి ఎన్‌పీఎస్ సబ్‌స్క్రైబర్లు పాక్షికంగా ఎన్‌పీఎస్ డబ్బులను (Money) విత్‌డ్రా చేసుకునే వెలుసుబాటు కల్పించింది.


 ఆన్‌లైన్‌లోనే ఈ విత్‌డ్రాయెల్ ఫెసిలిటీ అందుబాటులో ఉండేది.


అయితే ఇప్పుడు కోవిడ్ 19 ప్రతికూల పరిస్థితులు సమసిపోయాయి. దీంతో పీఎఫ్ఆర్‌డీఏ కూడా కీలక నిర్ణయం తీసుకుంది.


కరోనా కారణంగా తీసుకువచ్చిన సెల్ఫ్ డిక్లరేషన్ ఆన్‌లైన్ పాక్షిక విత్‌డ్రాయెల్ ఫెసిలిటీని తొలిగిస్తున్నట్లు వెల్లడించింది.


గవర్నమెంట్ సెక్టార్‌కు సంబంధించి ఈ రూల్ వర్తిస్తుందని తెలిపింది.


అంటే ప్రభుత్వ ఉద్యోగులు .ఇకపై ఆన్‌లైన్‌లో కోవిడ్ 19 కింద పాక్షికంగా డబ్బులు విత్‌డ్రా చేసుకోవడం కుదరదు.


2023 జనవరి 1 నుంచి ఈ కొత్త రూల్ అమలులోకి వస్తుందని పీఎఫ్‌ఆర్‌డీఏ తెలిపింది.


కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఇతర సెంట్రల్ అటానమస్ బాడీస్‌కు ఈ కొత్త రూల్ వర్తిస్తుందని గుర్తించుకోవాలి. గతంలో మాదిరి సెల్ఫ్ డిక్లరేషన్ ఇచ్చి ఆన్‌లైన్‌లో ఎన్‌పీఎస్ నుంచి డబ్బులు వితడ్రా చేసుకోవడం ఇక కుదరదని గుర్తించుకోవాలి.


ఇకపై వీరందరూ ఎన్‌పీఎస్ డబ్బులు విత్‌డ్రా చేసుకోవాలని భావిస్తే.. అందుకు సంబంధించిన రిక్వెస్ట్‌ను సంబంధిత నోడల్ ఆఫీస్‌కు పంపాల్సి ఉంటుంది.


అయితే వాలంటరీ నాన్ గవర్నమెంట్ ఎన్‌పీఎస్ సబ్‌స్క్రైబర్లకు మాత్రం ఆన్‌లైన్‌లో పాక్షిక విత్‌డ్రాయెల్ ఫెసిలిటీ కొనసాగుతుందని పీఎఫ్‌ఆర్‌డీఏ తెలిపింది. ఎన్‌పీఎస్ వాలంటరీ విభానికి చెందిన వారు ఆన్‌లైన్‌లో పాక్షికంగా డబ్బులు విత్‌డ్రా చేసుకునే ఫెసిలిటీ ఉపయోగించుకోవచ్చు. అయితే ఇలా పాక్షికంగా డబ్బులు విత్‌డ్రా చేసుకోవాలని భావించే వారు కొన్ని విషయాలు గుర్తించుకోవాలి. కనీసం మూడేళ్లు ఎన్‌పీఎస్ అకౌంట్‌కు కంట్రిబ్యూట్ చేసి ఉండాలి. విత్‌డ్రాయెల్ అమౌంట్ కంట్రిబ్యూషన్ అమౌంట్‌లో 25 శాతం దాటకూడదు. ఎన్‌పీఎస్ సబ్‌స్క్రైబర్లు కేవలం మూడు సార్లు మాత్రమే ఈ ఫెసిలిటీని ఉపయోగించుకోగలరు.


