APTF

APTF
  • Home
  • Sitemap
  • search

WEB LINKS 1

CFMS
E-SR
CHILD INFO
CSE AP
AP SCERT
CPS
MDM
EHS
ZPPF SLIPS
APGLI

WEB LINKS 2

DIKSHA
INCOME TAX
DSC LISTS
TRANSFERS 2022
Home » Semua Post Kategori SERVICE FAQ
Showing posts with label SERVICE FAQ. Show all posts
Showing posts with label SERVICE FAQ. Show all posts
లీన్  (L E I N) అంటే......

లీన్ (L E I N) అంటే......

Mohan
APTF Updated at: November 28, 2022

ఎపిటీఎఫ్ 1938 ఇన్ఫో

లీన్ (L E I N) అంటే ఏమిటి⁉️

  పర్మినెంట్ పోస్టులో నియామకం పొందిన ప్రభుత్వ ఉద్యోగికి ఆ ఉద్యోగంపై ధారణాధికారం ఉంటుంది. 
ఆధారణాధికారంతో క్రమశిక్షణా చర్యల పర్యవసానంగా ఉద్యోగం నుండి తొలగింపు, భర్తరఫ్, నిర్బంధ పదవీ విరమణ వంటి శిక్షలు విధించినపుడు తప్ప ప్రభుత్వ ఉద్యోగులు పదవీ విరమణ వయస్సుకు చేరేవరకు ఆ ఉద్యోగంలో కొనసాగే హక్కు ఉంటుంది. ఈ హక్కునే FR-9(13) లో లీన్ గా నిర్వచించడం జరిగింది.

లీను (L E I N):
అంటే ఏమిటి.. హక్కునే FR-9(13) లో లీన్ గా నిర్వచించడం జరిగింది....పూర్తి వివరాలు...

లీనుకు సంబంధిoచిన విషయాలను కూలంకశంగా FR-13,14A,14B మరియు ప్రభుత్వ ఉత్తర్వు నెం.144 F&P తేది : 19-05-2009 ద్వారా వివరించడం జరిగింది.

మాతృశాఖకు తిరిగి వెళ్ళడానికి కల్పించిన  గడువు లీన్ రద్దు అయ్యేంత వరకు ఉద్యోగి తనకు ఖాయమైన  ఉద్యోగంలో కొనసాగుతాడు

FR-13

సస్పెన్షన్  కాలంలో కూడా లీన్ కలిగి ఉంటారు.

FR-13e

శాశ్వత పదవి కలిగి, నియామక కాలపరిమితి గల పదవిలో నియమించబడినపుడు # లీన్ కలిగియుంటారు.

FR-13a

G.O.Ms.No.12 F&P Dt:07-02-1995

విదేశాలకు బదులు పద్దతిపై వెళ్ళినా లేక ఫారిన్ సర్వీస్ పై వెళ్ళినా అట్టి ఉద్యోగి 3 సం॥ వరకు తిరిగిరాడని ప్రభుత్వం భావించిన పక్షంలో, అట్టి ఉద్యోగి లీన్ రద్దు పరచవచ్చు.

FR-14b

వేరే పోస్టులకు ఎన్నికైన ఉద్యోగి తన పదవికి రాజీనామా సమర్పించి విముక్తి కాబడిన తేదీ నుంచి,అదేవిధంగా ఒక శాఖ నుంచి మరొక శాఖకు తన కోరిక మేరకు గాని లేక ఇతరత్రా గాని బదిలీ అయిన సందర్భాలలో సంబంధిత ఉత్తర్వులలో లీను రద్దవుతుంది. కొత్త పదవిలో తాత్కాలిక లీను అతనికి ఆటోమేటిక్ గా కలుగుతుంది.

FR-14(9)

ఉద్యోగికి లీన్ హక్కు తాను నిర్వహించే ఉద్యోగం పైననే ఉంటుంది. కాని పనిచేసే స్థానంపై ఉండదు. లీన్ సస్పెన్షన్ అమలులో ఉన్న కాలంలో ఆ పోస్టులోని ప్రయోజనాలు లభించవు.

ఉద్యోగి వ్రాతపూర్వకంగా కోరినచో మాత్రమే తన లీన్ టర్మినేట్ చేయవచ్చును.

లీన్ బదిలీ:

FR-14 మరియు FR-15 లు ఒరిజినల్ పోస్టులోని లీన్ రద్దుపరచి ఇతర సర్వీసు లేక శాఖలోని కొత్త పోస్టులో లీన్ కల్పించుట ద్వారా లీన్ బదిలీకి అవకాశమిస్తున్నవి.

 వేతనం - సీనియారిటీ, ప్రమోషన్, పెన్షన్:

ప్రభుత్వ ఉద్యోగులు తమ లీన్ కొనసాగుతున్నoత వరకు లేదా లీన్ పునరుద్ధరింపబడిన తరువాత వారు మాతృశాఖలోనే, కొనసాగి ఉన్నచో లభించి ఉండే వేతనం సీనియారిటీ మరియు ప్రమోషన్ మొదలైన ప్రయోజనాలు పొందుటకు అర్హులై ఉంటారు. లీన్ హక్కు టర్మినేషన్లో ఆ పోస్టులోని ప్రయోజనాలు కోల్పోతారు. కాని లీన్ తో ప్రమేయం లేకుండా పెన్షన్ అర్హత గల ఉద్యోగంలో పనిచేసిన వారికి పెన్షనరీ ప్రయోజనాలు లభిస్తాయి. అనగా లీన్ హక్కులేని తాత్కాలిక, ఎమర్జెన్సీ ఉద్యోగికి కూడా పెన్షనరీ ప్రయోజనాలు సిద్దిస్తాయి.

ప్రభుత్వ ఉపాధ్యాయుల సందేహాలు – సమాధానాలు

ప్రభుత్వ ఉపాధ్యాయుల సందేహాలు – సమాధానాలు

Mohan
APTF Updated at: October 25, 2021

 

సందేహాలు- సమాధానాలు


  • మెడికల్ సెలవుకోసం డాక్టరు సర్టిఫికెట్ మరియు ఫిట్ నెస్ సర్టిఫికెట్ వేరేవేరే డాక్టర్ల నుండి సమర్పించవచ్చునా? వైద్య కారణాలపై తీసుకున్న EOL ఇంక్రిమెంట్ కోసం లెక్కించబడుతుందా?

           రెండు సర్టిఫికెట్లు ఒకే డాక్టర్ ఇవ్వాలని ఏ ఉత్తర్వులోనూ లేదు. ఇద్దరూ క్వాలిఫైడ్ వైద్యులైనంత వరకు ఎట్టి అభ్యంతరము ఉండదు. సాధారణంగా EOL వాడుకుంటే ఇంక్రిమెంట్ అన్ని రోజులు వాయిదా పడుతుంది. అయితే ప్రభుత్వం G.O.Ms.No.43 తేది:5-2-1976 ద్వారా వైద్య కారణాలపై 6 నెలల కాలం వరకు EOL ను ఇంక్రిమెంటుకు పరిగణించే అధికారం శాఖాధిపతులకు (ఉపాధ్యాయుల విషయంలో పాఠశాల విద్యా సంచాలకులకు) ఇవ్వడం జరిగింది.


  • నేను పేరు మార్చుకోవాలని అనుకుంటున్నాను.ఐతే ఏమి చెయ్యాలి??

సమాధానం

జీఓ.102 తేదీ:24.4.1985 ప్రకారం 5రూ స్టాంపు పేపర్ మీద అఫిడవిట్ చేఇ0చి,DDO, తెలిసిన ఇద్దరితో సాక్షి సంతకాలు చేఇ0చాలి.స్థానిక వార్తా పత్రికలలో మరియు గెజిట్ లో ప్రచురణ చేయించాలి.


  • నేను PF నుండి ఋణం పొందియున్నాను. వాయిదాలు పూర్తి కాలేదు.మరలా ఋణం కావాలి.ఇస్తారా??

సమాధానం : ZPPF నిబంధనలు 14 ప్రకారం మరల ఋణం పొందవచ్చు. మిగిలి ఉన్న బకాయి,కొత్త ఋణం మొత్తం కలిపి వాయిదాలు నిర్ణయిస్తారు.


  • ఒక డీజేబుల్డ్ ఉపాధ్యాయునికి వృత్తి పన్ను మినహాయించాలి అంటే ఎంత శాతం అంగవైకల్యం ఉండాలి??

సమాధానం :  జీఓ.1063 తేదీ:2.8.2007 ప్రకారం 40% డీజేబుల్డ్ ఉంటే వృత్తి పన్ను మినహాయింపు వర్తిస్తుంది.


  • ఒక టీచర్ ఫిబ్రవరి 29న జాబ్ లో చేరాడు.అతనికి వార్షిక ఇంక్రిమెంట్ ఏ నెలలో ఇవ్వాలి??

సమాధానం

ఆర్.సి.2071 తేదీ:21.7.2010 ప్రకారం లీపు సంవత్సరం ఫిబ్రవరి 29న విధుల్లో చేరిన ఉపాధ్యాయుల వార్షిక ఇంక్రిమెంట్ ఫిబ్రవరి నెల లోనే ఇవ్వాలి.


  • బిడ్డ పుట్టి వెంటనే మరణించిన, వారికి మెటర్నిటీ లీవు కి అర్హత ఉందా??

సమాధానం

Lds.1941 తేదీ:11.6.90 ప్రకారం మరణించిన బిడ్డను కన్నా ప్రసూతి సెలవులు వాడుకోవచ్చు


  • ఇంటి అద్దె (HRA మినహాయింపు) గణన ఎలా?

సమాధానం

చెల్లించిన అద్దె -10% ఫే - 10% డి.ఏ

సంవత్సరంలో చెల్లించిన అద్దె 1లక్ష లేదా అంతకంటే ఎక్కువగా ఉంటే ఇంటి యజమాని  PAN ఇవ్వాలి (నెలసరి అద్దె 8400/- కానీ అంతకంటే ఎక్కువ చెల్లించిన వారు)


  • టాక్సేబుల్ ఆదాయం దాదాపు 7,00,000 ఉంటే టాక్స్ ఎలా గణించాలి?*

సమాధానం

2,50,000 వరకు పన్ను లేదు (60 ఏళ్ల లోపు వారికి)

2,50,001-5,00,000 వరకు (2.50 లక్షలకు) 10% 

5,00,001-10,00,000 వరకు (5 లక్షలకు) 20%

10,00,000  పైబడిన 30%

-----

7,00,000 కు టాక్స్ గణిస్తే 

2,50,000 వరకు పన్ను లేదు 

2,50,001 - 5,00,000 వరకు (2.50 లక్షలకు) 10% 

అంటే 2,50,000 X 10% = 25,000/-

5,00,001 - 7,00,000 వరకు (2 లక్షలకు) 20%

అంటే 2,00,000 X 20% = 40,000/-

చెల్లించాల్సిన టాక్స్ (25,000+40,000/-)+3%ఎడ్యుకేషన్ సెస్సు. 

-----

CPS వారికి సంబంధించిన సెక్షన్ల వారిగా ఉన్న అవకాశాలు.

ఉద్యోగుల కంట్రీబ్యూషన్ చేసిన నిధి 80CCD(1) ప్రకారం 80C సెక్షన్ తో 1,50,000/- లో చూపాలి.

అధనంగా 80CCD1(B) ద్వార 50,000/- లబ్ధి ఎలా పొందే అవకాశం ఉంది

ఉద్యోగులకు వారి ప్రాన్ (PRAN)  ఖాతా లో ఉద్యోగుల వాటకి సమానంగా జమచేసిన నిధిని ముందుగా ఆదాయం గా చూపించి తర్వాత 80CCD(2) ప్రకారం ఆదాయం నుండి పూర్తి మినహాయింపు కలదు.


  • అధనంగా 80CCD(1B) ద్వార 50,000/- లబ్ధి ఎలా పొందే అవకాశం ఉంది?*

సమాధానం

ఉద్యోగులకు CPS కాకుండా 80C కింద 1,50,000/- సేవింగ్స్ ఉంటే CPS నిధిని 80CCD(1B) లో 50,000 వరకు మినహాయింపు పొందవచ్చు. 

