APTF
  • Home
  • Sitemap
  • search

WEB LINKS 1

CFMS
E-SR
CHILD INFO
CSE AP
AP SCERT
CPS
MDM
EHS
ZPPF SLIPS
APGLI

WEB LINKS 2

DIKSHA
INCOME TAX
DSC LISTS
TRANSFERS 2022
Home » MUNICIPAL » మున్సిపల్ పాఠశాలలు– విద్యాభివృద్ధి, మౌలిక వసతుల కల్పన కమిషనర్లకు పలు సూచనలు జారీ

మున్సిపల్ పాఠశాలలు– విద్యాభివృద్ధి, మౌలిక వసతుల కల్పన కమిషనర్లకు పలు సూచనలు జారీ

Posted by APTF 1938
» MUNICIPAL
» Saturday, 20 July 2019


అంశంపై ఈ నెల 2వ తేదీన విజయవాడలో మున్సిపల్ కమిషనర్లు,  ఆర్.డి. లతో నిర్వహించిన వర్క్ షాప్ నందు తీసుకొన్న నిర్ణయాలను అనుసరించి ఈ రోజు పురపాలక శాఖ మున్సిపల్ కమిషనర్లకు పలు సూచనలు జారీ చేసింది:
(Roc No.11021/103/2019/J.Sec., dt. 20/7/2019)
1) _ప్రతి మున్సిపల్ కమిషనర్ ప్రతిరోజు కనీసం ఒక పాఠశాలను సందర్శించాలి. కనీసం రెండు గంటలపాటు పాఠశాలలో ఉండి తరగతి గదిలోనూ విద్యార్థులతోనూ మమేకం కావాలి. వారికి వీలుకాని పక్షంలో ఇతర అధికారులను డిప్యూట్ చేయాలి._
2) _పాఠశాలలోని మౌలిక వసతులు సదుపాయాలపై పై ఫోటోలతో సహా డి.పి.ఆర్. లు తయారు చేయించాలి. అవసరమైన నిధులను 14వ ఆర్థిక సంఘం/సమాజ భాగస్వామ్యం/ఎస్.ఎస్.ఏ. ల నుండి సేకరించాలి._ _సదరు DPRs అన్నింటిని july 25 లోపు DMA కార్యాలయానికి పంపాలి._
_మున్సిపల్ ఆర్డీ లు తమ విజిట్ నందు పురపాలక పాఠశాలలను తప్పక సందర్శించాలి.._

