APTF

APTF
  • Home
  • Sitemap
  • search

WEB LINKS 1

CFMS
E-SR
CHILD INFO
CSE AP
AP SCERT
CPS
MDM
EHS
ZPPF SLIPS
APGLI

WEB LINKS 2

DIKSHA
INCOME TAX
DSC LISTS
TRANSFERS 2022
Home » Semua Post Kategori APTF SRK
Showing posts with label APTF SRK. Show all posts
Showing posts with label APTF SRK. Show all posts

పెండింగ్ బకాయిలు,DA ల విడుదల కోసం APTF ధర్నా : శ్రీకాకుళం జిల్లా

Mohan
APTF Updated at: December 27, 2022

 రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కలెక్టర్ కార్యాలయాల వద్ద ఈ రోజు APTF (1938) , ప్రభుత్వం అనుసరిస్తున్న ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక,పోలీసు వ్యతిరేక విధానాలకు నిరసనగా నిర్వహిస్తున్న ధర్నాలో భాగంగా శ్రీకాకుళం కలెక్టరేట్  వద్ద జరుగుతున్న ధర్నాలో జిల్లాకేడర్, పలాస , వజ్రపుకొత్తూరు కేడర్ పాల్గొనడం జరిగింది















ప్రాధమిక పాఠశాలలను ముక్కలు చెయ్యవద్దు. APSEC డిమాండ్ :: టెక్కలి

Mohan
APTF Updated at: April 09, 2022

        జాతీయ విద్యా విధానం 2020 అమలు పేరుతో రాష్ట్రం లోని ప్రాధమిక పాఠశాల లను ముక్కలు చేయవద్దని ఏపీ విద్యాపరిరక్షణ కమిటీ డిమాండ్ చేసింది. ఈమేరకు శనివారం టెక్కలిలో జరిగిన ప్రదర్శన లో 3,4,5 తరగతుల పిల్లలను మూడు కిలోమీటర్ ల దూరం లోని ఉన్నత పాఠశాలలకు తరలించడం తో డ్రాపౌట్ లు పెరుగుతాయని, అలాగే 1,2 తరగతుల పిల్లలను అంగన్వాడీలకు అప్పగించి ఇంటర్మీడియట్ విద్యార్హత గలవారితో బోధన చేయించే ఆలోచన విరమించాలని ఏపీటీయఫ్ నాయకులు డిమాండ్ చేశారు. రాష్ట్రంలో అవసరమైన 25 వేల పోస్టులను భర్తీ చేయాలని కోరుతుంటే అదిచేయకుండా ఉన్న యస్ జీ టీ పోస్టులను తరలిస్తూ ఉత్తర్వులను ఇవ్వడాన్ని ఖండిస్తున్నామన్నారు. తెలుగు మాధ్యమం ఉన్నత పాఠశాలల లో కోనసాగించాలని డిమాండ్ చేశారు.

        విద్యారంగ మేధావులు,విద్యా పరిరక్షణ కమిటీ, ఉపాధ్యాయ సంఘాలతో చర్చించి సమస్యలను పరిష్కరించి విద్యాప్రగతి కి దోహదపడాలని హితవు పలికారు.

           ఈ కార్యక్రమం లో విద్యాపరిరక్షణ కమిటీ మరియు ఏపి టీయఫ్ నాయకులు వై శేషగిరిరావు,కే.సూర్యనారాయణ, గున్న ప్రసాదరావు, యన్ సురేష్ కుమార్, వజ్జ ఆదినారాయణ, కళ్యాణ్ చక్రవర్తి, బమ్మిడి క్రిష్ణారావు, కే చిన్నారావు, శివానంద్, కాంతమ్మ,చిట్టెన్న, ఫల్గుణరావు, నారాయణరావు,వానయ్య,లోకు,నారాయణమూర్తి, మాధవరావు, బీ రామారావు, యం నారాయణమూర్తి, జీ శ్రీనివాసరావు, ఫల్గుణరావు, బీ నారాయణరావు, నాయుడు మోహన్, నాగరాజు, బీ వెంకటరావు తదితరులు కూడా పాల్గోన్నారు

        వివిధ రకాల యాప్ ల నిర్వహణ తో ఉపాధ్యాయులకు పనిభారం పెరగడంతో బోధనకు అవకాశం తగ్గినందున ఉపాధ్యాయులను బోధనకే పరిమితం చేయాలని విజ్ఞప్తి చేశారు.








