(నెల్లూరు జిల్లా)
ఒకవైపు కరోనా విలయతాండవం, మరోవైపు రవాణా అడ్డంకులు. అయినా ఆస్పత్రుల్లో రక్త నిలువలు నిండుకున్నాయన్న అధికారుల పిలుపుతో ఇబ్బందులను అధిగమించి నెల్లూరు ఇండియన్ సిటీ రెడ్ క్రాస్ విభాగంలో ఏపీటీఎఫ్ శ్రేణులు స్వచ్చందంగా రక్థదానం చేశాయి. రాష్ట్ర అధ్యక్షులు వెంకటేశ్వరరావు మొదలు సాధారణ కార్యకర్తలు ఈ మహా యజ్ఞంలో పాలుపంచుకున్నారు.
ప్రపంచ శ్రామిక దినోత్సవమైన మేడే నాడు ఈ మహత్తర కార్యక్రమంలో పాలుపంచుకున్నారు. రక్తదానం చేసిన వారిలో ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు కె.వెంకటేశ్వర రావు గారు,రాష్ట్ర కార్యదర్శి యస్.చిరంజీవి, జిల్లాకార్యదర్శి సుంకు.వెంకటేశ్వర్లు, వెంకటాచలం ప్రధానకార్యదర్శి ఆర్.సుధాకర్,టిపి గూడూరు మండల భాధ్యులు ఎ.రాధాకృష్ణ, ఎం.శీనయ్య, జిల్లాకౌన్సిలర్ సిహెచ్. తులసీ కృష్ణ, పొదలకూరు మండల భాద్యులు ఎం.ప్రసాద్. వాకాడు మండల అధ్యక్షులు ఆర్.చెంచురామయ్య, నెల్లూరు టౌన్ బాద్యులు జి.శ్రీనివాసరావు గార్లు ఉన్నారు. ఈరోజు రక్తదానం చేయడానికి ముందుకు వచ్చిన మన కార్యకర్తలకు సహకరించిన ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు కె.వెంకటేశ్వరరావు గారికి, ఐఫియా జాతీయ ఉపాధ్యక్షులు కె.సుబ్బారెడ్డి గారికి, జిల్లా ఉపాధ్యక్షులు బి.కోటేశ్వరరావు గారికి, జిల్లా ఆడిట్ కమిటీ సభ్యులు ఎస్ కె.ఖాదర్ భాషా గారికి ప్రత్యేక ధన్యవాదములు.
రక్తదానం చేస్తున్న ఏపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు వెంకటేశ్వరరావు