పిల్లల చదువు, పిల్లల పెళ్లి, ఇంటి కొనుగోలు లేదా నిర్మాణం, క్రిటికల్ ఇల్‌నెస్ ట్రీట్‌మెంట్ కోసం డబ్బులు పాక్షికంగా విత్‌డ్రా చేసుకోవచ్చు. ఇకపోతే ఎన్‌పీఎస్ స్కీమ్‌లో చేరడం వల్ల పలు రకాల ప్రయోజనాలు పొందొచ్చు. పెన్షన్‌తో పాటు ఒకేసారి భారీ మొత్తంతో డబ్బులు లభిస్తాయి. మెచ్యూరిటీ తర్వాత ఈ బెనిఫిట్ ఉంటుంది. అలాగే ట్యాక్స్ బెనిఫిట్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. అందుకే చాలా మంది ఎన్‌పీఎస్ స్కీమ్‌లో చేరుతూ ఉంటారు. ఆన్‌లైన్‌లో కూడా మీరు ఈ స్కీమ్‌లో చేరొచ్చు.




CPS meeting minutes - 06-12-2022

CPS meeting minutes - 06-12-2022

Mohan
APTF Updated at: December 28, 2022


Click Here to Download  CPS meeting minutes

CPS పై SURYA C( ఖజనా శాఖ) గారి విశ్లేషణ

CPS పై SURYA C( ఖజనా శాఖ) గారి విశ్లేషణ

Mohan
APTF Updated at: December 08, 2022

 ప్రాయోజిత సమాచారం

ఎపిటీఎఫ్ 1938


CPS పై SURYA C( ఖజనా శాఖ) గారి విశ్లేషణ:


ప్రాథమిక అవగాహన ఉంటే ఇలా చెప్పరు. పెన్షన్ వల్ల ప్రభుత్వం పై భారం పడుతోంది అనేది పైకి కనిపించే ఒక అందమైన అబద్ధం.  ఎందుకంటే ఓ నలభై ఏళ్ల క్రితం ప్రభుత్వ బడ్జెట్ లో జీతాల, పెన్షన్ ల భారం ఎంత ఉందో, ఎప్పుడూ అంతే ఉంది తప్ప ఏ మాత్రం పెరగలేదు. 


అలాగే CPS అనేది వాస్తవం గా చెప్పాలంటే ప్రభుత్వాలు భరించలేని భారం. దాని ప్రభావం ఇప్పటికే కనిపిస్తోంది. ప్రస్తుతం CPS ఉద్యోగులు తక్కువ వేతన జీవులు. అలాగే ఇప్పటికే 50% మంది మాత్రమే ఉన్నారు. ఈ మాత్రం దానికే ప్రభుత్వ వాటా చెల్లించడానికి ఆపసోపాలు పడుతున్నారు. 10 నెలలు గా సుమారు 3000 కోట్లు ప్రభుత్వం బకాయి పడింది.  రిటైర్ అయిన వారి GPF చెల్లించలేక ఆపసోపాలు పడుతోంది. దీనికి కారణం ఇదే CPS నే. 


CPS విధానం ఎంత లోప భూయిష్టం అనేది ఇటీవల కేంద్రం రాష్ట్రాలకు ఇచ్చిన ఒక బంపర్ ఆఫర్ నే ఒక మంచి ఉదాహరణ. CPS లో ప్రభుత్వ వాటా గా ఎంత సొమ్ము చెల్లిస్తే అంత మేరకు ప్రభుత్వం నిర్దేశిత పరిమితి దాటి అప్పు చేసుకోవచ్చు. ఉన్నట్టుండి ఎందుకు కేంద్రానికి అంత ఉదార స్వభావం? రాజస్థాన్, ఛత్తీస్ ఘడ్ రాష్ట్రాల CPS రద్దు ప్రభావం. నిజానికి ఆ రాష్ట్రాల్లో CPS పట్ల కాస్త అసంతృప్తి ఉన్నా తీవ్ర స్థాయిలో ఉద్యమాలు ఏమీ చేయలేదు. ప్రభుత్వం తో చర్చలు ఏమీ చేయలేదు. రద్దు చేస్తామని ఎన్నికల హామీ ఏమీ ఇవ్వలేదు. అదే విధంగా మరీ దగ్గరలో ఎన్నికలు కూడా ఏమీ లేవు. మరెందుకు ఉన్న పళంగా ఆఘ మేఘాల మీద రద్దు చేసేశారు. ఒక చిన్న డిమాండ్ కోసం మన నాయకులు 10 సార్లు తిరిగితే తప్ప కనీసం కదలిక కూడా రాదు. మరెందుకు ఉన్న పళంగా ఉద్యోగులపై అంత ప్రేమ పుట్టుకు వచ్చింది. 