ఒకవేళ ఉద్యోగులకు 80C కింద CPS కాకుండా 1,30,000/- సేవింగ్స్ ఉండి CPS deduction 70,000/- ఉంటే అప్పుడు 20,000/- లను 80C కింద మిగతా 50,000/- లను 80CCD(1B) కింద చూపవచ్చు.

:

  • ఒక ఉపాధ్యాయుడు గృహిణి ఐన తన భార్యకు కిడ్నీని దానం చేయడానికి అంగీకరించాడు. ఈ సర్జరీ కోసం ఆ ఉపాధ్యాయునికి డాక్టర్లు 6 - 8 వారాలు బెడ్ రెస్ట్ తీసుకోవాలని సూచించారు. అయితే ఇప్పుడు ఆ ఉపాధ్యాయుడు వేతనంతో కూడిన సెలవులు పొందాలంటే ఏం చెయ్యాలి?

సమాధానం

వైద్య కారణాలతో (మెడికల్ గ్రౌండ్స్) కమ్యూటేషన్ సెలవుగానీ, ఎరండు లీవును గాని తీసుకుని పూర్తి జీతము పొందవచ్చు. అందుకు డాక్టర్ సర్టిఫికేట్ జతపరచాలి. G.O. Ms.No. 386, DT: 6-9-1976;; G.O. 268, DT: 28-10-1991 and G.O. 29, DT: 9-3-2011.


  • దాదాపు6 సంవత్సరాల కాలం SGT గా పనిచేసి ప్రభుత్వంలోని వేరే శాఖకు ఎంపికై, అక్కడ కూడా 2 సం,, రాలు పనిచేసి తిరిగి పాత పోస్ట్‌ లో చేరిన ఉపాధ్యాయుని 2 సం,,రాల సర్వీసును ఏవిధంగా లెక్కిస్తారు ? ఇంక్రిమెంట్ ను AAS కి లెక్కిస్తారా ?

సమాధానం

FR -26(i) ప్రకారం ప్రస్తుత పోస్ట్ పై 'Lien' కలిగియున్న ఉపాధ్యాయుడు, ప్రస్తుత పోస్ట్ కంటే తక్కువ కాని పోస్ట్ లో పనిచేసిన సర్వీసును ఇంక్రిమెంట్ కు లెక్కించవచ్చును. G.O.Ms.No. 117, F&P, DT: 20-5-1981 ప్రకారం ఇంక్రిమెంట్ కు పరిగణింపబడే సర్వీసు అంతా AAS కు కూడా లెక్కించబడుతుంది. కాబట్టి సదరు 2 సం,,. ఇతర పోస్ట్ సర్వీసు AAS నకు  కూడా లెక్కించబడుతుంది.


  • వేసవి సెలవుల్లో పని చేస్తే ELs ఎలా జమచేస్తారు??

సమాధానం:

వేసవి సెలవులు 15 రోజులు కన్నా తక్కువగా వాడుకుంటే,మొత్తం వేసవి సెలవులు వాడుకోలేదన్నట్లుగా భావించి 24 ELs ఇస్తారు


  • సంపాధిత సెలవును అర్ధ జీతపు సెలవు, వేసవి సెలవులతో కలిపి ఒకేసారి ఎన్ని రోజులు వాడుకోవచ్చు??

సమాధానం:

ఒకేసారి 180 రోజులకి మించి వాడుకోకూడదు.


  • ఒక ఉద్యోగి సస్పెన్షన్ లో ఉన్నప్పుడు ఉద్యోగం నుంచి విరమించుకోవచ్చా??

సమాధానం:

విరమించుకోవటానికి అతనికి అనుమతి ఇవ్వరు.


  • Sir APGLI బాండ్లపై లోన్లు ఇవ్వటానికి ఏమైనా పథకం ఉన్నదా ? ఎప్పుడు, ఎలా లోన్ బాండ్ పై తీసుకోవచ్చు? తెలుపగలరు.

సమాధానం:

APGLI  లో బాండ్స్ పై లోన్ ఏమి ఇవ్వరు. లోన్ ఫెసిలిటీ మాత్రం ఉంది.. APGLI  Loan will be sanctioned basing on the premiums paid. But not basing on the bond value (sum assured)


  • నాకు మొదటిసారి బాబు. తర్వాత కవల పిల్లలు పుట్టారు. ఐటీ కి ముగ్గురు పిల్లల ట్యూషన్ ఫీజు పెట్టుకోవచ్చా??

సమాధానం

ఐటీ కి ఇద్దరు పిల్లల ట్యూషన్ ఫీజు మాత్రమే సేవింగ్స్ కి పరిగణించబడుతుంది.


  • ఉద్యోగి తల్లిదండ్రులు కి వైట్ కార్డు ఉంటే EHS లో చేర్చవచ్చా??

సమాధానం

చేర్చకూడదు.అందరూ కలసి ఉండి వైట్ కార్డ్ ఉపయోగించుచున్నందులకు ఉద్యోగి పై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటారు.


  • నా భార్య హౌస్ వైఫ్.ఆమె కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేఇ0చుకుంటే నాకు ప్రత్యేక సెలవులు ఏమైనా ఇస్తారా??

సమాధానం

జీఓ.802 M&H తేదీ:21.4.72 ప్రకారం భర్త కి 7 రోజులు స్పెషల్ సెలవులు ఇస్తారు.


  • UP స్కూల్ లో పనిచేస్తున్న టీచర్ అదే మండలం నకు FAC MEO గా భాద్యత లు నిర్వహించుచున్న అతని వార్షిక ఇంక్రిమెంట్లు, ELs ఎవరు మంజూరు చేస్తారు??

