కౌశల్-2019 రాష్ట్రస్థాయి సైన్స్ ప్రతిభాన్వేషణ పోటీ
వివరాలు.
ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్ధుల్లో సైన్స్ పట్ల అభిరుచిని కలిగించి, వారి ప్రతిభను ప్రోత్సహించుటకై భారతీయ విజ్ఞాన మండలి (విజ్ఞాన భారతి-ఆం.ప్ర శాఖ) రాష్ట్రస్థాయిలో *కౌశల్-2019* సైన్స్ ప్రతిభాన్వేషణ పోటీలు నిర్వహిస్తోంది.
*1. కౌశల్ క్విజ్ పోటీ*
8,9&10 తరగతులు చదివే విద్యార్థులు (ముగ్గురూ ఒక టీమ్ గా) పాల్గొనవచ్చు.
(ఒక తరగతినుండి ఒకరు మాత్రమే టీమ్ లో ఉండాలి)
*జిల్లాస్థాయి*: ఒక పాఠశాల నుండి ఒక టీమ్ మాత్రమే పాల్గొనాలి. 1. స్క్రీనింగ్ టెస్ట్ (వ్రాతపరీక్ష) మరియు 2. డిజిటల్ స్క్రీన్ లపై క్విజ్ నిర్వహించబడును. ప్రశ్నలు తెలుగు, ఆంగ్ల మాద్యమాలు రెండింటిలోనూ ప్రదర్శించబడును.
*రాష్ట్రస్థాయి*: జిల్లాస్థాయిలో ప్రధమ, ద్వితీయ స్థానాలు పొందిన టీమ్ లు రాష్ట్రస్థాయి పోటీకి అర్హులు.
*2. పోస్టర్ ప్రెజెంటేషన్ పోటీ*:
ఇవ్వబడిన థీమ్ లలో ఒక దానిపై విద్యార్ధి పోస్టర్ తయారు చేసి, ప్రదర్శించి, వివరించాలి. ఇది వైయక్తిక పోటీ. 8&9 తరగతుల వారు పాల్గొనవచ్చు.
*జిల్లాస్థాయి*: ఒక పాఠశాల నుండి రెండు ప్రదర్శనలు మాత్రమే అనుమతించబడును.
*రాష్ట్రస్థాయి*: జిల్లాస్థాయిలో ప్రధమ, ద్వితీయ, తృతీయ స్థానాలు పొందినవారు అర్హులు. జిల్లాస్థాయిలో గెలుచుకున్న పోస్టర్ ను మాత్రమే రాష్ట్రస్థాయిలో ప్రదర్శించవలెను.
రిజిస్ట్రేషన్ ఇతర వివరాలకు కింది
వెబ్‌సైట్ సందర్శించగలరు.
.....................................................