పైకి ఉద్యోగుల పట్ల ఉదారంగా వ్యవహరించినట్లు కనిపించినా పైకి కనిపించని మరో అంశం. దీనిని భరించలేని పరిస్థితి. ఇది ఇలాగే కొనసాగితే క్రమక్రమంగా ఒక్కొక రాష్ట్రము ఇదే బాట పడతాయని గ్రహించిన కేంద్రం వెంటనే ఉదారత చూపింది. CPS పై ప్రభుత్వం ఎంత చెల్లిస్తే అంతా అదనంగా అప్పు చేసుకోవడానికి ఉదారంగా వెసులు బాటు ఇచ్చింది. 40-50 ఏళ్ల తరువాత CPS వల్ల ప్రభుత్వాలపై పెన్షన్ భారం తగ్గుతుంది అనే కదా ఈ విధానం తీసుకు వచ్చింది. కానీ, ప్రస్తుత పరిస్థితి ఏమిటి అప్పులు చేసి ప్రభుత్వ వాటా చెల్లించాల్సిన పరిస్థితి ఉంది. ఇలా చేసిన అప్పులు 15-25 ఏళ్ల తరువాత తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. మళ్లీ ఈ అప్పులు తీర్చడానికి కూడా మళ్లీ అప్పులు చెయ్యాలి. అదే పాత పెన్షన్ విధానం లో ఇంత భారం ఉండదు. 


పైన ఒక మాట చెప్పాను. GPF లు తిరిగి చెల్లించలేక పోతున్నాయి అని. CPS కి GPF కి ఉన్న సంబంధం ఏమిటి? 


ఉద్యోగుల GPF ఖాతాల్లో ఉన్న సొమ్ము ప్రభుత్వ నియంత్రణ లోనే ఉంటుంది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా చూసుకుంటే కొన్ని లక్షల కోట్ల రూపాయలు GPF లో ఉంటుంది. 20 ఏళ్ల క్రితం తీసుకుంటే GPF లో 100 జమ అయితే 10 WITHDRAW అయ్యేది. అది అలా కొనసాగుతూనే ఉండేది. అందువల్ల ప్రభుత్వానికి ఎప్పుడూ లోటు కనపడదు. GPF జమ చేసిన సొమ్ము ప్రభుత్వం ఏమీ లాకర్ల లలో దాచి ఉంచదు. తన అవసరాలకు ఉపయోగించుకుని తిరిగి ఇవ్వాల్సి వచ్చినపుడు ఇస్తుంది. దీని వల్ల ప్రభుత్వానికి నిధుల లభ్యత పెరుగుతుంది.బయట నుండి అప్పులు ఏ తెచ్చు కావాల్సిన అవసరం తప్పుతుంది. ఎప్పుడో కూడా జమ అయ్యే మొత్తం ఎక్కువ WITHDRAW చేసేది తక్కువ ఉండటం వల్ల ఎప్పుడూ ప్రభుత్వానికి ఇబ్బంది రాదు. 


CPS పెట్టిన తరువాత జరిగింది ఏమిటి? PF ఖాతా దారులు తగ్గుతూ వస్తున్నారు. జమలు తగ్గుతూ వస్తున్నాయి. రిటైర్ అయ్యే కొద్దీ WITH DRAW లు పెరుగుతున్నాయి. ఎప్పుడో వడేసుకున్న సొమ్ము తిరిగి చెల్లించాల్సిన పరిస్థితి. 


మరో పక్క CPS లో మినహాయించి న మొత్తం ప్రభుత్వ వద్ద ఉండకపోగా, డానికి అంతే మొత్తం జమ చేసి మరీ చెల్లించాలి. 