సమాధానం

FR.49 ప్రకారం ఒక పోస్టులో అదనపు బాధ్యతలు నిర్వహించుచున్న సందర్భంలో ఆ పోస్టుకి గల అన్ని అధికారాలు సంక్రమిస్తాయి. కనుక వార్షిక ఇంక్రిమెంట్లు తనే మంజూరు చేసుకోవచ్చు. ELs మాత్రం DEO గారి ఆనుమతి తో జమ చేయవలసి ఉంటుంది


  • SGT గా పనిచేస్తున్న టీచర్ VRO గా ఎంపిక ఐతే పే--ప్రొటెక్షన్, సర్వీస్ ప్రొటెక్షన్ ఉంటుందా??

సమాధానం

DEO అనుమతి తో పరీక్ష రాస్తే వేతన రక్షణ ఉంటుంది. జీఓ.105 తేదీ:2.6.2011 ప్రకారం నూతన పోస్టు యొక్క స్కేల్ లో ప్రస్తుతం పొందుతున్న వేతనానికి సమానమైన స్టేజి లో వేతనం నిర్ణయించబడుతుంది. ఇంక్రిమెంట్ మాత్రం నూతన సర్వీసు లో చేరిన ఒక సంవత్సరం తర్వాతే మంజూరు చేస్తారు.


  • మహిళా టీచర్ భర్త నిరుద్యోగి. అత్త, మామ కూడా ఈమె పైనే ఆధార పడి జీవిస్తున్నారు. అత్త గారికి ఆరోగ్యం బాగా లేదు. మెడికల్ రీఅంబర్సుమెంట్ వర్తిస్తుందా??

సమాధానం

APIMA రూల్ 1972 ప్రకారం వర్తించదు. కేవలం మహిళా టీచర్ అమ్మ,నాన్న లకి మాత్రమే వర్తిస్తుంది.


  • నాకు మొదటి సారి అమ్మాయి.తర్వాత కవల పిల్లలు జన్మించారు. LTC లో ముగ్గురు పిల్లలు ప్రయాణం చేయవచ్చా??

సమాధానం

జీఓ.140 తేదీ:3.4.96 ప్రకారం ఇద్దరు పిల్లలుకి మాత్రమే అవకాశం ఉంది.


  • అబార్షన్ కి రెండుసార్లు మాత్రమే సెలవు ఉపయోగించుకోవాలి అనుచున్నారు. వాస్తవమా?? కాదా??

సమాధానం

జీఓ.254;ఆర్ధిక;తేదీ:10.11.95 ప్రకారం ఇద్దరు కంటే తక్కువ జీవించియున్న బిడ్డలు గలవారు అర్హులు. అంతేకానీ ఎన్నోసారి అనే దానితో నిమిత్తం లేదు.


  • సర్వీసు మొత్తం మీద ఎన్ని కమ్యూటెడ్ సెలవులు వాడుకోవాలి??

సమాధానం

సర్వీసు మొత్తం మీద 240 రోజులు కమ్యూటెడ్ సెలవుగా వాడుకోవచ్చు.అప్పుడు అర్థ జీతపు సెలవు ఖాతా నుండి 480 రోజులు తగ్గించబడతాయి.ఆ తర్వాత కూడా సెలవు అవసరం ఐతే కేవలం అర్ధ జీతపు సెలవు గా మాత్రమే ఖాతాలో నిల్వ ఉన్నంత వరకు వాడుకోవచ్చు.


  • స్కూల్ అసిస్టెంట్ తెలుగు గా పదోన్నతి పొందటానికి కావాల్సిన అర్హతలు ఏమిటి??

సమాధానం

జీఓ.15,16 తేదీ:7.2.2015 ప్రకారం డిగ్రీ లో మెయిన్ గా గానీ లేదా 3 ఆప్షనల్ సబ్జెక్టు లలో ఒక సబ్జెక్టు గా తెలుగు ఉండాలి. బి.ఈ డి లో తెలుగు methodology లేదా పండిట్ ట్రైనింగ్ కలిగి ఉండాలి.అదేవిధంగా జీఓ.28,29 తేదీ:2.7.15 ప్రకారం పీజీ అర్హత తో భాషా పండితులు గా నియమించబడిన వారు కూడా స్కూల్ అసిస్టెంట్ తెలుగు కి అర్హులే.


  • ఓపెన్ యూనివర్సిటీ SSC, ఇంటర్ పరీక్షల ఇన్విజిలేటర్ గా పనిచేసిన వారికి సంపాదిత సెలవు నమోదు కొరకు ప్రతి సంవత్సరం ఉత్తర్వులు రావాలా??

సమాధానం

అవసరం లేదు. పాఠశాల విద్యాశాఖ సంచాలకులు వారి ఉత్తర్వులు ఆర్.సి.నo.362/ఇ1-1/2013 తేదీ:16.11.2013 ప్రకారం జమ చేయవచ్చు.


  • LFL HM కి 12 ఇయర్స్ స్కేల్ పొందటానికి కావలసిన అర్హతలు ఏమిటి??

సమాధానం

LFL HM కి తదుపరి పదోన్నతి హైస్కూల్ ప్రధానోపాధ్యాయుడు కాబట్టి డిగ్రీ, బీ. ఈ. డీ, డిపార్ట్మెంట్ పరీక్షల ఉతీర్ణత ఉండాలి.50 ఇయర్స్ వయస్సు నిండితే డిపార్ట్మెంట్ టెస్టుల మినహాయింపు వర్తిస్తుంది.


  • విదేశాలకి వెళ్లుటకు ఏ విధమైన సెలవు వాడుకోవచ్చు??

సమాధానం

 విదేశాలకు వెళ్లుటకు 3 నెలల వరకు CSE, ఆ పై కాలానికి Edn. Sec నుండి ముందస్తు అనుమతి తప్పనిసరిగా పొందాలి.అనుమతి లభించిన కాలానికి అర్హత గల(EL/HPL/EOL)ఏ సెలవు నైనా వినియోగించుకోవచ్చు.జీఓ.70 తేదీ:6.7.2009 ప్రకారం 4 నెలల లోపు HM/MEO, 4--6 నెలల వరకు Dy. EO, 6 నెలల నుండి 1 ఇయర్ వరకు DEO,1--4 ఇయర్స్ వరకు CSE,4 ఇయర్స్ పైన Edn. Sec నుండి సెలవు మంజూరు చేయించుకోవాలి.



