ఆంద్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య (ఫ్యాప్టో) కు సోమవారం విజయవాడలో జరిగిన ఎన్నికల్లో ఏపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు కె. వెంకటేశ్వరరావు కో చైర్మన్ గా ఎన్నికయ్యారు. వారు రెండేళ్ల పాటు పదవిలో వుంటారు. గత రెండేళ్లుగా ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హృదయ రాజు ఫ్యాప్టో సెక్రటరీ జనరల్ గా పనిచేశారు. కీలకమైన సిపిఎస్ ఉద్యమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించి రాజకీయ పార్టీల ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చేలా ప్రజా ఉద్యమాన్ని నిర్మించారు.
