✍️ఎఫ్ ఎ -2 పరీక్షలు 02.12.2022 వ తేదీ నుండి పైన తెలుపబడిన షెడ్యూల్ ప్రకారం, ఇవ్వబడిన సిలబస్ నందు అన్ని యాజమాన్య పాఠశాలలకు ఉమ్మడి ప్రశ్న పత్రము ద్వారా నిర్వహింప బడతాయి.
✍️ఈ పరీక్షలకు OMRలు ఉండవు. పాత పద్ధతిలో ఉంటాయి.
✍️ప్రశ్నా పత్రాలు వాట్సాప్ ద్వారా పరీక్షలు జరిగే రోజులలో రోజువారీగా మండల విద్యాశాఖాధికారులకు/ ప్రధానోపాధ్యాయులకు వారి వారి గ్రూపులలో పంపడం జరుగుతుంది.
✍️ ఆ ప్రశ్నా పత్రాలను మండల విద్యాశాఖాధికారులు మండల వాట్సాప్ group ద్వారా 1 గంట ముందు అన్ని యాజమాన్య పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు పంపడం జరుగుతుంది.
✍️ప్రశ్నా పత్రాన్ని బ్లాక్ బోర్డు పై వ్రాసి విద్యార్థులను వ్రాసుకోమని పరీక్ష నిర్వహించాలి.
✍️రోజుకు రెండు పరీక్షలు నిర్వహించాలి.
✍️1 నుండి 5 తరగతుల విద్యార్థులకు ఉదయం ఒక పరీక్ష, మధ్యాహ్నం మరొక పరీక్ష షెడ్యూల్ ప్రకారము నిర్వహించాలి.
✍️9 మరియు 10 వ తరగతి విద్యార్థులకు రెండు పరీక్షలు ఉదయమే షెడ్యూల్ ప్రకారము నిర్వహించాలి.
✍️6 నుండి 8 తరగతుల విద్యార్థులకు రెండు పరీక్షలు మధ్యాహ్నం షెడ్యూల్ ప్రకారము నిర్వహించాలి.
State Assesment Cell
SCERT-AP.