  • మెడికల్ సెలవు లో ఉండి వాలంటరి రిటైర్మెంట్ కి అప్లై చేయవచ్చా??

సమాధానం

చేయవచ్చు. కానీ నష్టం జరుగుతుంది.మెడికల్ సెలవులో ఉండి వాలంటర్ రిటైర్మెంట్ కి అప్లై చేస్తే కమ్యూటెడ్ కాలానికి వేతనం రాదు.అదే స్కూల్లో జాయిన్ ఐన పిదప వాల0టరీ రిటైర్మెంట్ కి అప్లై చేస్తే కమ్యూటెడ్ కాలానికి పూర్తి వేతనం పొందవచ్చు.


  • స్వచ్చంద ఉద్యోగ విరమణ చేయదలచుకొన్నపుడు ఎలా దరఖాస్తు చేసుకోవాలి??

సమాధానం

స్వచ్ఛంద ఉద్యోగ విరమణ కి అనుమతి కోరుతూ HM ద్వారా DEO గారికి 3 నెలల ముందు దరఖాస్తు చేసుకోవాలి.దరఖాస్తు తో పాటు ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్, SR,10వ తరగతి నుండి విద్యా అర్హతల సర్టిఫికేట్లు,సెల్ఫ్ డిక్లరేషన్ జతపరచాలి


  • SR లో సర్వీస్ వెరిఫికేషన్ ఎప్పుడు ఎంటర్ చెయ్యాలి??

సమాధానం

మెమో:8388, తేదీ:20.1.12 ప్రకారం ప్రతి సంవత్సరం ఏప్రిల్ నెలలో సర్వీస్ వెరిఫికేషన్ ఎంటర్ చెయ్యాలి.


  • ఒక టీచర్ వేసవి సెలవుల్లో 35 రోజులు వివిధ రకాల ప్రభుత్వ పరీక్షలకి హాజరు అయ్యాడు.అతనికి ఎన్ని Els జమచేయబడతాయి??

సమాధానం

వినియోగించుకున్న వేసవి సెలవులు 14 రోజులే కనుక 24 రోజుల ELs జమ చేయబడతాయి.


  • మా స్కూల్లో నలుగురు SGT లు ఒకే DSC లో ,ఒకే రోజు స్కూల్లో జాయిన్ అయ్యారు.ఎవరు మాలో సీనియర్ అవుతారు??

సమాధానం

సీనియారిటీ DSC సెలక్షన్ లిస్ట్ ఆధారంగా నిర్ణయించబడుతుంది.


  • FAC HM గ్రీన్ ఇంక్ వాడవచ్చా??

సమాధానం

FR.49 ప్రకారం FAC భాద్యతలు నిర్వహిస్తున్న వారికి పోస్టుకి గల అన్ని అధికారాలు ఉంటాయి. కాబట్టి గ్రీన్ ఇంక్ వాడవచ్చు.


  • నేను హైస్కూల్ లో రికార్డ్ అసిస్టెంట్ గా పనిచేస్తున్నాను.నాకు మహిళా టీచర్ల కి ఇచ్చే 5 స్పెషల్ CL లు ఇవ్వడం లేదు. ఎందువల్ల??

సమాధానం

జీఓ.374 తేదీ:16.3.96 ప్రకారం 5 స్పెషల్ CL లు కేవలం మహిళా టీచర్ల కి మాత్రమే వర్తిస్తాయి.


  • నేను,మరొక టీచర్ ఇద్దరం ఒకే రోజు SA లుగా పదోన్నతి పొందాము.ఒకే రోజు జాయిన్ అయ్యాము.SA క్యాడర్ లో ఎవరు సీనియర్ అవుతారు??

సమాధానం

SGT క్యాడర్ లో ఎవరు సీనియర్ ఐతే,వారే SA క్యాడర్ లో కూడా సీనియర్ అవుతారు.


  • PF ఋణం ఎంత ఇస్తారు??తిరిగి ఎలా చెల్లించాలి??

సమాధానం

PF నిబంధనలు 15ఏ ప్రకారం 20 ఇయర్స్ సర్వీసు పూర్తి చేసిన వారు మరియు 10 ఇయర్స్ లోపు సర్వీసు గలవారు ఋణం తిరిగి చెల్లించవలసిన అవసరం లేదు. గృహ నిర్మాణ0 కోసం, స్థలం కొనుగోలు చేయడానికి 15 ఇయర్స్ సర్వీసు పూర్తి చేసిన వారు కూడా ఋణం తిరిగి చెల్లించవలసిన అవసరం లేదు. రూల్ 15సీ ప్రకారం బేసిక్ పే కి 6 రెట్లు లేదా నిల్వ లో సగం ఏది తక్కువ ఐతే అది ఋణంగా ఇస్తారు.అనారోగ్యంతో బాధపడుతున్న వారికి నిల్వ మొత్తం లో గరిష్టంగా 75% వరకు ఇవ్వవచ్చు.


  • కొత్తగా ఉద్యోగంలో చేరిన వారికి APGLI ఎప్పటి నుంచి కట్ చెయ్యాలి??

సమాధానం

జీఓ199, ఆర్థికశాఖ తేదీ:30.7.13 ప్రకారం మొదటి నెల వేతనం నుంచే APGLI మినహాయించాలి.


  • సమాచార హక్కు చట్టం ద్వారా సమాచారం కోరితే ఎన్ని రోజులలోపు సమాధానం ఇవ్వాలి??

సమాధానం

30 రోజులలోపు సమాధానం ఇవ్వాలి.


ప్రశ్న

  • నేను B.Sc, M.Ed చేశాను.1995 లో SGT గా చేరాను.ఐతే నాకు M.Ed కి అదనపు ఇంక్రిమెంట్ ఇవ్వటం లేదు.ఎందువల్ల??

సమాధానం

మెమో:5399, తేదీ:23.11.2000 ప్రకారం పీజీ అర్హత ఉంటేనే M.Ed కి ఆదనపు ఇంక్రిమెంట్ ఇవ్వబడుతుంది.


  • నేను హైస్కూల్ లో పనిచేస్తున్నాను.పరీక్షల నిమిత్తం దాదాపు 35 రోజులు వేసవి సెలవుల్లో బడికి వచ్చాను.నాకు ఎన్ని ELs ఇస్తారు??

సమాధానం

మీరు 15 రోజుల కన్నా తక్కువ గా వేసవి సెలవులు వినియోగించుకున్నందున FR.82(డి) ప్రకారం 24 రోజులు సంపాదిత సెలవులు ఇవ్వాలి.


  • నేను రక్త దానం చేశాను. Spl. CL ఎవరు ఇస్తారు??

సమాధానం

జీఓ.137 తేదీ:23.2.84 ప్రకారం రక్త దానం చేస్తే CL మంజూరు చేసే అధికారే Spl. Cl కూడా మంజూరు చేస్తారు.


  • నేను పేరు మార్చుకోవాలని అనుకుంటున్నాను.ఐతే ఏమి చెయ్యాలి??

సమాధానం

జీఓ.102 తేదీ:24.4.1985 ప్రకారం 5రూ స్టాంపు పేపర్ మీద అఫిడవిట్ చేఇ0చి,DDO, తెలిసిన ఇద్దరితో సాక్షి సంతకాలు చేఇ0చాలి.స్థానిక వార్తా పత్రికలలో మరియు గెజిట్ లో ప్రచురణ చేఇ0చాలి.

ప్రశ్న

నేను PF నుండి ఋణం పొందియున్నాను.

వాయిదాలు పూర్తి కాలేదు.మరలా ఋణం కావాలి.ఇస్తారా??

సమాధానం

ZPPF నిబంధనలు 14 ప్రకారం మరల ఋణం పొందవచ్చు. మిగిలి ఉన్న బకాయి,కొత్త ఋణం మొత్తం కలిపి వాయిదాలు నిర్ణయిస్తారు.

ప్రశ్న

ఒక డీజేబుల్డ్ ఉపాధ్యాయునికి వృత్తి పన్ను మినహాయించాలి అంటే ఎంత శాతం అంగవైకల్యం ఉండాలి??

సమాధానం

తేదీ:2.8.2007 ప్రకారం 40% డీజేబుల్డ్ ఉంటే వృత్తి పన్ను మినహాయింపు వర్తిస్తుంది.

ప్రశ్న:

నేను హైస్కూల్ లో పనిచేస్తున్నాను.పరీక్షల నిమిత్తం దాదాపు 35 రోజులు వేసవి సెలవుల్లో బడికి వచ్చాను.నాకు ఎన్ని ELs ఇస్తారు??

సమాధానాలు

మీరు 15 రోజుల కన్నా తక్కువ గా వేసవి సెలవులు వినియోగించుకున్నందున FR.82(డి) ప్రకారం 24 రోజులు సంపాదిత సెలవులు ఇవ్వాలి.

ప్రశ్న:

నేను రక్త దానం చేశాను. Spl. CL ఎవరు ఇస్తారు??

సమాధానాలు

జీఓ.137 తేదీ:23.2.84 ప్రకారం రక్త దానం చేస్తే CL మంజూరు చేసే అధికారే Spl. Cl కూడా మంజూరు చేస్తారు.

ప్రశ్న:

నేను పేరు మార్చుకోవాలని అనుకుంటున్నాను.ఐతే ఏమి చెయ్యాలి??

సమాధానాలు

జీఓ.102 తేదీ:24.4.1985 ప్రకారం 5రూ స్టాంపు పేపర్ మీద అఫిడవిట్ చేఇ0చి, DDO, తెలిసిన ఇద్దరితో సాక్షి సంతకాలు చేఇ0చాలి.స్థానిక వార్తా పత్రికలలో మరియు గెజిట్ లో ప్రచురణ చేయించాలి.


మా ఆఫీసులో watch women గా పనిచేస్తున్న ఆవిడకు liver cancer, retirement 2030 ఇప్పుడు ఈమె voluntary retirement తీసుకుంటే ఆమె కూతురుకి ఉద్యోగం వస్తుందా?

మా ఆఫీసులో watch women గా పనిచేస్తున్న ఆవిడకు liver cancer, retirement 2030 ఇప్పుడు ఈమె voluntary retirement తీసుకుంటే ఆమె కూతురుకి ఉద్యోగం వస్తుందా?

Mohan
APTF Updated at: August 01, 2021

  ప్రశ్న:

మా ఆఫీసులో watch women గా పనిచేస్తున్న ఆవిడకు liver cancer, retirement 2030 ఇప్పుడు ఈమె voluntary retirement తీసుకుంటే ఆమె కూతురుకి ఉద్యోగం వస్తుందా? మూడవ కూతురికి వివాహం కాలేదు. How to process

జవాబు:

(1) ముందుగా మెడికల్ బోర్డు ద్వారా మెడికల్ ఇన్‌వాలిడేషన్ తీసుకోవాలి. 
(2) ఆ మెడికల్ ఇన్‌వాలిడేషన్ తో కారుణ్య నియామకానికి ధరఖాస్తు చేసుకోవాలి. ఇందులో మొదటిది సాధించవచ్చు కాని రెండవ దానికి గ్యారంటీ లేదు.

విధులకు ఆటంకాలు కలిగించే లేదా దాడి చేసే వారిపై ఏవిధంగా చర్యలు తీసుకోవడానికి ఏమైనా జీవో లేదా సర్కులర్ ఉన్నదా?

విధులకు ఆటంకాలు కలిగించే లేదా దాడి చేసే వారిపై ఏవిధంగా చర్యలు తీసుకోవడానికి ఏమైనా జీవో లేదా సర్కులర్ ఉన్నదా?

Mohan
APTF Updated at: August 01, 2021

 ప్రశ్న:

 విధులకు ఆటంకాలు కలిగించే లేదా దాడి చేసే వారిపై ఏవిధంగా చర్యలు తీసుకోవడానికి ఏమైనా జీవో లేదా సర్కులర్ ఉన్నదా? తెలుపగలరు.

