🅰🅿
★ All RJDSEs, DEOs and POs of SSA are requested to issue necessary instructions to the filed functionaries concerned to make necessary arrangements to view the live visuals of the launching of Chandrayan-2 by the students from Class VI to X in all schools under all managements through DCR, VCR, TVs and other social media network...
*JD EE O/o CSE, AP*
........................................
ISRO Chandrayaan 2 : ఇప్పటివరకు చందమామపైకి అమెరికా, రష్యా, చైనా మాత్రమే రోవర్లను పంపించాయి. ఆ తర్వాత భారత్ కూడా తన తొలి రోవర్‌ను చంద్రుడిపైకి పంపుతోంది. ఐతే... చందమామ దక్షిణ ధ్రువానికి రోవర్‌ను పంపుతున్న తొలి దేశం మాత్రం భారతే.
ప్రాజెక్టు ప్రత్యేకతలు :
- ఈ రాకెట్ ప్రయోగంలో మూడు దశలు ఉన్నాయి. రాకెట్ ప్రయోగించిన 16 నిమిషాల 13 సెకండ్లకు... భూమి నుంచీ 181.6 కిలోమీటర్ల ఎత్తులో... చంద్రయాన్-2 ఉపగ్రహం, విక్రమ్ ల్యాండర్ ఉన్న పేలోడ్ రాకెట్ నుంచీ బయటకు వస్తుంది. అక్కడితో రాకెట్ పని పూర్తయినట్లు లెక్క.
- ఈ పేలోడ్ భూ నియంత్రిత కక్ష్యా మార్గంలోకి చేరుతుంది. ఆ తర్వాత అది 17 రోజుల పాటూ రోదసిలో తిరుగుతూ... చందమామ దగ్గర్లోకి వెళ్తుంది. ఆ తర్వాత మరో 6 రోజులు అలాగే తిప్పుతారు. ఆ తర్వాత చంద్రయాన్-2ని పేలోడ్ నుంచీ బయటకు తెస్తారు. అది 28 రోజులపాటూ చందమామ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. అలా అది చందమామ కక్ష్యా మార్గంలోకి చేరుతుంది.
- చంద్రయాన్-2 ప్రయోగం జరిగిన 50 రోజుల తర్వాత పేలోడ్ నుంచీ విక్రమ్ ల్యాండర్ బయటకు వస్తుంది. ఇది 54వ రోజున అంటే సెప్టెంబర్ 6 లేదా 7న చందమామ దక్షిణ ధ్రువంపై దిగుతుంది.
రోజులలో తేడాలు వస్తాయి .గమనించగలరు👆
ల్యాండర్ సేఫ్‌గా దిగిన తర్వాత... అందులోంచీ... ప్రజ్ఞాన్ రోవర్ బయటకు వస్తుంది. అది చందమామపై 500 మీటర్ల ఏరియాలో తిరుగుతుంది.
- ప్రజ్ఞాన్ రోవర్... చందమామపై మట్టి, రసాయనాలు, నీటి జాడలు, మూలకాలు, ఖనిజాలు వంటి విషయాల్ని ఇస్రోకి చేరవేస్తుంది.
- ప్రధానంగా చంద్రుడి దక్షిణ ధ్రువంపై నీరు గడ్డకట్టి ఉందని ఇస్రో శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. అందుకే ల్యాండర్‌ను అక్కడ ల్యాండ్ చేస్తున్నారు.