ప్రస్తుతం జరుగుతున్న ఉపాధ్యాయుల బదిలీలకు సంభందించి అధికారులు అసంబద్ధ నిర్ణయాలు తీసుకోవడం వల్ల చాలా మంది ఉపాద్యాయులు నష్టపోతున్నారని వాటిని నివారించడం కోసం ఉపాధ్యాయ బదిలీలకు సంబంధించి శాశ్వత చట్టం ని రూపొందించాలని APTF రాష్ట్ర అధ్యక్షులు జి. హృదయ రాజు అన్నారు. నేడు స్థానిక గాంధీనగర్ లోని APTF జిల్లా కార్యాలయంలో జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశం లో మాట్లాడుతూ రాష్ట్రలో విద్యాశాఖ అధికారులు అనుచిత వైఖరి వల్ల నేడు ఉపాధ్యాయుల బదిలీలలో అనేకమంది మంది ఉపాధ్యాయులు నష్టపోతున్నారని వీటిని నివారించడం కోసం సర్వీస్ కాలానికి ఒక్క సంవత్సరానికి ఒక పాయింట్ ఇవ్వాలని, అదేవిధంగా ఖాళీలను బ్లాకింగ్ చేయకూడదని అన్నారు.మ్యానువల్ విధానంలో కౌన్సిలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేశారు.
జిల్లా ప్రధానకార్యదర్శి S.ఇస్మాయిల్ మాట్లాడుతూ జిల్లాలో ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించి ప్రత్యేక కేటగిరీ గా ఉన్న వికలాంగ ఉపాధ్యాయుల కోసం సదరన్ క్యాంప్స్ నిర్వహించడం కోసం అనేకసార్లు DEO గారికి ప్రాతినిధ్యం చేసిన ఇప్పటివరకు కూడా క్యాంప్స్ నిర్వహించక పోవడం వల్ల వికలాంగ ఉపాధ్యాయులు సర్టిఫికెట్స్ కోసం చాలా ఇబ్బందులు పడుతున్నారని ఇప్పటికైనా సదరం క్యాంప్స్ నిర్వహణకు తగు చర్యలు తీసుకోవాలని అన్నారు.IVకేటగిరీ నిర్ధారణ కూడా చేయాలని కోరారు. జిల్లా గౌరవ అధ్యక్షుడు ఏ.కమలాకర రావు మాట్లాడుతూ అశాష్రీయ నూతన జాతీయ విద్యా విధానం ను వ్యతిరేకిస్తూ నవంబర్ 26 రాజ్యాంగ పరిరక్షణ దినం నుండి డిసెంబర్ 3 వరకు సామాజిక న్యాయ పునఃసాధన వారంగా జిల్లా, తాలూకా స్థాయి లో ఆంధ్రప్రదేశ్ విద్యా పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో చేపడుతున్న నిరసన కార్యక్రమాలు విజయవంతం చేయాలని కోరారు.ఈ సమావేశం లో జిల్లా సహఅధ్యక్షుడు కె.శేఖర్ APTF నాయకులు నరేంద్ర, మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు.