DSC-1989 ద్వారా జరిగిన టీచర్స్ రిక్రూట్మెంట్ లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 921 మంది, కృష్ణాజిల్లాలో దాదాపుగా 120 మంది అభ్యర్థులు Written Exam లో అర్హత సాధించినప్పటికీ ఇంటర్వ్యూకు అవకాశం ఇవ్వకపోవడంతో 7 సంవత్సరాల పాటు ట్రిబ్యునల్, హైకోర్టు, సుప్రీంకోర్టు, మరలా హైకోర్టు ద్వారా న్యాయ పోరాటం చేసి 1996 లో 7 సంవత్సరాల అనంతరం 120 మందిలో 80 మంది స్పెషల్ టీచర్స్ (క్వాలిఫైడ్ టీచర్స్) గా రూ.398/- వేతనం తో నియమించబడ్డారు.
వీరందరికి 6 సంవత్సరాల తరువాత 2002 లో సంఘాల పోరాటం మేరకు ప్రభుత్వం ప్రత్యేకంగా పోస్టులు సృష్టించడంతో అందరూ ఒకేసారి Absorption (Regularise) కావడం జరిగింది. ఈ ఉపాధ్యాయులకు date of Joining కాకుండా ప్రమోషన్స్ టైం లో date of Absorption చూడాలి అని గతంలో DSE వారు ఇచ్చిన ఉత్తర్వులు ఉన్నాయి.
అయితే ఇటీవల కాలంలో సంఘాల పోరాటం వల్ల వీరి పెన్షన్ లెక్కింపుకు, ఆటోమేటిక్ అడ్వాన్స్ మెంట్ స్కీం లకు date of Joining పరిగణనలోకి తీసుకుంటున్నారు.ప్రమోషన్స్ కి కూడా date of joining చూడాలనే స్పెషల్ టీచర్ల డిమాండ్ మేరకు ముందుగా JD services వారు వీరికి అనుకూలంగా గత 5 రోజుల క్రి0దట ప్రమోషన్ జాబితాల్లో చోటు కల్పించారు.
అయితే గతంలో ఉన్న ఉత్తర్వులు మేరకు వీరికి date of joining చూడరాదంటూ కొంతమంది JD services కి ఈరోజు ప్రాతినిధ్యం చేయడంతో అర్దాంతరంగా ప్రమోషన్స్ నిలిపివేయమని కృష్ణాజిల్లా DEO కి ఫోన్లో ఆదేశాలు జారీ చేశారు. కథ మళ్ళీ మొదటికి వచ్చింది.
ఇప్పటివరకు జిల్లాలో Date of Joining తో తయారైన ప్రమోషన్ లిస్ట్ లనుండి వీరిని తొలగించి మళ్ళీ కొత్తగా లిస్ట్స్ తయారుచేసి సోమవారం ప్రమోషన్స్ జరపమని చెప్పినట్లు JD services శ్రీ దేవానందరెడ్డి గారు తెలిపినారు.