సమగ్ర శిక్షా రాష్ట్ర పథక సంచాలకులు కె.వెట్రిసెల్వి వెల్లడి
విజయవాడ: రాష్ట్ర సమగ్ర శిక్షా ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న 352 కస్తుర్భా గాంధీ బాలికా విద్యాలయాలలో (కేజీబీవీలలో) 2020 -21 విద్యాసంవత్సరానికి, 6వ తరగతిలో ప్రవేశం కోసం, 7, 8 తరగతుల్లో మిగిలిన సీట్ల భర్తీ కోసం రెండవ విడతలో ఎంపిక చేసిన విద్యార్థినుల జాబితాను సంబంధిత కేజీబీవీలకు పంపినట్లు సమగ్ర శిక్షా రాష్ట్ర పథక సంచాలకులు కె.వెట్రిసెల్వి శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు.
ఎంపికైన విద్యార్థుల మొబైల్ నంబరుకు ఇప్పటికే సమాచారం పంపడమైనదని పేర్కొన్నారు.
ఆ విద్యార్థినులు 13.09.2020వ తేది నుండి 20.09.2020వ తేదీలోగా సంబంధిత కేజీబీవీలలో స్పెషల్ ఆఫీసర్లకు తగిన ధృవపత్రాలతో రిపోర్ట్ చేయాలన్నారు.
మొబైల్ ఫోన్ ద్వారా సమాచారం అందించిన ప్రకారం విద్యార్థినులు కుల ధృవీకరణ పత్రం, రేషన్ కార్డు, ఆధార్ కార్డు, బదిలీ సర్టిఫికేట్, స్టడీ సర్టిఫికేట్ వంటివి తమతో పాటు తీసుకెళ్లాలని తెలిపారు.
ఎంపికైన విద్యార్థినుల వివరాలు వెబ్‌సైట్‌లోనూ, పాఠశాల నోటీసు బోర్డులో ప్రదర్శించామన్నారు.
ఏవైనా సమస్యలు, సందేహాలు ఉంటే 9441270099, 9494383617 నంబర్లను సంప్రదించాలని వెట్రిసెల్వి కోరారు