మిత్రులారా
నమస్కారం

ఈ నాడు ఊహించని పెను ప్రమాదం
మానవాళి మొత్తాన్ని చుట్టు ముట్టింది. ఈ తరహా ప్రమాదం గత 100 సంవత్సరాల లో మనం ఎన్నడూ
ఎదుర్కోలేదు. గత 50 లేదా 60 సంవత్సరాల నుంచి
మనం ఎదుర్కొన్న విపత్తులు. పెను తుఫాన్లు ,ఉప్పెనలు,వరదలు ,కరువు కాటకాలు, సునామీలు ,వివిధ కారణాలతో బంధులు, కర్ఫ్యూలు వంటివి మాత్రమే .ఈ సందర్భాల్లో భారతీయుల
పోరాట పటిమ మనందరికి తెలిసినదే.కానీ నేటి యువతకు ఆనాటి పరిస్థితులు సంఘటన
లపై అవగాహన లేదు .యువత అప్పటి సంఘటనలు తెలుసు కోవాలి .మనం వాళ్లకు తెలియ చెప్పాలి . వరదలు తుఫానులు
వచ్చినప్పుడు గ్రామాలలోని పెద్దవాళ్ళ సలహా లమేరకు
యువత పల్లపు ప్రాంతాలలోని వారిని ,గుడిశల్లోని వారిని
సురక్షిత మైన ప్రాంతాలలోనికి తరలించడం ,వారికి
ఆహార సదుపాయాలు కల్పించడం ,చెరువులు ,నదుల కట్టలను
బలోపేతం చేయండం , మూగ జీవాలకు పశు గ్రాసం అందించడం ,ధాన్యం తడిచి పోకుండా నిల్వచేయడం ,నవా జిన్ ,మెటాసిన్ ,లోపారేట్ వంటి మాత్రలు సిద్ధం చేసి ఉంచడం వంటి పనులు
చేసేవాళ్ళం. కొన్ని సమయాల్లో భారత సైనిక
దళాలు హెలికాప్టర్ల లో నుంచి
ఎత్తయిన మెరక ప్రాంతాల్లో జార విడిచిన ఆహార పొట్లాల బస్తాలను,పాలపొడి ప్యాకెట్ల ను,ఒరుగుల పాకెట్స్ ను
తడవకుండా తెచ్చి గ్రామంలో అందరికి పంచేవాళ్ళం. తుఫాను, వరదలు తగ్గు ముఖం పట్టిన తరువాత చనిపోయిన మూగ జీవాల మృత
దేహాలను తొలగించడం (అంటురోగాలు ప్రభల కుండా ఉండేందుకు) గ్రామాలకు రాక పోకలు
పునరుద్ద రించడం ,కరెంటు స్థంబాలను సరిచేయడం వంటి పనులు చేసేవాళ్ళం .( స్థానికంగా ప్రభుత్వ యంత్రాగం
అప్పుడు తక్కు వసంఖ్యలో ఉండేది) ఎవరో వస్తారని ఎదో చేస్తారని ఎదురు చూడకుండా ప్రభుత్వానికి తోడ్పాటు అందిం చడం ఆ నాటి సమాజం
యొక్క ఆలోచనా తీరు.
ప్లేగు,పెద్దమ్మవారు కలరా( విరోచనాలు) వంటి వ్యాధుల గురించి
పెద్దలు చెప్పగా వినడం పుస్తకాలలో చదవడం మాత్రమే మనకు తెలుసు. పెద్దగా వైద్య
సదుపాయాలు లేని ఆ నాడే మన పెద్దలు
ప్రాణాంతక మైన వ్యాధులను జయించారు. పెద్దమ్మవారు లేదా స్మాల్ పాక్స్
లేదా స్పోటకం ఇది కూడా ప్రాంతక మైన వ్యాధే.ఈ వ్యాధి సోకితే చాలా మంది
చనిపోయే వారు . కంటిలో అమ్మవారు పోసినవారు అంధులయ్యేవారు .ఇది కూడా
వైరస్ వల్ల వ్యాపించే వ్యాధి. ఆ నాటి వారు ఈ వ్యాధి సోకిన వారిని ఇంటి లోనే
ఉంచే వారు మిగతా కుంటుంబ సభ్యులకు కూడా దూరం గా ఉంచే వారు . రోగికి
కుటుంబంలోని పెద్ద వయస్సు స్త్రీ సేవలు
చేసేది. రోగి ఇంటికి ఎవరూ వెళ్లేవారు కాదు .అదే హోమ్ ఖ్వారంటైన్. వేప మండలతో గాలి ని విసరడం (ఫ్యాన్స్ ,AC లు లేవు) వేప ఆకులమీద పడుకో బెట్టడం ( కొన్ని
ప్రాంతాల్లో పెద్ద అరటి ఆకు మీద రోగిని పడుకోబెట్టి శరీరానికి చల్ల ధనాన్ని అందించేవారు) వేప చిగురు నూరి ముద్దలు చేసి ఆ ముద్దలను మింగించ డం, మజ్జిగ ,పండ్ల రసాలు తాగించడం
వంటివే ఆనాటి వైద్య విధానం .10 లేదా 15 రోజులలో కొంత మంది
మాత్రమే ప్రా ణాపాయం, లేకుండా బయట పడేవారు . స్మాల్ పాక్స్ కు ఎడ్వర్ జెన్నర్
టీకా ను ఆవిష్క రించిన తరువాత అన్ని
దేశాలలో వివిధ రూపాలలో ఇదే టీకా విధానం
అమలు లోకి రావడంతో ఈ స్మాల్ పాక్స్ వైరస్
ను ఎరాడి కేట్ చేయగలిగారు.
క్రీ.శ.1820 సంవత్సరం
ప్రాంతాల్లో కలరా వ్యాధి( నీళ్ళ విరోచనాలు) సోకినది . 'ORS' "ఓరల్ రీ హైడ్రేషన్ సాల్ట్ " ఇవ్వడం ఆరోజులలో
ప్రజలకు తెలియదు . ప్రజలు దీనిని నమ్మే వారు కాదు .ORS విధానం మీద అనేక
అపోహలు ఉండేవి. ఆరోజుల్లో "కలరా చావడి" అనే ప్రత్యేక ప్రాంతాలలో వైద్యం అందించే వారు . కలరా సోకిన వారిని సమాజం
నుంచి వేరు చేసి వైద్యం అందిచే వారు అని పెద్దలు చెప్పగా విన్నాం .
నెల్లూరులో పాత పెద్దాసుపత్రి కి ఎదురుగా
కోటమిట్ట లో కలరా చావడి ఉండేదని పెద్దల
ద్వారా వినేవాళ్ళం.దానినే తరువాత కాలం "కోతరూం " అనే వారు .అంటే పోస్ట్ మార్టం చేసే ప్రదేశం అని
సామాన్య జనాల భావన . ఆతరువాత ఆప్రదేశం GVRR కాలేజ్ గా, తరువాత నివాస ప్రాంతంగా మారింది. ఇదంతా ఎందుకు చెపుతున్నాను
అంటే మన పూర్వీకుల పోరాట పటిమ ,సహనం ,త్యాగ గుణం ,సామజిక చింతన ,ఐకమత్యం ,భవిష్యత్ తరాల కోసం ముందుచూపు
వంటి గుణాలే ప్రాణాంతక మైన వ్యాధుల ను
జయించ డంలో మానవ జాతిని కాపాడడంలో
తోడ్పడ్డాయి. తరువాత కాలంలో (1920) ఫ్లూజ్వరాలు ,మలేరియా , జ్వరాలు, టీ. బీ లాంటి అంటు రోగాలు దేశాన్ని ప్రపంచాన్ని పట్టి పీడించాయి .శాస్త్ర వేత్తలు,వైద్యులు, ప్రభుత్వాల కృషితో ప్రజల
సహకారం తో ఈ వ్యాధులు తగ్గుముఖం పట్టాయి. టి. బి ఆసుపత్రులను కూడా ఊరి కి దూరంగా కట్టేవారు.ఎందు కంటే ఒక టీ.బీ.
రోగి దగ్గి ఊసిన గళ్ళ లో టి. బి ని కలుగ జేసే క్రిములు కొన్ని నెలల పాటు జీవించి వుంటా యని శాస్త్ర వేత్తలు ,డాక్టర్లు ఈ జాగ్రత్త లు తీసుకొన్నారు. నెల్లూరు లో దర్గామిట్ట లో
ని టి. బి ఆసుపత్రికి కట్టే
నాటికి ఆ చుట్టు ప్రక్కల ప్రదేశాలలో ఇళ్లే ఉండేవి కాదని పెద్దలు చెప్పేవారు. టి. బి
వ్యాది పూర్తిగా తగ్గి పోయి పేషెంట్స్ లేక
టి.బి ఆసుపత్రి నిరుపయోగంగా
వుండంతో ఆ ప్రాంగణం లోనే ప్రస్తుతం మునిసిపల్ కార్పొరేషన్ ఆఫీస్ ,జిల్లా పరిషత్ ఆఫీసు
నిర్మించారు. ఇదంతా గతం .గ డిచి పోయిన చరిత్ర.
నేడు మనం ఎదుర్కొంటున్న COVID-19 కరోనా వ్యాధి
గురించి మనం ఏంతో జాగ్రత్త వహించాలి. చైనా
దేశం లోని ఊహాన్ నగరం లో బయట పడ్డ ఈ వైరస్
ను చైనా దేశంలో ని మిగతా పట్ట ణాలకు వ్యాపించ కుండా చైనా తగు జాగ్రత్తలు
తీసుకొంది. చైనాతో షుమారు 4,300 కిలోమీటర్ల సరిహద్దుగా గల రష్యా COVID
-19 ను కట్టడి చేయగలిగింది. జపాన్ , వియత్నాం , దేశాలు పూర్తిగా ను
సౌత్ కొరియా వంటి దేశాలు కొంతమేరకు
COVID -19 ను కట్టడి చేయగలుగుతున్నాయి.
ఇక అతి ముఖ్య మైన విషయం అభివృద్ధి చెందిన ,ఇటలీ, అమెరికా ,స్పెయిన్ , ఇంగ్లాండ్,ఫ్రాన్స్
ఆస్ట్రేలియా వంటి దేశాలు ఈ
వ్యాధిని కంట్రోల్ చేయలేక పెను
ప్రమాదంలోకి వెళ్తున్నాయి. దీనికి కారణం . అక్కడి ప్రజల మనస్తత్వం . వారి జీవన విధానం .అమెరికా లోనే తీసుకొందాం
అక్కడ పరిస్థితులు తీవ్ర రూపం దాల్చినా ఇంకా యువత బీచ్ లలో స్నానాలు చేస్తూ ,త్రాగుతూ ,ఆటలు ఆదుకొంటూ వున్నారు
. చివరకు పోలీసులు లాఠీఛార్జి చేయవలసి
వచ్చింది .ఐనా లెక్క చేయడం లేదు. ఇలాంటి భోగలాలసత్వం అస్సలు మంచిది కాదు. అంత
అభివృద్ధి చెందిన దేశం లో అంత విద్యా
వంతులున్న దేశంలో లాక్ డౌన్ విధిస్తారేమో
నని జనం సూపర్ మర్కెట్స్ లో బారులు తీరి నిలబడి రెండు మూడు నెలలకు సరిపడా
సరుకులు కొన్నారు .ఆ తరువాత ఆ సరుకుల
రక్షణ కోసం గన్స్ అమ్మే దుకాణాల కు వెళ్లి
బారు లు తీరి నిలబడి గన్స్ కొన్నారు . ఇది అక్కడి ప్రజల క్రమశిక్షా రాహిత్యాన్ని
తెలువుతోంది. ఎంజాయ్ చేయాలి,నేను బాగా ఉండాలి అనే
మనస్తత్వం తప్ప త్యాగం చేయాలి .క్రమశిక్షణ పాటించాలి ,ప్రభుత్వ సూచనలను
పాటించాలి సామాజిక దూరం పాటించాలి .ఇండ్ల లోనే ఉండాలి అని అనే ఆలోచన
లేదు. అదే విధంగా ఇటలీ దేశం లోకూడా వైరస్
స్ప్రెడ్ ఐనది మరింత స్ప్రెడ్ కాకూడదు అని
సెలవలిచ్చి ఇండ్ల లో ఉండ మంటే మద్యం సేవించి పార్టీలు చేసు కొని వ్యాధిని
మరింత పెంచి దేశాన్ని అతలాకుతలం చేశారు.ఆస్ట్రేలియాలో లోను అంతే ఈ రోజుకు బీచ్ లలో
సామూహికంగా ఎంజాయ్ చేస్తున్న వారే
కనబడుతున్నార ట. ఇది ఆయా దేశాల ప్రజల
ముందు జాగ్రత్త లేని తనాన్ని
తెలియజేస్తున్నది.ఆ దేశాల ప్రజలే
నిపుణుల సూచనలను ప్రభుత్వం
ఆంక్షలను గాలికి వదిలి ఆ దేశాలను పెను
సంక్షోభ లోకి తీసుకు వెళ్తున్నారు.
మన దేశం లో ఇతర దేశాల నుంచి వచ్చిన వారి తో ఈ వ్యాధి
ప్రారంభ మైనది . ప్రభుత్వం కొద్ది రోజుల లోనే పరిస్థితి తీవ్రతను గమనించింది .
