
మన రాష్ట్ర నూతన విద్య శాఖ మంత్రి గారైన శ్రీ డాక్టర్: ఆదిమూలపు సురేష్ గారిని కలిసి అభినందనలు తెలియజేయడం జరిగింది. అనంతరం ఏ.పి.టి.ఎఫ్ రాష్ట్ర అధ్యక్ష & ప్రధాన కార్యదర్శులు కె.వెంకటేశ్వరరావు & జి.హృదయ రాజ్ మరియు రాష్ట్ర నాయకులు మాట్లాడుతూ అమ్మ ఒడి పధకం కేవలం ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు మాత్రమే ఇచ్చేలా చేయాలని వారు వారిని కోరగా మంత్రివర్యులు సానుకూలంగా స్పందించారు. అనంతరం నెల్లూరు జిల్లా కు చెందిన మంత్రి అనిల్ కుమార్ ను కలిసి అభినందించారు.
