ఏపీటీఎఫ్:నేడు ఆంధ్రప్రదేశ్ విద్యా పరిరక్షణ కమిటి *(ఏపీసెక్)* రాష్ట్ర కమిటి సమావేశం విజయవాడలో ఏపీటీఎఫ్ -1938 రాష్ట్ర కార్యాలయంలో ఏపీసెక్ అధ్యక్షులు రమేష్ పట్నాయక్ గారి అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో ఐఫియా జాతీయ ఉపాధ్యక్షులు కె.సుబ్బారెడ్డి, ఏపీటీఎఫ్ ప్రధానకార్యదర్శి జి.హృదయరాజు, డిటీఎఫ్ నాయకులు పి.కృష్ణయ్య,కె.నరహరి పీడియస్యూ ల నాయకులు ఎ.రవిచంద్ర, యం.రామకృష్ణ, రామ్మోహన్, ఘనిరాజ్ , రాజేష్ లు పాల్గొన్నారు. ఈ సమావేశంలో సభ్యసంఘాలన్ని సుదీర్ఘంగా చర్చించి తీర్మానాలు చేయడం జరిగింది.
👉 అమ్మఒడి పథకం అమలు వర్తింపు ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ఉపకరించాలని, ప్రభుత్వ పాఠశాలల్లో చదివించే పిల్లల తల్లిదండ్రులకు మాత్రమే వర్తింపజేయుటకు ప్రభుత్వానికి ప్రాతినిధ్యం చేయాలని. పూర్తి వివరాలతో కరపత్రం ముద్రించాలని.
👉 నూతన జాతీయ విద్యా విధానం ముసాయిదా లోని లోపాలను సవరించి SCERT మరియు కేంద్రానికి పంపించాలని
👉 డియస్సి-18 మరియు ఖాళీగా ఉన్న టీచర్ల పోస్టులన్నింటిని భర్తీ చేయాలని త్వరలో పోరాట కార్యాచరణ ను చేపట్టాలని తీర్మానించడమైనది.
- అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు, ఏపీటీఎఫ్