వెనువెంటనే 14
గంటల జనతా కర్ఫ్యూ తదనంతరం. 21 రోజులు దేశం మొత్తం లాక్
డౌన్ ప్రక టించింది. ఇతర దేశాలనుంచి వచ్చిన వారి నుండి పెద్ద ఎత్తున ఈ
వ్యాధి ఇతరులకు రాకుండా ఉండాలంటే మనం ఎవరి ఇంటిలో వారు ఉండాలని దీని
ఉద్దేశ్యం.ఒకరి నుంచి ఒకరికి వ్యాధి
రాకుండా చూడడం. వైరస్ విస్ఫోటనం చెందకుండా
వుండం ఈ లాక్ డౌన్ ఉద్దేశం .మనం ఎవరి ఇండ్లలో వారు ఉంటే ( మనల్ని లాఠీలు పట్టుకొని
తరిమే పని లేకపోతే) ప్రభుత్వం
యంత్రాంగానికి విదేశాల నుంచి వచ్చిన వారి పూర్తి వివరాలు ,వారిలో హోమ్
ఖ్వారంటైన్ లో లేకుండా తిరుగు తున్న వారు ఎవరు వారితో కాంటాక్ట్ లో ఉన్న వారు ఎవరు అనే
వివరాలు తీసుకొనే వెసులుబాటు కలుగుతుంది.ఈ పనులు పోలీస్ డిపార్ట్మెంట్ సహాయం
లేనిదే ఇతర డిపార్టుమెంట్స్ చేయలేని పరిస్థితి. అంతే కాక ప్రస్తుతం ప్రభుత్వం
ముందున్న అనేక సమస్యలను గురించి కూడా మనం
ఆలోచించాలి . వ్యవసాయ ఉత్పత్తులను తగిన రేటుకు అమ్మించి రైతులను ఆదుకోవడం, అక్వా రైతులను ఆదుకోవడం ,రోజువారీ
కూలీలను ఆదుకోవడం ,వైద్య పరికరాల కొరత లేకుండా చూడడం.
నిత్యావసరాల ను అందుబాటులో ఉంచడం,ఆర్ధిక వ్యవస్థను కాపాడడం ,ప్రజలలో ధైర్యం
నింపడం,జాగ్రత్తలు చెప్పడం మొదలైన పనులతో
ప్రభుత్వం ,అధికారులు తలమునకలై సతమతమవుతున్న
తరుణం ఇది.బాధ్యత గల పౌరులుగా మనం ఇవన్నీ అర్ధం చేసుకోవాలి .ప్రభుత్వానికి సహకరించాలి అవసరమైతే తోడ్పాటు అందించాలి. అధికారులకు
సహకరించాలి . అత్యవసర మైన పని ఉంటే తప్ప బయటకు వెళ్లకూడదు.మన వల్ల ఎవరికీ నష్టం
కలగ కూడదు. పూర్తిగా మన ఇంటిలోనే ఉండి మన ఆరోగ్యాన్ని మన కుటుంబాన్ని కాపాడు
కోవాలి .ఈ పరిస్థితుల లోను మనకు కూరగాయలు ,పండ్లు అందిస్తున్న రైతులకు
,వాటిని రవాణా చేస్తున్న రవాణా రంగ కార్మికులకు,వ్యాపారులకు చేతులెత్తి నమస్కరిద్దాం. మనకోసం ప్రాణాలకు తెగించి పనిచేస్తున్న
వైద్యులు,వైద్య సిబ్బంది,
శానిటేషన్
సిబ్బంది .ఫైర్ డిపార్ట్మెంట్ సిబ్బంది అన్ని రకాల ప్రభుత్వ యంత్రాంగానికి ,ప్రజా ప్రతినిధులకు,పోలీస్ డిపార్టుమెంట్ కు ,మీడియా మిత్రులకు మనం అండగా ఉండాలి. భారతీయుల లో ని త్యాగం ,నిబద్ధత, నిరాడంబరత , పోరాట పటిమ , క్రమశిక్షణ ,జాతి ఐకమత్యం ఇవే
కరోన వైరస్ పై పోరాటానికి మన
ఆయుధాలు. ఈ పోరాటంలో మన దేశం కొద్ది రోజుల లోనే విజయం సాధిస్తుంది .
యు.సురేంద్ర, జిల్లా ప్రధాన కార్యదర్శి,
APTF,
నెల్లూరు
జిల్లా.