APTF
  • Home
  • Sitemap
  • search

WEB LINKS 1

CFMS
E-SR
CHILD INFO
CSE AP
AP SCERT
CPS
MDM
EHS
ZPPF SLIPS
APGLI

WEB LINKS 2

DIKSHA
INCOME TAX
DSC LISTS
TRANSFERS 2022
Home » APTF » AP స్పెషల్ టీచర్లు... నోషనల్ ఇంక్రిమెంట్లు! -ఎం.ప్రతాపరెడ్డి.

AP స్పెషల్ టీచర్లు... నోషనల్ ఇంక్రిమెంట్లు! -ఎం.ప్రతాపరెడ్డి.

Posted by APTF 1938
» APTF
» Monday, 18 March 2019

AP స్పెషల్ టీచర్లు... నోషనల్ ఇంక్రిమెంట్లు! 
         1983 నుంచి 1996 వరకు నెలకు 398 రూపాయల కన్సాలిడేటెడ్ పే పై పనిచేసిన స్పెషల్ టీచర్లు, స్పెషల్ భాషా పండితులు, స్పెషల్ పీఈటీ (కాసేపు వీళ్లందరినీ ‘స్పెషల్ టీచర్లు’ అనుకుందాం) లకు నోషనల్ ఇంక్రిమెంట్లు మంజూరుచేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2019 మార్చి 1న 28 నంబర్ జీవో జారీచేసింది. సదరు జీవో AP టీచర్లకే వర్తించినా... స్పెషల్ టీచర్లుగా పనిచేసి రిటైరైన వారు, ఇంకా సర్వీస్లో ఉన్న టీచర్లు మన రాష్ట్రంలోనూ ఉన్నారు. పైగా, స్పెషల్ టీచర్లకు నోషనల్ ఇంక్రిమెంట్లు మంజూరు చెయ్యాలన్న ప్రధాన డిమాండ్ ఉపాధ్యాయ సంఘాల నుంచి దశాబ్దాలుగా ఇక్కడా ఉంది. ఈనేపథ్యంలో AP ప్రభుత్వం జారీచేసిన జీవోపై నా అభిప్రాయం! 

> 1983 - 1996ల మధ్యకాలంలో స్పెషల్ టీచర్లుగా నియామకమైన వారికి ప్రాస్పెక్టివ్ ఎఫెక్ట్ తో ఈజీవో వర్తిస్తుంది.

> ఈజీవో ద్వారా మంజూరయ్యే నోషనల్ ఇంక్రిమెంట్లు కేవలం పెన్షన్ లెక్కింపు కోసం మాత్రమే ఉద్దేశించబడినవి. 

> స్పెషల్ టీచర్లుగా తొలుత నియామకమై... ఇంకా సర్వీస్లో ఉన్న టీచర్లకు ఈజీవో ద్వారా వెంటనే లభించే ఆర్ధిక ప్రయోజనమేదీ లేదు. రిటైరయ్యాకే పెన్షన్ కోసం మాత్రమే నోషనల్ ఇంక్రిమెంట్లు లెక్కిస్తారు! 

అస్పష్టతలు.... లోపాలు! 

> ‘ప్రాస్పెక్టివ్ ఎఫెక్ట్’ అంటే జీవో జారీ తేదీ నుంచి రిటైరయ్యే ఉపాధ్యాయులకు నోషనల్ ఇంక్రిమెంట్స్ మంజూరు చేయాలని అర్థమా? లేక గతంలో రిటైరైన టీచర్లకు నోషనల్ ఇంక్రిమెంట్ల ఆర్థిక ప్రయోజనం జీవో జారీచేసిన తేదీ నుంచి వర్తింపజేయాలని అర్థం చేసుకోవాలో క్లారిటీ లేదు.

> ఫ్యామిలీ పెన్షనర్లకు నోషనల్ ఇంక్రిమెంట్ల లబ్ది ఉంటుందా? ఉండదా? స్పష్టతలేదు. 

> అప్రెంటీస్ టీచర్లందరికీ రెండేసి నోషనల్ ఇంక్రిమెంట్లు చొప్పున మంజూరు అయ్యాయి. ఎందుకంటే.... ప్రతి టీచర్... అప్రెంటీస్ లో కొనసాగింది రెండేళ్లే! అందుకే అందరికి రెండేసి చొప్పున నోషనల్ ఇంక్రిమెంట్లు దక్కాయి. కానీ, స్పెషల్ టీచర్లు అలా కాదు. కొందరు ఆరు నెలలే స్పెషల్ టీచరుగా పనిచేసి రెగ్యులర్ స్కేల్ పొందితే.... మరికొందరు ఆరేళ్లకు పైగా స్పెషల్ టీచరుగా కొనసాగి... ఆ తర్వాత రెగ్యులర్ స్కేల్ పొందారు. ఈ నేపథ్యంలో... స్పెషల్ టీచర్లకు ఎన్ని నోషనల్ ఇంక్రిమెంట్లు మంజూరు చెయ్యాలో జీవోలో స్పష్టతలేదు. చేసిన సర్వీస్ ప్రాతిపదికగా...దామాషా పద్ధతిలో నోషనల్ ఇంక్రిమెంట్ల మంజూరుకు అక్కడి సంఘాలు కృషి చేయాల్సి ఉంది. ఒక్కో ఏడాదికి ఒక్క ఇంక్రిమెంట్.... ఆరేళ్ళు పనిచేస్తే ఆరు నోషనల్ ఇంక్రిమెంట్లు మంజూరు కావాలి. 

> నోషనల్ ఇంక్రిమెంట్ల మంజూరు కారణంగా వార్షిక ఇంక్రిమెంట్ ప్రీపోన్మెంట్ అవుతుందా? లేదా? అనే విషయమూ స్పష్టం కావల్సి ఉంది. ఉదాహరణకు 1984 జనవరిలో స్పెషల్ టీచరుగా నియామకమై, 1985 ఆగస్టులో రెగ్యులర్ స్కేల్ పొందిన వారికి సహజంగానే ఆగస్టులో ఇంక్రిమెంటు ఉంటుంది. నోషనల్ ఇంక్రిమెంట్లు మంజూరుచేస్తే... ఇంక్రిమెంటల్ సర్వీస్ జనవరికి మారుతుంది. కాబట్టి, వార్షిక ఇంక్రిమెంటు ... విధిగా ప్రీపోన్ కావల్సిందే! 

> నోషనల్ ఇంక్రిమెంట్లు మంజూరు చేసి.... నియామకమైన నాటినుంచి నేటివరకు అన్ని PRC లను వర్తింపజేసి... వేతన స్థిరీకరణ ఉత్తర్వులు జారీచేస్తేనే టీచర్లకు గరిష్ట ప్రయోజనం చేకూరుతుంది. ఈవిషయంపై క్లారిటీ రావాల్సి ఉంది. 

> కేవలం పెన్షన్ లెక్కింపు కోసం మాత్రమే కాకుండా... పెన్షనరీ బెనిఫిట్స్ కూడా నోషనల్ ఇంక్రిమెంట్స్ వర్తించే విధంగా జీవో సవరణ జరగాలి. 

> స్పెషల్ టీచర్లుగా నియామకమై ఇంకా సర్వీస్లో ఉన్న టీచర్లకు సైతం నోషనల్ ఇంక్రిమెంట్ల కనీసం ప్రాస్పెక్టివ్ ఎఫక్ట్ తోనైనా మంజూరుకు వీలు కల్పించే విధంగా ఉత్తర్వులుండాలి.

> ఎలాంటి అస్పష్టతలకు, అనుమానాలకు తావులేకుండా పూర్తి మార్గదర్శకాలతో ప్రభుత్వమే ఒక మెమోనో లేక డైరెక్టర్ ఒక ప్రొసీడింగునో వెంటనే జారీచేసే విధంగా అక్కడి ఉపాధ్యాయ సంఘాలు కృషి చేయాలి. 

-ఎం.ప్రతాపరెడ్డి. 
TRTF రాష్ట్ర గౌరవాధ్యక్షుడు!

Share this post in

No comments:

Newer Post
Older Post
Home
Subscribe to: Post Comments (Atom)

EXAMS

APPSC
SSC
NMMS
NTSE
HM ACT TEST
PAT
D.El.Ed
LPT
TCC
TTC
AP OPEN SCHOOL

deo websites

SRIKAKULAM
Vizianagaram
VISAKHA
W.GODAVARI
E.GODAVARI
KRISHNA
GUNTUR
PRAKASAM
NELLORE
CHITTOOR
KURNOOL
KADAPA
ANATHAPURAM

Total Pageviews

Copyright © - APTF |