విజయనగరం రూరల్, సెప్టెంబరు 8:
ఏపీటీఎఫ్ (1938) ఏర్పాటై 75 ఏళ్లవుతున్న నేపథ్యంలో ఈ 22న విజయనగరంలో విద్యా వైజ్ఞానిక సభను నిర్వహించనున్నట్టు ఆ సంఘ జిల్లా ప్రధాన కార్యదర్శి జూసీ రాజు చెప్పారు. ఆదివారం ఏపీటీఎఫ్ జిల్లాశాఖ కార్యాలయంలో విద్యా,వైజ్ఞానిక సభల కరపత్రాన్ని ఆ సంఘ నాయకులతో కలిసి ఆయన అవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఏపీటీ ఎఫ్ 75 ఏళ్ల ప్రస్థానంలో ఎన్నో సమస్యలపై రాజీ లేని పోరాటాలు చేసిందన్నారు. ఉపాధ్యా య సమస్యలు, హక్కులను ప్రభుత్వాల దృష్టికి తీసుకువచ్చి పరిష్కారానికి కృషి చేసిందని తెలి పారు. విద్యా రంగం ఎదుర్కొంటున్న సమ స్యలపై పోరాడిన ఘనత తమ సంఘానికే దక్కుతుందన్నారు. ప్రభుత్వ విద్యా రంగాన్ని బలోపేతం చేయాలని, ప్రభుత్వ పాఠశాలలు, స్కూళ్లల్లో మౌలిక వసతులు కల్పించాలన్న డి మాండ్లపై ఎంతో శ్రమించామని తెలిపారు. ఈ నెల 22న నిర్వహించే కార్యక్రమంలో ఏపీటీఎఫ్ సాధించిన విజయాలు, భవిష్యత్‌లో సాధించా ల్సిన అంశాలపై చర్చిస్తామని చెప్పారు. రాష్ట్ర నాయకులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొం టారన్నారు. ఏపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు డి ఈశ్వరరావు మాట్లాడుతూ ఈ మహాసభలలో విద్యా, ఉపాధ్యాయ, పాఠశాల, సామాజిక రంగ సమస్యలపై చర్చ, తీర్మానాలు ఉంటాయని తెలిపారు. ఈ సభలకు రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ, శాసనసభ్యుడు కోలగట్ల వీర భద్రస్వామి, అధికారులు, విద్యావేత్తలు హాజ రవుతారన్నారు. జిల్లాలోని ఏపీటీఎఫ్ నాయ కులు, సంఘ సభ్యులు అధిక సంఖ్యలో తరలి వచ్చి విద్య, వైజ్ఞానిక సభలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో ఆ సంఘ నాయకులు ఎ.సదాశివరావు, ఆర్.కృష్ణ, పైడిరాజు, పి.ఈశ్వరరావు, వై.వెంకటరావు, ఏవీ శ్రీనివాసరావు పాల్గొన్నారు.