*ఏపీటీఎఫ్*: నేడు ఉదయం ఏపీటీఎఫ్ అనేక సమస్యలపై కమీషనర్ (జె.డి. సర్వీసెస్) గారికి ప్రాతినిధ్యం చేయడమైనది. ప్రధానంగా:
1. పదోన్నతులు, డియస్సి నియమాకాలకు ముందు బదిలీలు జరపాలని రెండోసారి ప్రాతినిధ్యం చేయడం జరిగింది. రెండు అకాడమిక్ సం. లు లేదా సున్నా (0) సర్వీస్ అర్హత ప్రాతిపదికగా, ఆన్లైన్ లో బదిలీలు నిర్వహించాలని..
2. డీఈవో పూల్ టీచర్లకు శాశ్వత స్థలాలు కేటాయించాలని
3) 317 ఏపీఏటి తీర్పు ప్రకారం తెలుగు, హిందీ పండిట్లకు మరియు అప్గ్రేడ్ కాబడిన 12827 పోస్టులకు పదోన్నతులు వెంటనే చేపట్టాలని
4) ఆప్గ్రేడెడ్ ఉన్నత , యూ.పి పాఠశాలలకు & RMSA ఉన్నత పాఠశాలలకు హెచ్.యమ్ & స్కూల్ అసిస్టెంట్ ల పోస్టులను పదోన్నతులకు చూపాలని తదితర అంశాలపై చర్చించి ప్రాతినిధ్యం చేయడమైనది.
జె.డి గారు బదులిస్తూ.... బదిలీలు ప్రభుత్వం తీసుకొనే నిర్ణయం బట్టి ఉంటుందని, డీఈవో పూల్ టీచర్లకు వేంటనే న్యాయం చేస్తామని,317 ఓ.ఏ వారికి పదోన్నతులు కల్పించాలని డీఈవో లకు చెప్తామన్నారు. RMSA, అప్గ్రేడ్ ఉన్నత, యూపీ పాఠశాలలకు ఇంకా పోస్టులు క్రియేట్ కాలేదు కాబట్టి ఇప్పటి షెడ్యూల్ లో భర్తీ చేయలేమని తెలియజేశారు( కొన్ని అంశాలపై స్పష్టతలను నేటి కాన్ఫరెన్స్ లో కూడా తెల్పుతామన్నారు).
- అధ్యక్షుడు: కె.వెంకటేశ్వరరావు & ప్రధాన కార్యదర్శి: జి.హృదయరాజు, ఏపీటీఎఫ్