అంటే ఒక్కమాటలో చెప్పాలంటే ఎప్పుడూ పాతికేళ్ళ క్రితం వాడేసుకున్న డబ్బులు ఇప్పుడు ప్రభుత్వం చెల్లించాల్సి వస్తోంది.

ఎప్పుడో పాతికేళ్ళ తరువాత చెల్లించాల్సిన పెన్షన్ ఇప్పుడే చెల్లించాల్సి వస్తోంది. 

ఇప్పుడు జీతం ఎలాగా ఇప్పుడే చెల్లించాలి.


దీని పర్యవసానం. GPF సొమ్ము చెల్లించలేక పోవడం. CPS ప్రభుత్వ వాటా కోసం అప్పులు చేయడం. పదవీ విరమణ చెందిన వారికి చెల్లించలేక పదవీ విరమణ వయసు వాయిదా వేసుకుంటూ పోవడం. 


ఒక్క మాటలో చెప్పాలంటే ఉద్యోగులకు తగిన సెక్యూరిటీ లేదు. ప్రభుత్వాలు భరించలేవూ.

మరి ఎవరికీ ఉపయోగం. 

ప్రభుత్వానికి నిధుల కొరత - అప్పులు, ఫండ్ మేనేజర్లకు,కంపెనీలకు నిధుల లభ్యత - పెట్టుబడులు.



అసలు ప్రభుత్వ ఉద్యోగులకు పనేమీ చేయించు కోకుండా పెన్షన్ ఎందుకు చెల్లించాలి? ఒక సారి కండక్ట్ రూల్స్ చూడండి.


1. ప్రభుత్వ ఉద్యోగి నిబంధనల మేరకు తన జాబ్ తప్ప మరే అదయార్జన కలిగే వ్యాపారాలు చేయకూడదు. పార్ట్ టైం జాబ్ లు చేయకూడదు. పెట్టబడులు పెట్టీ - కంపెనీలలో భాగస్వామ్యం కలిగి ఉండకూడదు. ట్రేడింగ్ లాంటి స్పెక్యులేషన్ చేయకూడదు. యూట్యూబ్ ఛానల్, వెబ్సైట్ లు కూడా ముందస్తు అనుమతి లేకుండా నిర్వహించ కూడదు. ఆదాయం సంపాదించ కూడదు. 


2. ప్రభుత్వ ఉద్యోగులు తమ కు నచ్చినట్లుగా స్వేచ్చగా స్థిర చరాస్తులు కొనుక్కునే అవకాశం లేదు. ప్రతీ దానికీ లెక్కలు చెప్పాలి, అనుమతి పొందాలి. 


3. ప్రభుత్వ ఉద్యోగులు బ్యాంకుల నుండి మినహా అప్పులు కూడా చేయకూడదు. డబ్బులు ఎక్కువగా ఉన్నా వడ్డీలకు అప్పులు ఇవ్వకూడదు. 


4. ప్రభుత్వ ఉద్యోగులు 24 గంటలు, 365 రోజులు కూడా విధులకు అందుబాటులోనే ఉండాలి.  నిర్దిష్టమైన సమయం, పనిగంటలు ఉండవు. అందువల్ల అదనపు సమయం పని చేయడం అనేది ఉండదు (24 గంటలు డ్యూటీ గా పరిగణిస్తారు కాబట్టి) అదనపు చెల్లింపులు ఉండవు. 


5. ప్రెస్, మీడియా తో మాట్లాడకూడదు. 

6. ప్రభుత్వ విధానాలను విమర్శించ కూడదు.


7. చివరకు జీత నష్టపు సెలవులో ఉన్నా, సస్పెన్షన్ లో ఉన్నా కూడా ఒక్క రూపాయి కూడా సంపదించు కోవడానికి  వీలు లేదు. అప్పులు చేయడానికి వీలు లేదు. అడుక్కుని కూడా తినకూడదు. (ప్రభుత్వ ఉద్యోగి ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగేలా ప్రవర్తించ కూడదు) 


8. ఎంత ప్రతిభ ఉన్నా దానిని మనం రూపాయి గా మార్చుకోవడానికి అవకాశం లేదు.


