నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్ షిప్ (ఎన్ ఎం ఎం ఎస్ ) పరీక్ష కోసం ఏపీలో 8వ తరగతి విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ ఎ.సుబ్బారెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.
★2021 ఫిబ్రవరి 14న పరీక్ష జరుగుతుందన్నారు.
★ప్రభుత్వ, జిల్లా పరిషత్, మున్సిపల్, ఎయిడెడ్, మండల పరిషత్, ఏపీ మోడల్ స్కూళ్లలో... 8వ తరగతి విద్యార్థులు అర్హులని తెలిపారు.
పూర్తి వివరాలకు www.bseap.org లో... జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు.