- రెండున్నరేళ్ల
కాలంలో వేతన సవరణ ఓ నివేదిక ఇవ్వలేకపోయారా ... ?
- ఏళ్ల
తరబడీ వాయిదాలు వేస్తూనే కాలం గడిపేస్తారా .. ?
- జరిగిన
ఆలస్యం చాలు తక్షణం పీఆర్సీ ప్రకటించండి
- ఏపీటీఎఫ్
సీనియర్ నాయకులు సన్నశెట్టి రాజశేఖర్
ఇంకా
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతన సవరణ కోసం నియమించిన కమిటీ , రెండున్నరేళ్ల
కాలం గడిచినా , ఎందుకు నివేదిక సమర్పించలేదని ఏపీటీఎఫ్ సీనియర్ నాయకులు , శ్రీకాకుళం
జిల్లా కమిటీ గౌరవాధ్యక్షులు సన్నశెట్టి రాజశేఖర్ ప్రశ్నిం చారు . విజయవాడలో ఇటీవల
నిర్వహించిన ఏపీటీ ఎకు , జాతీయస్థాయిలో అనుబంధంగా వున్న అఖిల భారత విద్యా సంస్థల
సమాఖ్యకు కౌన్సిల్ సభ్యునిగా , ఇటీవల విజయవాడలో రాజశేఖర్ ఎన్నికయ్యారు . ఆ సందర్భాన్ని
పురస్కరించకుని , , ఆయన శ్రీకాకుళంలో బుధవారం మాట్లాడారు . వేతన సవరణ కోసం నియమించిన కమిటీ
గడువు ను , అయిదు దఫాలుగా పెంచుతూనే ఉన్నారనీ , ఈ సారి సెప్టెంబరు నెలాఖరు వరకు
పొడిగించిన విషయాన్ని ఆయన ప్రస్తావిస్తూ , ఈ పొడిగింపులు ఏమిటని ఆయన
నిలదీశారు . దీని వల్ల ఉద్యోగులు నష్టపోతున్నారని , ప్రభుత్వం వేతన సవరణకు తక్షణం
చర్యలు తీసుకోవాలని కోరారు . 2018 జూలై నుంచి వేతన సవరణ అమలు కావాల్సి ఉందన్నారు . భారతదేశ
రాజ్యాంగ రచన కన్నా , పీఆర్సీ నివేదిక తయారీకి ఎక్కువ సమయం తీసుకోవడం సరికాదని సన్నశెట్టి
ఎద్దేవా చేశారు . గడచిన 10 వేతన సవరణ సమయాల్లో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి లేదన్నారు
. ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం 5 కరవు భత్యాల అమలు , బకాయి ఉందన్నారు . రాష్ట్ర
ప్రభుత్వ పరిస్థితి గమనించి , ఇంతకాలం ఉద్యోగులు కూడా ఓపిక పట్టారని , ధరల పెరుగుదల
వల్ల ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారని , తక్షణమే ఈ విషయం గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం డీఏలను
విడుదల చేయాలని కోరారు . ఆరోగ్య కార్డుల విషయంలోనూ ప్రభుత్వం తక్షణమే సమస్యలను
పరిష్కరించాలని రాజశేఖర్ విజ్ఞప్తి చేశారు . డిపార్టుమెంట్ పరీక్షల్లో నెగిటివ్
మార్కులు తొలగించినందుకు , రాష్ట్ర ముఖ్యమంత్రికి ఆయన ధన్యవాదాలు చెప్పారు .