జవాబు:
ఏ ఉపాధ్యాయుడి పైన ఎవరైనా అసభ్యంగా ప్రవర్తించినా విధులకు ఆటంకం కలిగించినా దాడి చేసినా IPC186.189,353 ప్రకారం 2yr జైలు శిక్ష ఉంటుంది.

భార్య & భర్త ఇరువురు ప్రభుత్వ ఉద్యోగులు అయివుండి, వారిలో భర్త మరణిస్తే, అవివాహితుడు అయిన వారి సోదరుడికీ కారుణ్య నియామకం కింద ఉద్యోగం ఇవ్వుటకు వీలుపడుతుందా?

భార్య & భర్త ఇరువురు ప్రభుత్వ ఉద్యోగులు అయివుండి, వారిలో భర్త మరణిస్తే, అవివాహితుడు అయిన వారి సోదరుడికీ కారుణ్య నియామకం కింద ఉద్యోగం ఇవ్వుటకు వీలుపడుతుందా?

Mohan
APTF Updated at: August 01, 2021

 రూల్స్ ప్రకారం అలా వీలు లేదు. చనిపోయిన ఉద్యోగి కుటుంబానికి ఏ విధమైన ఆదాయ వనరులు లేనప్పుడు మాత్రమే కారుణ్య నియామకం వీలుంటుంది

విదేశాలకు వెళ్ళుటకు ఏ విధమైన సెలవు వాడుకోవచ్చు ?

విదేశాలకు వెళ్ళుటకు ఏ విధమైన సెలవు వాడుకోవచ్చు ?

Mohan
APTF Updated at: July 23, 2021

విదేశాలకు వెళ్లుటకు 3 నెలల వరకు CSE , ఆపై కాలానికి Edn . Sec నుండి ముందస్తు అనుమతి తప్పనిసరిగా పొందాలి . అనుమతి లభించిన కాలానికి అర్హత గల ( EVHPL / EOL ) ఏ సెలవు నైనా వినియోగించుకోవచ్చు . G.O.Ms.No.70 Dated : 06-07-2009 ప్రకారం 4 నెలలలోపు HM / MEO , 4-6 నెలల వరకు Dy.EO , 6 నెలలో నుండి 1 సంవత్సరము వరకు DEO , 1-4 సంవత్సరాలు వరకు CSEVA సంవత్సరాలు పైన Edn . Sec నుండి సెలవు మంజూరు చేయించుకోవాలి .

అర్జిత సెలవు నగదు కోసం అప్పగింత, సరెండర్ లీవ్ (SURRENDER LEAVE) సంబంధిత ఉత్తర్వులతో:

అర్జిత సెలవు నగదు కోసం అప్పగింత, సరెండర్ లీవ్ (SURRENDER LEAVE) సంబంధిత ఉత్తర్వులతో:

Mohan
APTF Updated at: July 14, 2021


అర్జిత సెలవు నగదు కోసం అప్పగింత, సరెండర్ లీవ్ (SURRENDER LEAVE) సంబంధిత ఉత్తర్వులతో:

అర్జితసెలవు(Earned Leave) ఖాతాలో నిలువ వున్న సెలవులను కొన్ని షరతులకు లోబడి అప్పగించి (Surrender) దానికి ప్రతిఫలంగా నగదు పొందుటను 'సరెండర్ లీవ్' అంటారు.
(G.O.Ms.No.238 Fin తేది:13-08-1969)
(Govt.Circular Memo No.52729 Fin తేది:11-10-1969)

ఇట్టి సౌకర్యం గెజిటెడ్, నాన్ గెజిటెడ్, నాల్గవ తరగతి ఉద్యోగులకు కూడా వర్తిస్తుంది.

ప్రభుత్వ ఆర్ధిక సహాయం పొందుతున్న జిల్లాపరిషత్, మండల పరిషత్, పురపాలక సంఘాలు, ప్రైవేటు యాజమాన్యం (ఎయిడెడ్) ఆధ్వర్యంలో పనిచేయుచున్న అన్ని పాఠశాలలు, కాలేజీలలో పనిచేయుచున్న ఉద్యోగులు సరెండర్ లీవ్ సదుపాయానికి అర్హులు.
(G.O.Ms.No.418 Edn తేది:18-04-1979)

సరెండర్ సెలవు జీతం నెలవారీ పద్దతిపై ఇవ్వాలి. ఆ నెలలో గల 28/29/30/31 రోజులతో నిమిత్తం లేకుండా నెలవారీ పద్దతిపై నగదు చెల్లించాలి. ఈ విషయమై నెల అనగా 30 రోజులు మాత్రమే.
*(G.O.Ms.No.306 Fin తేది:08-11-1974)

సం॥ నకు 15 రోజుల చొప్పునగాని,2 సం॥ లకు 30 రోజుల చొప్పున గాని ఈ సెలవును సరెండర్ చేసి నగదు పొందవచ్చు.
(G.O.Ms.No.334 F&P తేది:28-09-1977)

సరెండర్ లీవ్ కాలానికి పూర్తివేతనం, ఇతర అలెవెన్సులు మంజూరు చేయబడును. IR చెల్లించబడదు.
(Govt.Memo.Mo.31948 F&P తేది:12-08-1998)

సరెండర్ లీవ్ 15/30 రోజులకు 12/24 నెలల గ్యాప్ తో ఏ నెలలోనైనా అనుమతిస్తారు. ఈ సెలవు కోసం ప్రత్యేకంగా ఉత్తర్వులివాల్సిన అవసరం లేదు.
(Memo.No.14781-C/278/FR-1/2011 తేది:22-06-2011)

ఉపాధ్యాయుల విషయంలో ఏ అధికారైతే అర్జిత సెలవు మంజూరు చేయు అధికారం కలిగి ఉమటాడో, అట్టి అధికారే ఆర్జిత సెలవు సరెండర్ చేయుటకు అనుమతించ వచ్చును.
(Para ii of G.O.Ms.No.238 Fin తేది:13-08-1969)

అర్జిత సెలవు సరెండర్ చేయుటకు ఉద్యోగి దరఖాస్తు చేసిన తర్వాత తేదినుండి మాత్రమే, అర్జిత సెలవు సరెండర్ చేసుకొనుటకు అనుమతించాలి. అంతకు ముందు తేది నుండి అనుమతించకూడదు.
(Govt.Memo.No.47064/1164/FR-I/4-1 F&P తేది:25-09-1974)