తాత్కాలిక వాయిదా ఉద్యమ ఎత్తుగడలో భాగమే!

Mohan
APTF Updated at: December 19, 2021


  • - సత్ఫలితాల సాధనకు పోరాటమే మార్గం
  • - సీపీయస్ రద్దు ప్రభుత్వ బాధ్యత
  • - పీయార్సీ కోసం అశుతోష్ మిశ్రా నివేదికను పరిగణనలోకి తీసుకోవాలి*
  • - తాత్కాలిక వాయిదా ఉద్యమ ఎత్తుగడలో భాగమే
  • - ఏపీటీయఫ్ శ్రీకాకుళం జిల్లా విస్తృత కార్యవర్గ సమావేశంలో   నాయకుల ప్రసంగం


ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, పెన్షనర్ల కోర్కెలు సంపూర్ణంగా పరిష్కారం కావాలంటే ఉద్యమం తప్ప మరో మార్గం లేదని, సత్ఫలితాలను సాధించుకోవాలంటే పోరాటమే మార్గమని ఏపీటీయఫ్ సీనియర్ నాయకులు సన్నశెట్టి రాజశేఖర్, ఏపీటీయఫ్ రాష్ట్ర సహాధ్యక్షులు చింతాడ దిలీప్ కుమార్ అన్నారు. ఈరోజు శ్రీకాకుళం పాత బస్టాండ్ దరిలో  గజపతి హోటల్ లో నిర్వహించిన ఏపీటీయఫ్ జిల్లా విస్తృత కార్యవర్గ సమావేశంలో వారు మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ లో జెఏసీ ఆధ్వర్యంలో ఉమ్మడిగా కొనసాగుతున్న పోరాటానికి ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించాలని కోరారు.  పీయార్సీ కోసం అశుతోష్ మిశ్రా నివేదికను పరిగణనలోకి తీసుకోవాలనీ, దశలవారీగా సాగుతున్న ప్రస్తుత ఉమ్మడి ప్రత్యక్ష కార్యాచరణతో కూడిన ఆందోళన తాత్కాలికంగా వాయిదా వేయడం  ఉద్యమ ఎత్తుగడలో భాగమేనని వారన్నారు. 55 శాతం ఫిట్మెంట్ తో కూడిన పీయార్సీ, సీపీయస్ రద్దు వంటి మొత్తం 71డిమాండ్లకు సీయం సమక్షంలో పరిష్కారం లభిస్తుందని ఆశిస్తున్నామన్నారు.
ఈ సమావేశానికి ఏపీటీయఫ్ శ్రీకాకుళం జిల్లా అధ్యక్షులు వాన కామేశ్వరరావు అధ్యక్షత వహించారు. ఏపీటీయఫ్ రాష్ట్ర సహాధ్యక్షులు చింతాడ దిలీప్ కుమార్ తో పాటు రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు బి.సుమలత సందేశం ఇచ్చారు. ప్రధాన కార్యదర్శి టి.చలపతిరావు కార్యదర్శి నివేదికను ప్రవేశపెట్టారు. జిల్లా సహాధ్యక్షులు బల్లెడ రవి, అదనపు కార్యదర్శి పొన్నాడ బాలాజీ రావు,  ఉపాధ్యక్షులు మామిడి భుజంగరావు, బుక్కూరు వెంకటేశ్వర్లు, బలగ శ్రీనివాసరావు, జిల్లా కార్యదర్శులు వైవీ రమణ, టి.శివరావు, వై శేషగిరిరావు తదితర నాయకులు మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా పలు మండలాల నుంచి మండలస్థాయి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

అజన్మం ప్రజా హక్కుల కోసం పోరాదిన యోధుడు పెద్దింటి - కె. సుబ్బారెడ్డి, ఓపిడిఆర్

Mohan
APTF Updated at: October 09, 2021

ఎపిటీఎఫ్ శ్రీకాకుళం పూర్వాధ్యక్షులు పెద్దింటి సూర్యనారాయణ గారు ఆకస్మిక మృతి.

