బ్రతుకు లేని వాడే బడి పంతులు అవు
బ్రతుకు లేని వాడే బడి పంతులు అవుతాడనే" నానుడి ని "'మార్చి"' తిరగవ్రాసిన ""మార్పు""
Marpu Balakrishnamma
History
marpu balakrishnamma
"బ్రతుకు లేని వాడే బడి
పంతులు అవుతాడనే" నానుడి ని "'మార్చి"' తిరగవ్రాసిన ""మార్పు"" :
కీ"శే"మార్పు బాలకృష్ణమ్మ (జూన్
13, 1930 - జనవరి 6, 2013) ఉపాధ్యాయ ఉద్యమ నాయకుడు , ఆంధ్రప్రదేశ్ టీచర్స్
ఫెడరేషన్ మాజీ అధ్యక్షుడు.
ఈయన ఆంధ్రప్రదేశ్ శాసనమండలి
సభ్యులుగా కూడా పనిచేశారు.
1930 జూన్ 13 వ తేదీన శ్రీకాకుళం జిల్లా మందస మండలం భిన్నల మదనాపురంలో
జన్మించిన బాలకృష్ణమ్మ తండ్రి సర్దారు మార్పు పద్మనాభం[మొదటి సర్దారు
బిరుదాంకితుడు శ్రీ మార్పు పద్మనాభము] నుండి కమ్యూనిస్టు రాజకీయాలను వంట
పట్టించు కున్నారు. మరణించిన నాటి వరకూ అదే రాజకీయ ఒరవడిలో రాష్ట్ర ఉపాధ్యాయ
ఉద్యమంలో ఇతర ప్రజా సంఘాలతో కలిసి పనిచేశారు. మార్పు బాలకృష్ణమ్మకు ముగ్గురు
కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు.
మార్పు
బాలకృష్ణమ్మ విద్యార్థిదశ నుండే ప్రగతి భావాలను కలిగి ఉండేవారు. ఉపాధ్యాయ
శిక్షణ అనంతరం ఎయిడెడ్ పాఠశాల
లో
టీచర్‌గా చేరి ఉపాధ్యాయ ఉద్యమంలో చేరారు. తర్వాత ఆయన ఉపాధ్యాయ ఉద్యమ
పితామహుడిగా అవతరించారు. ప్రాథమికోపాధ్యాయ ఫెడరేషన్‌ను 1960లో ప్రారంభించి
మిలిటెంట్ పోరాటాలను నడిపించారు. ఉపాధ్యాయ ఉద్యమంలో ధర్నా వంటి కొత్త పోరాట
రూపాలను ప్రవేశపెట్టి విజయం సాధించారు.
మార్పు బాలకృష్ణమ్మ 1969 జూన్‌లో గుడివాడలో జరిగిన ఎపిటిఎఫ్ సభల్లో అధ్యక్షుడిగా
ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 1970లో పార్వతీపురం కుట్రకేసులో అరెస్టయ్యారు.
రెండున్నర సంవత్సరాల పాటు సోంపేట, విశాఖపట్టణం , రాజమండ్రి తదితర జైళ్లలో ఉండి
తర్వాత నిర్దోషిగా విడుదలయ్యారు.
1974
నుండి 1985 వరకూ ఉత్తర సర్కార్ ఉపాధ్యాయ నియోజకవర్గం నుండి శాసనమండలి సభ్యులుగా
కొనసాగారు. శాసనమండలి ప్రోగ్రెసివ్ డెముక్రటిక్ ఫ్రంట్‌కు నాయకుడిగా ఉండి
శాసనమండలిని ఉపాధ్యాయ ఉద్యమ వేదికగా మార్చగలిగారు.
1987లో
ఎపిటిఎఫ్‌ను పునర్వ్యవస్థీకరించిన తర్వాత 2008 వరకూ ప్రధానకార్యదర్శిగానూ
కొనసాగారు. ఉపాధ్యాయ ఉద్యమకర్తగా అనేక విజయాలను సాధించారు.
ఏ.పి.టి.యఫ్ ఉద్యమ ఘట్టాలు
-
1987 : ఆగష్టు -విశాఖపట్నంలో
ఎ.పి.టి.యఫ్ 14 వ విద్య మహాసభలు, నిరంకుశంగా, అప్రజాస్వామికంగా ఎ.పి.టి.యఫ్
మరియు ఉపాధ్యాయ ఉద్యమ ప్రయోజనాలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న సింగరాజు
రామకృష్ణయ్య ముతా నాయకత్వాన్ని తొలగించి ఎ.పి.టి.యఫ్. పునర్వ వ్యవస్దీకరణ ,అధ్యక్షులు
గా పిళ్లా సుబ్బారావు ప్రధాన కార్యదర్శిగా మార్పు బాలక్రిష్ణమ్మ ఎన్నిక,
ఎ.పి.టి యఫ్ అధికారిక పత్రిక ఉపాధ్యాయ ప్రగతి ప్రారంభం.
-
1998 : నవంబర్ 9 - అఖిల
భారత విద్య సంఘాల సమాఖ్య (ఇ ఫి యా )ఎన్నికలు ఢిల్లీ లో :ధక్షిణ మండల
విభాగానికి ఇఫియ ఉపాధ్యక్షులుగా మార్పు బాలక్రిష్ణమ్మ,కార్యదర్శిగా సి .హెచ్.కొండేస్వరరావు,కార్యవర్గ
సబ్యులుగా జి. సత్యనారాయణ ఎన్నిక.
ఈయన జనవరి 6 , 2013 న
హైదరాబాద్ లోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో రాత్రి 9.30 గంటలకు తుది శ్వాస విడిచారు
ఈనాడు ఉపాధ్యాయులకు సముచిత
స్థానము కల్పించడము లో అవిశ్రాంత కృషి జరిపిన కీ"శే" మార్పు బాలకృష్ణమ్మ గారు
సదా స్మరణీయులు.