*_సమావేశంలో అధికారుల బృందం ఇచ్చిన సలహాల మేరకు క్రింది సూచనలను అందరు కమిషనర్ లు పాటించవలసిందిగా తెలియజేయడమైనది:_*
* _కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ CSR క్రింద దాతల సాయంతో పాఠశాలలకు కావలసిన మౌలిక వసతుల ఏర్పాటుకు తగు చర్యలు తీసుకోవాలి._ 
* _అదనపు తరగతి గదులు, టాయిలెట్లు అవసరమైన పక్షంలో వెంటనే సర్వశిక్ష అభియాన్ కు ప్రతిపాదనలు పంపి నిధులు సేకరించాలి._
* _పాఠశాల భవనాలకు మరమ్మతులు 14వ ఆర్థిక సంఘం లేదా జనరల్ ఫండ్ నిధుల నుండి ఖర్చు చేయాలి._
* _టాయిలెట్ల నిర్వహణ, రిపేర్లు తదితరాలకు స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ నుండి నిధులు సేకరించాలి._
* _సురక్షిత త్రాగునీరు, బాల బాలికలకు విడివిడిగా టాయిలెట్ సౌకర్యం రన్నింగ్ వాటర్ తో సహా ఖచ్చితంగా ఏర్పాటు చేయాలి. ఇవి లేని పాఠశాల ఉండరాదు._
* _పాఠశాల ఆవరణ అంతా వీలైనంత పచ్చదనంతో ఆహ్లాదకరమైన వాతావరణం ఉండాలి._
* _పాఠశాలలోని విరిగిపోయిన/ పడిపోయిన చెట్లను, కొమ్మలను వెంటనే తొలగించాలి._
* _పాఠశాలలోని విద్యా విషయాలపై హెచ్ఎం లతో పీరియాడికల్ మీటింగ్ లు తప్పనిసరిగా నిర్వహిం చాలి._
* _అనుకోని అగ్నిప్రమాదాలు సంభవించినప్పుడు తగు ముందస్తు నివారణ చర్యలను కూడా ముందు జాగ్రత్తగా తీసుకోవాలి._ 
* _విద్యార్థుల సర్వతోముఖ వికాసానికై_
_విద్యాశాఖ వివిధ సందర్భాలలో నిర్వహించే సహా కార్యక్రమాలు వక్తృత్వం, వ్యాసరచన,  లాంటి కార్యక్రమాలలో తప్పనిసరిగా విద్యార్థులను భాగస్వామ్యం చేయాలి._
* _1 నుండి 5వ తరగతి విద్యార్థులకు 1 & 3 వ శనివారాలలో "నో బ్యాగ్ డే" ను విద్యాశాఖ సూచనల మేరకు తప్పక అమలు చేయాలి._ 
* _పాఠశాలలోని అందరి_ _విద్యార్థులకు_
_గేమ్స్ మరియు స్పోర్ట్స్ విషయంలో విద్యాశాఖ కాలనిర్ణయ పట్టిక ను తప్పక అమలు చేయాలి._
* _పాఠశాల విద్యాశాఖ నార్మ్స్  కు భిన్నంగా మున్సిపల్ విద్యావ్యవస్థ ఉండరాదు. (ఉదా పరీక్షలు, కరి కులం, యూనిఫార్మ్, పాఠ్య పుస్తకాలు మొ.)_
* _ఎస్.సి.ఈ.ఆర్.టి. సహకారంతో  ఉపాధ్యాయులకు ఓరియెంటేషన్ కోర్సు లు నిర్వహించాలి._
* _ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుల సహకారంతో విద్యార్థులకు హెల్త్ క్యాంపులు నిర్వహించాలి, అవసరమైన మందులు సరఫరా చేయించాలి._
* _వ్యాయామ ఉపాధ్యాయులకు తప్పక ప్రగతి సూచికలు నిర్వహించాలి._ _ఇందుకుగాను వారి పాఠశాల విద్యార్థులు_
_పాఠశాల విద్యా శాఖ నిర్వహించే_
_జిల్లా/ రాష్ట్ర/ జాతీయ స్థాయి పోటీలలో పాల్గొనడాన్ని ఆధారంగా తీసుకోవాలి._
* _వ్యాయామ ఉపాధ్యాయుల విషయంలో పాఠశాల విద్యా శాఖ నిబంధనలు, కాలనిర్ణయ పట్టికనే అమలు చేయాలి._
*_తరగతి గది విద్యార్థి సర్వతోముఖ అభివృద్ధికి ఉపయోగపడుతుంది. ప్రతి ఉపాధ్యాయుడు లెసన్ ప్లాన్,  టి.ఎల్.ఎం. కలిగి ఉండి ఉపయోగించాలి._
* _ఏదైనా పాఠశాలల అప్ గ్రేడేషన్ కు అవసరమైతే డి ఈ ఓ కు ప్రతిపాదనలు పంపాలి._
* _క్రమం తప్పక విద్యార్థి తల్లిదండ్రుల సమావేశాన్ని నిర్వహించడానికి చర్యలు గైకొనాలి_
☘APTF☘

Share this post in

No comments:

Newer Post
Older Post
Home
Subscribe to: Post Comments (Atom)

EXAMS

APPSC
SSC
NMMS
NTSE
HM ACT TEST
PAT
D.El.Ed
LPT
TCC
TTC
AP OPEN SCHOOL

deo websites

SRIKAKULAM
Vizianagaram
VISAKHA
W.GODAVARI
E.GODAVARI
KRISHNA
GUNTUR
PRAKASAM
NELLORE
CHITTOOR
KURNOOL
KADAPA
ANATHAPURAM

Total Pageviews

Copyright © - APTF |