మధ్యాహ్న భోజన కార్మికులకు ఐదు నెలల గౌరవ వేతనం చెల్లించాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది . ఈ ఏడాది జూన్ నుంచి అక్టోబరు వరకు నెలకు రూ .1000 గౌరవ వేతనం చొప్పున చెల్లించనున్నట్లు మధ్యాహ్న భోజన పథకం డైరెక్టరు బుధవారం సర్క్యూలర్ జారీ చేశారు . పాఠశాలలు తెరుచుకోని సమయంలో భోజనం వండలేదని తెలిపారు . కార్మికుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని సానుభూతితో ఈ నిర్ణయం తీసుకుందన్నారు