ఇలా ఎన్నో రకాల restrictions మధ్య ఉద్యోగులు పని చేయాల్సి ఉంటుంది. 


ఒక పని చేయమని చెప్పండి. పైవన్నీ మర్చేయమని చెప్పండి. కార్మిక చట్టాలు వర్తించే వారిలాగా గంటలు నిర్దేశించ మని చెప్పండి. మిగిలిన సమయం మనకు నచ్చినట్లు బ్రతికే స్వేచ్ఛ ఇవ్వమని చెప్పండి. అసలు నాకు OPS అవసరం లేదు, CPS కూడా అవసరం లేదు. నా జీతం ఎంత వస్తుందో, దానికన్నా ఎక్కువ మొత్తం అదనంగా నేను సంపాదించుకోగలను.


సంపాదించుకునే ఓపిక, వయసు ఉన్నంత కాలం ఉన్న తెలివినీ, శ్రమను, ఓపిక ను మొత్తం ప్రభుత్వం కోసం వెచ్చించిన దానికి ఇచ్చే ప్రతిఫలమే పెన్షన్. మరి రిటైర్ అయిన తరువాత మీ చావు మీరు చావండి అంటే ఎలా?

CPS ఉద్యోగుల నవంబర్ 21 మరియు డిసెంబర్ 2021 జీతాల నుండి మినహాహించిన CPS ను PRAN ఖాతాలలో కి ఫిబ్రవరి 14 లోపల అప్లోడు చేయుటకు ట్రెజరీ అధికారులకు ఆదేశాలు జారీ

CPS ఉద్యోగుల నవంబర్ 21 మరియు డిసెంబర్ 2021 జీతాల నుండి మినహాహించిన CPS ను PRAN ఖాతాలలో కి ఫిబ్రవరి 14 లోపల అప్లోడు చేయుటకు ట్రెజరీ అధికారులకు ఆదేశాలు జారీ

Mohan
APTF Updated at: February 14, 2022

 Memo No. FIN02-160134/7/2020-F SEC-DTA Dated 11/02/2022


Attention of all the Deputy Directors of District Treasuries in the State is invited to the references cited. It is informed that CPS data for the month from Nov’ 2021 & Dec’ 2021 paid in Dec’ 2021 & Jan’ 2022 respectively including pending data of the earlier period is provided access to all the Unit Ofcers.


They are requested to take necessary action to process it for generation of text fles and upload them to the CRA as per the procedures prescribed, positively by Feb 14, 202 2. This process contain some arrear data also and therefore, it may take some long time to get the desired output. They shall also take immediate follow-up action to transfer funds as per the orders issued in GO Ms. No. 196, Dated 24/07/2012 of Finance (Pen. I) Department and instructions issued in this ofce memo 01st cited. Since it is a regular subscription upload, Government contribution shall be adjusted from the HOA: 2071-01-117-00- 04-320-321-VN to the HOA: 8342-00-117-11-04-001-002-VN. They should take action to minimize the time gap between SCF upload and funds transfer. The process of drawl of funds and their transfer should be completed on T* + 2 basis as already instructed in this ofce Circular Memo 04th cited. 


They are specifcally informed that, the validity period of SCF / Trans ID is ten days only. They should transfer the funds within fve days. Otherwise the Trans ID gets lapsed. 


N. Mohana Rao 

Director of Treasuries and Accounts


Click Here to Download  Memo No. FIN02-160134/7/2020-F SEC-DTA



తమిళనాడు ప్రభుత్వం పాత పెన్షన్ విధానం అమలుకు నిర్ణయం తీసుకొంది అనేవార్తకు సంబంధించిన లేఖ

Mohan
APTF Updated at: June 19, 2021

తమిళనాడు ప్రభుత్వం పాత పెన్షన్ విధానం అమలుకు నిర్ణయం తీసుకొంది అనేవార్తకు సంబంధించిన ఈ లేఖ .......                                                     

తమిళనాడు ప్రభుత్వం ఇంతవరకు CPS Contribution అమౌంట్ ను ఉద్యోగులనుండి మినహాయించి లేదా NPS Trust కు బదిలీ చేయకుండా తన దగ్గరే ఒక ప్రత్యేక ఖాతాలో పెట్టుకొంటూ వచ్చింది. (దీనికి కారణం Employees Union CPS అమలును తీవ్రస్థాయిలో వ్యతిరేకించటం, ఉద్యోగికి Final CPS చెల్లింపు సందర్భంగా అయ్యే వడ్డీని ప్రభుత్వమే భరించాలి.) సదరు మొత్తాన్ని తమకు Transfer చేయమని NPS Trust వారు నూతన DMK ప్రభుత్వాన్ని అడుగగా ప్రస్తుత DMK ప్రభుత్వం  "పాత పెన్షన్ అమలు మీద అద్యయనం కొరకు నియమించిన కమిటీ తమ రిపోర్టును ప్రభుత్వానికి సమర్పించి వున్నందున దానిమీద ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకొన్న తరువాత ఆమేరకు  Appeal అయిన CPS అమోంట్ NPS కు Transfer విషయాన్ని పరిశీలిస్తాము"  అని తమిళనాడు ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సమాధానం. OPS అమలుకు నూతన ప్రభుత్వం హామీ ఇచ్చి ఉన్నందున, దానిపైన నియమించిన కమిటీ రిపోర్ట్ పరిశీలనలో ఉన్నందున PFRDA కు ఆ మొత్తం బదిలీ చేసే విషయం తర్వాత నిర్ణయిస్తామని మాత్రమే  TN GOVT బదులు ఇచ్చింది. దీని అర్థం CPS రద్దు కు TN ప్రభుత్వం కట్టుబడి ఈ ఉత్తర్వులు ఇచ్చినట్లు తెలుస్తోంది.

2002 DSC (CPS)వారికి old pension scheme implementation లో బాగంగా వారి వివరాలు అడుగుతూ guntur deo గారి proceedings

Mohan
APTF Updated at: November 25, 2020

 




ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిపిఎస్ మీద కమిటీ వేసింది :: G.O.RT.No. 2052, Dated: 28-11-2018  ఉత్తర్వులు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిపిఎస్ మీద కమిటీ వేసింది :: G.O.RT.No. 2052, Dated: 28-11-2018 ఉత్తర్వులు

Mohan
APTF Updated at: November 28, 2018

GOVERNMENT OF ANDHRA PRADESH ABSTRACT
Contributory   Pension   Scheme   (CPS/NPS)-   An  Expert   Committee   for  review   of  the
Contributory Pension Scheme and examining demand for continuing Old Pension Scheme – Constituted – Orders – Issued.
…………………………………………………………………………………………

FINANCE (HR.3-PENSION-I) DEPARTMENT

G.O.RT.No. 2052                                                                        Dated: 28-11-2018
Read the following : -

  1. G.O.Ms.No.653 Finance(Pen-1) Department, dated: 22.09.2004.
  2. G.O.Ms.No.654 Finance(Pen-1) Department, dated: 22.09.2004.
  3. G.O.Ms.No.655 Finance(Pen-1) Department, dated: 22.09.2004.
  4. Representations from various Service Associations, public representatives for restoration of Old Pension Scheme.


ORDER :

In  G.O.  1st  to  3rd  read  above,  Government  of  Andhra  Pradesh  adopted  the Government  of India's  New  Pension  Scheme  based  on  Defined  Contributions  for  the employees of the State who are newly recruited on or after 01.09.2004.

  1. Several  representations   and  requests  have  been  received  from  various  service associations and people representatives for de-adoption of Contributory Pension Scheme and restoration of Old Pension Scheme for the State Government employees.



1
Sri. S.P.Tucker, IAS (Retd), Former Chief Secretary to Government

:


Chairperson


2
Sri. Peeyush Kumar, IAS , Secretary to Govt (FP), Finance Department

:


Member Secretary


3
Sri. D.Venkata Ramana, Secretary to Government, Law Department

:


Member


4
Prof.  K. Muniratnam Naidu
(Retd),
Professor in Economics, S.P.Mahila University, Tirupathi


:


Member


5
Prof Galab,
Professor in Economics, Director, CESS, Hyderabad


:


Member
  1. Keeping in view of the representations from the service associations and people representatives,  the Government hereby constitute an Expert committee with the following composition.

  1. Terms of reference for the committee:
  •  i. To submit a detailed report analysing the repercussions, both legal and financial of reviewing the Contributory Pension Scheme now in force.

  • ii. To submit a detailed report analysing the impact of Contributory Pension Scheme on the State Finances.

  • iii.    To suggest propositions regarding the liabilities and risks that may arise out of the agreements entered into with NPS trust and NSDL.

  • iv. In  case  it  is  to  withdraw  the  Contributory  Pension  Scheme  and  in  lieu  of  it  to implement the Statutory Pension Scheme, suggest propositions for refund of the contributions made by the employees & employer so far?

  • v. In  case  it  is  to  withdraw  the  Contributory  Pension  Scheme  and  in  lieu  of  it  to implement the Statutory Pension Scheme, what will be the legality of such a decision with respect to those who have already retired from service after serving under the Contributory Pension Scheme? or expired while in service?.

  • vi. To analyse the status of the scheme in detail and the experiences and current scenarios of other states that have implemented the Contributory Pension Scheme.

  • vii.      In case if the scheme is continued, what are the various steps that can be taken to make it more attractive/beneficial?

  • viii.      To make suggestions in other matters that the committee finds relevant with regard to the review of the Contributory Pension Scheme.


  1. The term of the committee shall be 3 months from the date of issue of orders.
 Click Here to Download G.O Copy

FAFTO & APCPSUS కలెక్టరేట్ ముట్టడి దృశ్యాలు 01.09.18

Mohan
APTF Updated at: September 04, 2018

ఆంధ్రజ్యోతి -FAPTO news కృష్ణాజిల్లా

ఈనాడు-FAPTO news కృష్ణాజిల్లా

సాక్షి-FAPTO news కృష్ణాజిల్లా

అనంతపురం
కాకినాడ,కలక్టరేట్ వద్ద రాజమహేంద్రవరం కార్యకర్తలు
కాకినాడ,కలక్టరేట్ వద్ద రాజమహేంద్రవరం కార్యకర్తలు
FAPTO CPS Muttadi at Eluru WG
మహిళా ఉపాధ్యాయుల తో నిండిపోయిన పోలీస్ స్టేషన్లు.,,* మహిళా శక్తి మీకు జోహార్లు*
శ్రీకాకుళం
నెల్లూరు ... కలెక్టరేట్ ముట్టడిలో ఏపీటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి చిరంజీవి, జిల్లా ఉపాధ్యక్షుడు శివకోటారెడ్డి, పెద్దఎత్తున హాజరైన ఏపీటీఎఫ్ శ్రేణులు,
CPS రద్దు పై    నెల్లూరు జరిగిన కలెక్టరేట్ ముట్టడిలో  ప్రసంగిస్తున్న APTF రాష్ట్ర అధ్యక్షులు  కె .వెంకటేశ్వర రావు గారు 
APTF మహిళా ప్రతినిధులు
కాకినాడ తూ.గో.జిల్లా.
అన్నీ బాగుండి ఇంట్లో కూర్చున్న CPS ఉద్యోగుల్లారా ఇది చూసైనా సిగ్గుపడండి





Older Posts
Subscribe to: Comments (Atom)

EXAMS

APPSC
SSC
NMMS
NTSE
HM ACT TEST
PAT
D.El.Ed
LPT
TCC
TTC
AP OPEN SCHOOL

deo websites

SRIKAKULAM
Vizianagaram
VISAKHA
W.GODAVARI
E.GODAVARI
KRISHNA
GUNTUR
PRAKASAM
NELLORE
CHITTOOR
KURNOOL
KADAPA
ANATHAPURAM

Total Pageviews

Copyright © - APTF |