27% I.R. పై ఆర్థిక శాఖ నోట్:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం జీవో నెం. 21 ద్వారా ఉద్యోగులకు 27% మధ్యంతర భృతి మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఐ.ఆర్. ను జూలై 2018 నుండి నోషనల్ గానూ, ఏప్రిల్ 2019 నుండి నగదుగా జూన్ 2019 లో చెల్లించాలని ఉత్తర్వులిచ్చింది. 2 నెలల క్రితం ఎన్నికలకు వెళ్ళిన ప్రభుత్వం ఉద్యోగుల ఓట్లను ఆకర్షించడం కోసం ఇచ్చిన గమ్మత్తయిన ఉత్తర్వు ఇది. గత ప్రభుత్వం పై ఏమాత్రం భారం పడకుండా, నూతనంగా వచ్చిన ప్రభుత్వంపైన భారం పడేటట్లుగా ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. నూతనంగా ఎన్నికైన రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు 27% ఐ.ఆర్. మంజూరు చేస్తూ జూలై 2019 నుండి చెల్లించాలని నిర్ణయించింది. ఈ సందర్భంగా రాష్ట్ర ఉద్యోగుల నుండి వస్తున్న డిమాండ్ ఏమంటే., ఏప్రిల్ నుండి నగదు గా 20% చెల్లిస్తూ., జూలై నుండి 27 % చెల్లించాలని కోరుతున్నారు. ఈ సందర్భంగా ఉద్యోగులందరూ క్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్న రాష్ట్ర ఆర్థిక స్థితిని గమనించి సహకరించవలసిందిగా కోరడమైనది. ఉద్యోగులు 27 శాతం ఐ.ఆర్. యొక్క ప్రభావాన్ని మరింత అర్థం చేసుకోవాలి.
సమీప భవిష్యత్తులో ఉద్యోగుల ఫిట్మెంట్ డిమాండ్ మేరకు పీఆర్సీ చేత కూడా సిఫార్సు చేయబడాలి. ఉద్యోగులు ఐ.ఆర్. 27% నిర్ణయం నుండి రాబోయే 5 సంవత్సరాలలో కలిగే ప్రధాన ప్రయోజనాలను కూడా గుర్తు పెట్టుకోవాలి.కా కాబట్టిజా కేబినెట్ నిర్ణయాన్ని అనుసరించి మునుపటి 20 % ఐ.ఆర్. ఉత్తర్వులను అధిగమించి (రద్దు చేసి) 27 % ఐఆర్ ఉత్తర్వులు జారీ చేయాలి. ఇందువల్ల రాష్ట్ర ప్రభుత్వానికి 2 వేల కోట్ల రూపాయల తక్షణ రిలీఫ్ లభిస్తుంది.రాష్ట్ర ప్రభుత్వం జూన్ 1వ తేదీ నుండి ఇప్పటివరకు 700 కోట్ల రూపాయల ఓవర్ డ్రాఫ్ట్ పైన ఉన్నది. ఇలా ఓవర్డ్రాఫ్ట్ పైన ఉండడం రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది..