ఏపీటీఎఫ్ నెల్లూరు జిల్లా నూతన కార్యవర్గం
ఏపీటీఎఫ్ నెల్లూరు జిల్లా కౌన్సిల్ సమావేశం ఆదివారం సిటీలోని వెంకటేశ్వర విద్యాలయంలో జరిగింది. సమావేశానికి జిల్లా అధ్యక్షులు కామ్రేడ్ సురేంద్ర రెడ్డి అధ్యక్షతన జరిగింది. రాష్ట్ర అధ్యక్షులు కె. వెంకటేశ్వరరావు, రాష్ట్ర కౌన్సిలర్ సిహెచ్. కృష్ణా రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి ఎస్. చిరంజీవి, జిల్లా ప్రధాన కార్యదర్శి యు. సురేంద్ర,
జియో మీట్ ద్వారా ఎక్కువ మంది జిల్లా కౌన్సిలర్లు, నేరుగా మరికొందరు సమావేశంలో పాల్గొని కమిటీని ఎన్నుకున్నారు. గౌ౹౹ అధ్యక్షులుగా సిహెచ్. శివరామి రెడ్డి, అధ్యక్షులుగా ఏ. సురేంద్ర రెడ్డి, అసోసియేట్ అధ్యక్షులుగా వై. జనార్దన్ రావు, ఉపాధ్యక్షులుగా బి. కోటేశ్వరరావు, షేక్ బాబు, ఎం. సులోచనమ్మ, షేక్ శుభాన్,
ప్రధాన కార్యదర్శిగా ఎం. పిచ్చిబాబు, అదనపు కార్యదర్శిగా టి. మస్థానయ్య, కార్యదర్సులుగా జి. నారాయణ, షేక్ కరీంమోహిద్దీన్, కె. వెంకటస్వామి రెడ్డి, ఎస్. వెంకటేశ్వర్లు, సీహెచ్. తులసీ కృష్ణ, బి. శివకుమార్, బి. గణపతితో సహా 30 మంది రాష్ట్ర కౌన్సిలర్లు, అనుబంధ కమిటీ లకు ఎన్నికలు విజయవంతంగా జరిగాయి. ఎన్నికల పరిశీలకులుగా చెంగల్రాయ మందడి గారు హాజరయ్యారు. అలాగే రాష్ట్ర కౌన్సిలర్ ఎన్. మోహన్ దాస్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డా౹౹ జుల్ఫీకర్ అలీ అహ్మద్, ఎస్. భాస్కర్ రెడ్డి, షేక్ రియాజ్ గార్లు సమావేశంలో పాల్గొన్నారు.