పాఠశాలల్లో విద్యార్థులకు సంబంధించిన పలు వివరాలను రికార్డుల్లో ఉన్నతాధికారుల అనుమతి లేకుండా మార్పు చేయడానికి వీల్లేదని పాఠశాల విద్యాశాఖ అన్ని స్కూళ్ల హెడ్మాస్టర్లకు ప్రత్యేక సర్క్యులర్ జారీ చేసింది . పాఠశాలల్లోని విద్యార్థుల పేర్లు , ఇతర వివరాలను రికార్డుల్లో నమోదు చేసిన అనంతరం కొన్ని చోట్ల అనుమతి లేకుండా ఇష్టానుసారంగా మార్పులు చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని అందులో పేర్కొన్నారు . గౌ౹౹ జిల్లా విద్యాధికారి , గౌ౹౹ ప్రాంతీయ సంయుక్త సం చాలకుల అనుమతి ఉంటేనే రికార్డుల్లోని వివ రాలను సవరించాల్సి ఉంటుందని పేర్కొంది .