Mohan
APTF Updated at: September 30, 2021

శాఖ పూర్వాధ్యక్షులు పెద్దింటి సూర్యనారాయణ గారు ఆకస్మికంగా మృతి చెందారని తెలపడానికి విచారిస్తున్నాము. ప్రజా సాహిత్య సంస్థల్లోనూ హక్కుల ఉద్యమంలోనూ నిత్య చలనశీలతతో నడుస్తున్న ప్రజాపక్షపాతి సూర్యనారాయణ గారు. వారు APTF జిల్లా  అధ్యక్షుల స్థాయి నుండి రాష్ట్ర స్థాయి బాధ్యతల్లో సమర్థవంతంగా పనిచేశారు.  వారి మృతి ప్రజా, ఉపాధ్యాయ ఉద్యమాలకు తీరని లోటు. కామ్రేడ్ సూర్యనారాయణ గారి మృతికి ఫెడరేషన్ పక్షాన సంతాప నివాళులు... వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేసుకుంటున్నాము.* - *రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు, APTF

శ్రీకాకుళం జిల్లా APTF 1938 సభ్యత్వ నమోదు కార్యక్రమం

Mohan
APTF Updated at: September 24, 2021

 



Membership campaign in Polaki Mandal Srikakulam Dist by State Asso.President APTF & Team

శ్రీకాకుళం జిల్లాలో ముమ్మరంగా సభ్యత నమోదు

Mohan
APTF Updated at: September 15, 2021

APTF(1938) వజ్రపుకొత్తూరు మండల శాఖ (శ్రీకాకుళం జిల్లా) - సభ్యత్వ కాంపెయిన్
మొదటి రోజు 130 సభ్యత్వాలు

మెమో 172 కు సవరణలు చేయాలి -ఏపీటీఎఫ్ వజ్రపుకొత్తూరు శాఖ

Mohan
APTF Updated at: June 16, 2021



NEP2020 అమలుకై జారీ చేసిన మెమో నెం 172 లో సవరణలు కోరుతూ... APTF(1938) వజ్రపుకొత్తూరు మండల శాఖ పక్షాన గౌ. MPDO, వజ్రపుకొత్తూరు వారి కార్యాలయ ప్రతినిధి కి వినతిపత్రం సమర్పించడమైనది. 

రెండవ కార్యక్రమం:
ఇటీవల కాలంలో కరోన మహమ్మారి కారణంగా అకాల మరణం చెందిన మండల ఉపాధ్యాయ మిత్రులు గుంటు. జగదీశ్వరరావు, నవిరి. యజ్ఞేశ్వరరావు మరియు దువ్వాడ చిట్టిబాబు గార్ల ఆత్మ లకు శాంతి కలగాలని మౌనం పాటిస్తున్న APTF(1938) వజ్రపుకొత్తూరు మండల శాఖ ప్రతినిధులు

ఎన్ఈపిని వ్యతిరేకిస్తూ నేడు ఏపీటీఎఫ్ నిరసన : శ్రీకాకుళం జిల్లా

ఎన్ఈపిని వ్యతిరేకిస్తూ నేడు ఏపీటీఎఫ్ నిరసన : శ్రీకాకుళం జిల్లా

Mohan
APTF Updated at: October 04, 2020

శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో, పూర్వపు తాలూకా కేంద్రాల్లో  సోమవారం నిరసన కార్యక్రమాలకు ఏపీటీఎఫ్ (1938) పిలుపునిచ్చింది.

 

కేంద్ర ప్రభుత్వం అప్రజాస్వామికంగా ప్రకటించిన ఎన్ఈపీను  వ్యతిరేకిస్తూ అ ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవం సందర్బంగా ఈనిరసన తెపుపుతున్నట్లు  ఏపీటీఎఫ్, శ్రీకాకుళం జిల్లా కమిటీ జిల్లా గౌరవాధ్యక్షులు సన్నశెట్టి రాజశేఖర్, జిల్లా అధ్యక్షులు వానా కామేశ్వరరావు,  జిల్లా ప్రధాన కార్యదర్శి టి.చలపతిరావులు తెలిపారు. నిరసన కార్యక్రమాలతో ప్రజల ఆకాంక్షను ప్రభుత్వానికి తెలపాలని కోరారు.


