దూరవిద్య పది, ఇంటర్ పరీక్షలు
★ ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం (ఏపీవోఎస్ ఎస్) దూరవిద్య ద్వారా నిర్వహించే పదో తరగతి, ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల సవరించిన షెడ్యూల్ విడుదల.
★ 10వ తరగతి, ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు జూలై 18 నుంచి 2వ తేదీ వరకు,
★ ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలు జూలై 25 నుంచి 29 వరకు నిర్వహణ.
★.ఉదయం 9.30 గంటల నుంచి 12.30 గంటల వరకూ పదో తరగతి పరీక్షలు,
★ మధ్యాహ్నం 2 గంట ల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ ఇంటర్మీడియట్ పరీక్షలు జరుగుతాయి.
★ ఆ ప్రకారం జూలై 18 తెలుగు/ఉర్దూ/కన్నడ ఒరియా/తమిళం/ హిందీ పరీక్షలు జరుగుతాయి.
★ 19న ఇంగ్లీషు పరీక్ష 20న ఉదయం గణితం, భారతీయ సంస్కృతి - వారసత్వం పరీక్షలు, మధ్యాహ్నం గణితం, చరిత్ర, వ్యాపార గణక శాస్త్రం పరీక్షలు జరుగుతాయి.
★ 21న ఉదయం శాస్త్ర సాంకేతిక విజ్ఞానం, గృహ విజ్ఞాన శాస్త్రం పరీ క్షలు, మధ్యాహ్నం భౌతిక శాస్త్రం, రాజనీతి శాస్త్రం, పౌర శాస్త్రం, మనోవిజ్ఞాన శాస్త్రం పరీక్షలు జరుగుతాయి.
★ 22న ఉదయం సాంఘిక శాస్త్రం, ఆర్థిక శాస్త్రం, మధ్యాహ్నం, రసాయన శాస్త్రం, ఆర్థిక శాస్త్రం, సామాజిక శాస్త్రం పరీక్షలు జరుగుతాయి.
★ 28న ఉదయం హిందీ, మధ్యాహ్నం జీవశాస్త్రం, వాణిజ్య/వ్యాపార శాస్త్రం, గృహవిజ్ఞాన శాస్త్రం పరీక్షలు జరుగుతాయి.
★ 24న ఉదయం బిజినెస్ స్టడీస్, మనో విజ్ఞాన శాస్త్రం, అన్ని వృత్తి విద్యా సబ్జెక్టులకు పరీక్షలు జరుగుతాయి.