ట్రిపుల్‌ఐటీల్లో ప్రవేశాలకు దరఖాస్తుకు గడువును ఈ నెల 13 వరకు పొడిగించినట్టు ఆర్‌జియుకెటి చాన్సలర్ కేసిరెడ్డి తెలిపారు. శనివారం నూజివీడు ట్రిపుల్ ఐటీలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఆర్‌జియుకేటి పరిధిలోని 4 ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశాల కోసం ఇప్పటివరకు 55,172 దరఖాస్తులు వచ్చాయని అన్నారు. పండుగ సెలవులను పురస్కరించుకొని దరఖాస్తు చివరి తేదీని ఈ నెల 13 వరకు పొడిగించామని, అపరాధ రుసుంతో 16 వరకు గడువు ఉందని వెల్లడించారు