జనవరి 1వ తేదిన గాని,జూలై 1వ తేదీన గాని అర్జిత సెలవును సరెండర్ చేసిన సందర్భంలో అర్జిత సెలవు ఖాతాలోంచి ముందుగా సరెండర్ సెలవు తగ్గించి ఆ తర్వాతే అర్జిత సెలవు జమలు నమోదు చేయాలి.
*(Govt.Memo.No.50978/1063/FR-I/79-1 తేది:22-11-1979)

అర్జిత సెలవు సరెండర్ చేసినందువల్ల వచ్చు సెలవు జీతంలో నుంచి GPF, ప్రభుత్వానికి చెల్లించే అడ్వాన్సులు, సహకార సంస్థల బాకీలు తదితరములు తగ్గించకూడదు.

సరెండర్ సెలవుకు సంబంధించిన సెలవు జీతం చెల్లించునపుడు ఇంటి అద్దె (HRA) మరియు ఇతర కాంపెన్సెటరీ అలవెన్సులు కూడా చెల్లించాలి.
*(Govt.Memo.No.64861/797/FR-II711 తేది:14-07-1972)*

ప్రభుత్వ క్వార్టర్ లలో నివాసముంటున్న ప్రభుత్వ ఉద్యోగుల సరెండర్ సెలవు జీతంతో HRA పొందుటకు అర్హులు.
(G.O.Ms.No.337 Fin తేది:29-09-1994)

పదవీ విరమణ తేదికి సమీపంలో ఉన్న ఉద్యోగులకు కూడా సరెండర్ సెలవు మంజూరు చేయవచ్చును. కాని అట్టివారికి మంజూరు చేయబడిన కడపటి తేదీకి, పదవీ విరమణ తేదికి డ్యూటీ పీరియడ్ కు 30 రోజులు తక్కువ గాకుండా ఉండ వలెను.
(G.O.Ms.No.131 F&P తేది:25-03-1976)

పదవీ విరమణ/సర్వీసులో ఉంటూ మృతి చెందిన ఉద్యోగుల విషయంలో అర్జిత సెలవును నగదుగా మార్చుకొను విషయంలో కార్యాలయపు అధికారే మంజూరు చేయవచ్చును.
*(Govt Circular Memo No.9258-C/1768/FR-I/76-1 Fin తేది:31-01-1977)

సరెండర్ సెలవు మంజూరైన తేదినుండి 90 రోజుల లోపల బిల్లు నగదు కోసం సమర్పించాలి. సమర్పించని యెడల సరెండర్ లీవ్ మంజూరు దానంతట అదే రద్దవుతుంది.
*(Govt Memo.No.271423/A2/97-1/ F&P తేది:18-08-1997)

అర్జిత సెలవు సరెండర్ చేసిన సందర్భాలలో పూర్తి వివరములు ఉత్తర్వుల నంబరుతో సహా సంబంధిత ఉద్యోగి సర్వీసు పుస్తకంలో ఎర్రసిరాతో నమోదుచేయాలి. అలాగే సర్వీసు పుస్తకంలో అర్జిత సెలవు పట్టికలో కూడా ఏర్రసిరాతో నమోదుచేసి అటెస్ట్ చేయాలి.

ఉపాధ్యాయులు ఇటీవల బదిలీలలో భాగంగా ఒక STO పరిధి నుండి మరొక STO పరిధిలోని పాఠశాలకు మారినపుడు సరెండర్ అప్లై చేసిన సందర్భంలో పాత STO కార్యాలయం నుండి Fly leaf xerox కాపీని STO గారి Attestation to సమర్పించాలి.

ఒక టీచర్ 22 రోజులు మెడికల్ లీవ్ లో ఉన్నాడు . తరువాత 3 రోజులు ప్రభుత్వ సెలవులు . 25 రోజులకు మెడికల్ సర్టిఫికెట్ తీసుకు రావాలా?

ఒక టీచర్ 22 రోజులు మెడికల్ లీవ్ లో ఉన్నాడు . తరువాత 3 రోజులు ప్రభుత్వ సెలవులు . 25 రోజులకు మెడికల్ సర్టిఫికెట్ తీసుకు రావాలా?

Mohan
APTF Updated at: July 07, 2021

 ప్రశ్న:


ఒక టీచర్ 22 రోజులు మెడికల్ లీవ్ లో ఉన్నాడు
23 rd day జనరల్ హాలిడే 
24 th day సెకండ్ satur day 
25 th day sunday 

ఈ సందర్భంగా 25 రోజులకు మెడికల్ సర్టిఫికెట్ తీసుకు రావాలా?
23 రోజులకు తీసుకు రావాలా ?
Prefix ,suffix మెడికల్ లీవ్ లకు వర్తిస్తాయా?
GO లు తెలుపగలరు

జవాబు:
ఈ కేసులో Fitness ఎప్పుడు పొందేరో ఇంపార్టెంట్. 

(1) 22 రోజులకు Fitness Certificate ఇస్తే, 22-రోజులకు లీవ్ మరియు 3-రోజులకు suffix చేసుకోవచ్చు. 22-రోజులు లీవ్ డిడక్ట్ అవుతుంది.

(2) 25 రోజులకు Fitness Certificate ఇస్తే, suffix ఉండదు. 25 రోజులు లీవ్ డిడక్ట్ అవుతుంది.
FR 68; FR 71 మరియు AP Leave Rules ను చూడండి.

Older Posts
Subscribe to: Comments (Atom)

EXAMS

APPSC
SSC
NMMS
NTSE
HM ACT TEST
PAT
D.El.Ed
LPT
TCC
TTC
AP OPEN SCHOOL

deo websites

SRIKAKULAM
Vizianagaram
VISAKHA
W.GODAVARI
E.GODAVARI
KRISHNA
GUNTUR
PRAKASAM
NELLORE
CHITTOOR
KURNOOL
KADAPA
ANATHAPURAM

Total Pageviews

Copyright © - APTF |