మిత్రులారా!
1998 మరియు 2008 డీఎస్సీ సమాచారం:
1998 మరియు 2008 డీఎస్సీ వారికి తిరిగి ఒప్పంద ప్రాతిపదికన టీచర్లగా తీసుకును ప్రక్రియ కేబినెట్ ఆమోదించింది. ఇందుకు సంబంధించి కొత్త సమాచారం మీ ముందు ఉంచుతున్నాం. 1998 డీఎస్సీ కి సంబంధించి మొదటి జాబితాలో పేరు వచ్చి తదుపరి జాబితాలో పేరు రానటువంటి వారు కేవలం 36 మంది మాత్రమే ఉన్నారు. కావున ఈ 36 మందికి అవకాశం కలదు.
2008 డియస్సి కి సంబంధించి అన్ని కేటగిరీలలో డీఎడ్ అర్హతతో ఉద్యోగం పొందిన వారి చివరి రాంకర్ కన్నా ఎక్కువ మార్కులు పొందిన బిఈడి వారికి అవకాశం కలదు. కావున 2008 సెలక్షన్ జాబితా మరియు మొత్తం మార్కుల జాబితా తీసుకోవాల్సి ఉంది. ఇది కలెక్టర్ల ఆధ్వర్యంలో ఈ జాబితాను తయారు చేయాల్సిన అవసరం ఉందని తెలియజేస్తున్నాము.
- కె వెంకటేశ్వరరావు, అధ్యక్షులు & జి.హృదయ రాజు, ప్రధాన కార్యదర్శి ఏపిటిఎఫ్.