అంబేద్కర్ యూనివర్సిటీలో కొత్తకోర్సు
🔸బీఆర్‌ఏయూ, బొల్లినేని మెడిస్కిల్క్స్ మధ్య కుదిరిన ఒప్పందం
🔹డాక్టర్ బీఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ, బొల్లినేని మెడిస్కిల్క్స్ సంయుక్తంగా కొత్తకోర్సుల నిర్వహణకు శనివా రం ఒప్పందం కుదరింది. 2019-20 విద్యా సం వత్సరం నుంచి మాస్టర్ ఆఫ్ హాస్పిటల్ అడ్మిని స్ట్రేషన్ కోర్సును ప్రారంభించనున్నారు. జెమ్స్ ఆస్పత్రి క్యాంపస్‌లో తరగతులు, అంబేద్కర్ వర్సిటీలో పరీక్షలు నిర్వహించనున్నారు.
🔹ఈ కోర్సులో చేరేందుకు ఎంబీబీఎస్, బీడీఎస్, బీహెచ్‌ఎంఎస్, బీఏఎంఎస్, బీఎస్సీ, బీకాం పూర్తిచేసిన అభ్యర్థులు అర్హులని బొల్లినేని మెడిి స్కల్క్స్ సెంటర్ హెడ్ సీహెచ్.నాగేశ్వరరావు తెలిపారు. ఈ కోర్సులో 40 సీట్లు ఉన్నాయని, దీనిలో కౌన్సెలింగ్ ద్వారా 30 సీట్లు, 10 సీట్లు మేనేజ్‌మెంటు కోటాలో10 సీట్లు భర్తీ చేస్తామన్నారు. ఈ కోర్సు పూర్తిచేసిన వారికి దేశ, విదేశాల్లో మెరుగైన ఉపాధి అవకాశాలు న్నాయని చెప్పారు.
🔸ఆసక్తి గల అభ్యర్ధులు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ ప్రిన్సిపాల్ కార్యాలయాన్ని సంప్రదించాలన్నారు. ఈ కార్యక్రమంలో వీసీ ప్రొఫెసర్ కూన రాంజీ, రిజిస్ట్రార్ కె.రఘుబాబు పాల్గొన్నారు.