వేతన సవరణ కమిటీ .. రాజ్యాంగం రాస్తోందా..... ఏపీటీఎఫ్ నాయకులు సన్నశెట్టి రాజశేఖర్

Mohan
APTF Updated at: October 01, 2020

 

  • రెండున్నరేళ్ల కాలంలో వేతన సవరణ ఓ నివేదిక ఇవ్వలేకపోయారా ... ?
  • ఏళ్ల తరబడీ వాయిదాలు వేస్తూనే కాలం గడిపేస్తారా .. ?
  • జరిగిన ఆలస్యం చాలు తక్షణం పీఆర్సీ ప్రకటించండి
  • ఏపీటీఎఫ్ సీనియర్ నాయకులు సన్నశెట్టి రాజశేఖర్

ఇంకా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతన సవరణ కోసం నియమించిన కమిటీ , రెండున్నరేళ్ల కాలం గడిచినా , ఎందుకు నివేదిక సమర్పించలేదని ఏపీటీఎఫ్ సీనియర్ నాయకులు , శ్రీకాకుళం జిల్లా కమిటీ గౌరవాధ్యక్షులు సన్నశెట్టి రాజశేఖర్ ప్రశ్నిం చారు . విజయవాడలో ఇటీవల నిర్వహించిన ఏపీటీ ఎకు , జాతీయస్థాయిలో అనుబంధంగా వున్న అఖిల భారత విద్యా సంస్థల సమాఖ్యకు కౌన్సిల్ సభ్యునిగా , ఇటీవల విజయవాడలో రాజశేఖర్ ఎన్నికయ్యారు . ఆ సందర్భాన్ని పురస్కరించకుని , , ఆయన శ్రీకాకుళంలో బుధవారం మాట్లాడారు . వేతన సవరణ కోసం నియమించిన కమిటీ గడువు ను , అయిదు దఫాలుగా పెంచుతూనే ఉన్నారనీ , ఈ సారి సెప్టెంబరు నెలాఖరు వరకు పొడిగించిన విషయాన్ని ఆయన ప్రస్తావిస్తూ , ఈ పొడిగింపులు ఏమిటని ఆయన నిలదీశారు . దీని వల్ల ఉద్యోగులు నష్టపోతున్నారని , ప్రభుత్వం వేతన సవరణకు తక్షణం చర్యలు తీసుకోవాలని కోరారు . 2018 జూలై నుంచి వేతన సవరణ అమలు కావాల్సి ఉందన్నారు . భారతదేశ రాజ్యాంగ రచన కన్నా , పీఆర్సీ నివేదిక తయారీకి ఎక్కువ సమయం తీసుకోవడం సరికాదని సన్నశెట్టి ఎద్దేవా చేశారు . గడచిన 10 వేతన సవరణ సమయాల్లో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి లేదన్నారు . ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం 5 కరవు భత్యాల అమలు , బకాయి ఉందన్నారు . రాష్ట్ర ప్రభుత్వ పరిస్థితి గమనించి , ఇంతకాలం ఉద్యోగులు కూడా ఓపిక పట్టారని , ధరల పెరుగుదల వల్ల ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారని , తక్షణమే ఈ విషయం గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం డీఏలను విడుదల చేయాలని కోరారు . ఆరోగ్య కార్డుల విషయంలోనూ ప్రభుత్వం తక్షణమే సమస్యలను పరిష్కరించాలని రాజశేఖర్ విజ్ఞప్తి చేశారు . డిపార్టుమెంట్ పరీక్షల్లో నెగిటివ్ మార్కులు తొలగించినందుకు , రాష్ట్ర ముఖ్యమంత్రికి ఆయన ధన్యవాదాలు చెప్పారు .




 

Older Posts
Subscribe to: Comments (Atom)

EXAMS

APPSC
SSC
NMMS
NTSE
HM ACT TEST
PAT
D.El.Ed
LPT
TCC
TTC
AP OPEN SCHOOL

deo websites

SRIKAKULAM
Vizianagaram
VISAKHA
W.GODAVARI
E.GODAVARI
KRISHNA
GUNTUR
PRAKASAM
NELLORE
CHITTOOR
KURNOOL
KADAPA
ANATHAPURAM

Total Pageviews

Copyright © - APTF |