■ మొన్నటి డీఏ
■ నిన్నటి పీఆర్సీ
■ 17 రోజుల ఆర్జిత సెలవు
■ ఇప్పుడేమో స్పెషల్ టీచర్లకు స్పెషల్ జీఓ.
ఎప్పటినుంచో అడుగుతున్న సి.పి.ఎస్ రద్దుపై పల్లెత్తు మాట్లాడకుండా కనీసం రెండు లక్షల మందికి శఠగోపం పెట్టిన మీ వైఖరి వల్ల మేం విశ్వాసం కోల్పోయాం.
ఉపాధ్యాయులకు పదోన్నతులు ఇవ్వకుండా కాలయాపన చేయడాన్ని ఎవరూ మరిచిపోలేరు.
ప్రత్యేకించి పండితులు, పిఈటీ ల ఆప్గ్రేడేషన్ పై ద్వంద్వ వైఖరి.
ఉమ్మడి సర్వీసు నిబంధనల అడ్డుగోడలను తొలగించే విషయంలో చేష్టలుడిగిన నిస్క్రియాపరత్వ చర్యలు గుర్తున్నాయ్.
రాష్ట్రంలో 23వేల ఉపాధ్యాయ ఖాళీలను భర్తీచేయకుండా నడిపిస్తున్న మీ అసహజ విన్యాసాలను మేమే కాదు ప్రజలు కూడా చూస్తున్నారు
డీఈఓ పూల్ పేరుతో ఉపాధ్యాయులను వేధిస్తున్న వైఖరి.
ప్రయివేటు, కార్పొరేట్ అనుకూల విధానాలతో సర్కారు బడులను కూల్చేసే ఎత్తుగడలు.
పై ఉత్తర్వుల విడుదల తర్వాత ప్రభుత్వ అనుకూల మీడియాలో కొందరు ప్రభుత్వ అనుకూలురు ఉద్యోగ ఉపాధ్యాయులకు కిరీటం పెట్టినట్లు, వారి ఇల్లు బంగారమైనట్లు ఆగం చేస్తున్నారు. ఆ ఉత్తర్వులు ఎంత లోపభూయిష్ట0గా ఉన్నాయో లోతుగా పరిశోధన చేయాల్సిన పనిలేదు. వాస్తవానికి ఈ ప్రభుత్వం విశ్వసనీయత కోల్పోయింది. ఎందుకూ కొరగాని జీవో లను జారీ చేస్తూ, ప్రజలందించిన అధికారం మాటున ప్రభుత్వం ఉద్యోగులను నిస్సహాయులుగా మార్చింది. ఒకరకంగా చెప్పాలంటే శరణార్ధులుగా చూస్తోంది. తమ మాటలకు చప్పట్లు మోగించే భజంత్రీగాళ్లయిన కొందరిని తన చుట్టూ చేర్చుకొని ప్రపంచం తన చుట్టూ భ్రమిస్తోందని భ్రమ పడుతోంది. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో అందివచ్చిన అధికారం ద్వారా కొన్ని వర్గాలకు ప్రయోజనం చేకూర్చే విధంగా వ్యవహరిస్తోంది. సామాజిక అసమానతలు సృష్టిస్తూ వర్గసమాజ పునస్థాపనకు పూనుకొంటోంది. కేవలం ఎత్తుగడలతో బూర్జువా విధానాలతో వ్యవస్థలను తనచెప్పుచేతల్లో పెట్టుకునే చర్యల్లో నిమగ్నమైంది. ఈ ప్రభుత్వాన్ని మేము ఖచ్చితంగా సమీక్షిస్తాం. అన్నివర్గాలకు న్యాయం జర్పించేందుకు మేము పోరాడుతూనే ఉంటాం. ఉచితాల పేరుతో ఖజానాకు కన్నం వేస్తున్న అనుచిత వైఖరిని ఎండ గడుతూనే ప్రజల పక్షాన గొంతెత్తి అరుస్తూనే ఉంటాం.
మోహన్ దాస్ నీరుకట్టు
రాష్ట్ర కౌన్సిలర్, ఏపీటీఎఫ్.
-----------------------------------
ఏపీటీఎఫ్: రూ:398/- స్పెషల్ టీచర్ల నోషనల్ ఇంక్రిమెంట్లు 50% ప్రయోజనంతోనే ఆమోదించిన ముఖ్యమంత్రి.
దీర్ఘకాలికంగా పెండింగులో ఉన్న రూ:398/- స్పెషల్ టీచర్ల నోషనల్ ఇంక్రిమెంట్లు సమస్య అనేక పోరాటాల ద్వారా గత కేబినేట్ లో ఆమోదం పొందిన విషయం తెలిసిందే.
ఆర్థికాన్ని తగ్గించుకునే మార్గంలో కేవలం 50% ప్రయోజనం కలుగే విధంగా చేసే ప్రయత్నాలను పసిగట్టి FAPTO ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. సానుకూలంగా ఉంటుందని భావించాము.
ఐతే నేడు ముఖ్యమంత్రి ఆమోదం పొందిన ఫైల్ లో ఎటువంటి మార్పు లేదన్నది గమనించాలి. అనగా రూ:398/-లతో పనిచేసిన స్పెషల్ టీచర్లకు నోషనల్ ఇంక్రిమెంట్లు కేవలం వారు (ప్రస్తుతం సర్వీస్ లో ఉన్నవారు కూడా) పదవీవిరమణ పొందినప్పుడు మాత్రమే వర్తించేలాగున ప్రభుత్వం ఆమోదించింది. ఏపీటీఎఫ్, FAPTO దీన్ని ఖండిస్తున్నది. దీనిపై Aptf, Fapto చర్చించబోతుంది, తగు నిర్ణయం తీసుకుంటుంది.
ప్రస్తుతం సి.యం ఆమోదం పొందిన దష్ట్రమ్ పై జి.ఓ ఇవ్వాలంటే ఎన్నికల కమిషన్ అనుమతి తీసుకోవాలని, ఫైనాన్స్ కాంకరెన్స్ నెంబరు పొందాలనే మీమాంసలో విద్యాశాఖ ఉన్నది.
- అధ్యక్షుడు:కె.వెంకటేశ్వరరావు & ప్రధాన కార్యదర్శి: జి.హృదయరాజు, ఏపీటీఎఫ్
-----------------------------------