రాష్ట్రంలో కాంట్రాక్టు , ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల పదవీ కాలాన్ని మరో రెండు నెలలు పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది . వాస్త వంగా వీరి పదవీ కాలం ఈ నెలాఖరుతో ముగియనుంది . అయితే , వీరి పదవీ కాలాన్ని మే 1 నుంచి జూన్ 30వ తేదీ వరకు పొడిగిస్తూ ఆర్థిక శాఖ ముఖ్యకా ర్యదర్శి ఎస్ . ఎస్ . రావత్ మంగళవారం ఉత్త ర్వులు జారీ చేశారు . రాష్ట్రంలో వివిధ శాఖలు , శాఖాధిపతులు , సచివాలయం , జిల్లా కలెక్టరేట్లు ఇందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవాల్సిందిగా ఉత్తర్వుల్లో ఆరి క శాఖ సూచించింది