శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో, పూర్వపు
తాలూకా కేంద్రాల్లో సోమవారం నిరసన
కార్యక్రమాలకు ఏపీటీఎఫ్ (1938) పిలుపునిచ్చింది.
కేంద్ర ప్రభుత్వం అప్రజాస్వామికంగా ప్రకటించిన
ఎన్ఈపీను వ్యతిరేకిస్తూ అ ప్రపంచ ఉపాధ్యాయ
దినోత్సవం సందర్బంగా ఈనిరసన తెపుపుతున్నట్లు
ఏపీటీఎఫ్, శ్రీకాకుళం జిల్లా కమిటీ జిల్లా
గౌరవాధ్యక్షులు సన్నశెట్టి రాజశేఖర్, జిల్లా అధ్యక్షులు వానా
కామేశ్వరరావు, జిల్లా
ప్రధాన కార్యదర్శి టి.చలపతిరావులు తెలిపారు. నిరసన కార్యక్రమాలతో ప్రజల ఆకాంక్షను
ప్రభుత్వానికి తెలపాలని కోరారు.