ఏపీటీఎఫ్ 75 సం. లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఫెడరేషన్ ఆవిర్భవించిన తాపేశ్వరం తూర్పుగోదావరి జిల్లాలో నేడు ప్లాటినం జూబిలీ ప్రారంభ వేడుకలు ఘనంగా జరిగాయి.
ఫెడరేషన్ అధ్యక్షుడు కె.వెంకటేశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ముందుగా జాతీయ, ఏపీటీఎఫ్ జెండాలను ఆవిష్కరించారు.
ఉమ్మడి మదరాసు రాష్ట్రంలో, బ్రిటిష్ ప్రభుత్వం నిర్బంధం విధించిన కాలంలో 1944 సం. లో ఆంధ్రరాష్ట్ర ప్రాథమికోపాధ్యాయ ఫెడరేషన్ గా పుట్టి 1972 లో ఏపీటీఎఫ్ గా మారి విద్యారంగం - ఉపాధ్యాయుల సంక్షేమం కోసం అవిరాళ కృషి చేస్తోంది.
నేడు పొందుతున్న అనేక ప్రయోజనాలు ఈ ఫెడరేషన్ ద్వారా పోరాడి సాధించుకున్నవే.
ఫెడరేషన్ ప్రారంభకులు మారేళ్ళపూడి పుత్ర సత్యశర్మ, మణిక్యాంబ, చెన్నుపాటి లక్ష్మయ్య, మార్పు బాలకృష్ణమ్మ తదితర ఉద్యమకారులకు ఘన నివాళులు అర్పించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో ఏపీటీఎఫ్ నాయకులు జి.సత్యనారాయణ, ఏ.వి.రామారావు, కె.సుబ్బారెడ్డి, వై ఆర్కే ప్రసాద్,ఏ.సదాశివరావు, జి.హృదయరాజు రాష్ట్ర సబ్ కమిటి సభ్యులు, అన్నిజిల్లాలు మరియు ఆతిధ్యం ఇచ్చిన తూర్పు గోదావరి జిల్లా ఏపీటీఎఫ్ కార్యకర్తలు , శ్రేయోభిలాషులు పాల్గొన్నారు.
- ఏపీటీఎఫ్