APTF: కృత్తివెన్ను
ఉపాధ్యాయుల గగ్గోలు:
అన్ని రకాల స్కూళ్లల్లో సరిపడా ఉపాధ్యాయులు లేక, ఏకోపాధ్యాయ పాఠశాల విద్యావ్యవస్థతో, రకరకాల యాప్ లతో,ఆన్లైన్ వర్క్ లతో అనారోగ్యం పాలవుతున్న ఉపాధ్యాయులు
ఈరోజు 26.11.21 కృత్తివెన్ను మండలంలోని పోడు హైస్కూల్, లక్ష్మీపురం హైస్కూల్,మాట్లం హైస్కూల్ ,కృత్తివెన్ను, వాలంక,పల్లెపాలెం,చందాల,గరిశపూడి ప్రాథమిక పాఠశాలల్లో APTF సభ్యత్వ నమోదు కార్యక్రమం విజయవంతంగా జరిగింది.
అనేక పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా టీచర్లు లేకపోవడం ప్రధాన సమస్యగా ఉంది.140 మందికి విద్యార్థులకు 5 గురు ఉపాధ్యాయులు భోధించాల్సిన చోట ముగ్గురు టీచర్లు మాత్రమే ఉండటం..100 మంది విద్యార్థులు ఉన్నచోట నలుగురు టీచర్లు బోధించాల్సి ఉండగా ఇద్దరు మాత్రమే ఉండటం,60 మంది విద్యార్థులకు ఒక టీచర్ మాత్రమే ఉండటం 340 మంది ఉన్న హైస్కూల్ లో ఇద్దరు సబ్జెక్ట్ టీచర్లు ఉండాల్సిన చోట ఒక టీచరు మాత్రమే బోధించాల్సి రావడం..వీటికి తోడు ఆన్లైన్ వర్కులు, రక రకాల యాప్ లతో ఉపాధ్యాయులు సతమతమవడం జరుగుతోందని తక్షణం యుద్ధ ప్రాతిపదికన ఉపాధ్యాయుల కొరత ఉన్న ప్రతి పాఠశాలకు విద్యా వాలంటీర్ల ను నియమించాలని సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా ప్రధాన కార్యదర్శి తమ్ము నాగరాజు ప్రభుత్వాన్ని కోరారు.
అలాగే ఏకోపాధ్యాయ పాఠశాల వ్యవస్థ ను రద్దు చేయాలని కోరారు.ఒక ఉపాధ్యాయుడు ఐదు తరగతులకు బోధించడం అశాస్త్రీయమని అన్నారు.
ఈ కార్యక్రమంలో కృత్తివెన్ను మండల అధ్యక్ష ప్రధాన కార్యాదర్శులు వేముల వెంకట్,పీతా వెంకట రమణ,నాయకులు ఉప్పాల శ్రీనివాస్,బోయిన శ్రీనివాస్ లు పాల్గొన్నారు.