ఏపీటీఎఫ్:
ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ MLC అభ్యర్థి విషయంలో చాలా సంఘాలు మద్దతు కోరుతూ లేఖలు సమర్పించడం, మన సంఘ నాయకులు అభ్యర్థులుగా వుండే విషయం మొన్నటివరకు పరిశీలించడం జరిగింది.
12.2.19న 3 జిల్లాల ఏపీటీఎఫ్ ఉత్తరాంధ్ర శాఖలు చివరి సమావేశమై చేసిన తీర్మానాల మేరకు 14.2.19న
ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ MLC APTF బలపరిచిన అభ్యర్థిగా సామాజిక స్పృహ,పోరాట స్ఫూర్తి, సామాజిక, ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యలపై స్పష్టమైన అవగాహన కలిగి అనేక ఉద్యమాలలో, పోరాటాలలో పాల్గొంటూ ఉద్యమిస్తున్న యువ నాయకుడు , న్యాయ కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా విధులు నిర్వహిస్తున్న విద్యాధికులు శ్రీ అడారి కిషోర్ కుమార్ ను నేడు విశాఖపట్నంలో జరిగిన రాష్ట్ర, ఉత్తరాంధ్ర జిల్లాల నాయకుల సమావేశంలో ప్రకటించడమైనది.
ఈ సమావేశంలో APTF రాష్ట్ర గౌరవాధ్యక్షులు: ఏ.సదాశివ రావు, అధ్యక్షుడు: కె.వెంకటేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి: జి.హృదయరాజు, రాష్ట్ర సబ్ కమిటి, ఈ.సి సభ్యులు, మూడు జిల్లాల ఉత్తరాంధ్ర అధ్యక్ష, ప్ర.కా లు మరియు విశాఖ నగర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఆర్.కృష్ణ, జి.బాలాజీ రావు,బి.సుమలత, డి.ఈశ్వరరావు, జె.సి.రాజు, టి.చలపతిరావు, కె.పాపారావు, యం.జె సేవియర్, వీరభద్రరావు ,కృష్ణారావు, ధనుంజయరావు, వెంకట్రావు లు పాల్గొన్నారు.
- అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు,ఏపీటీఎఫ్