*APTF INFO*:
నేడు రాష్ట్ర అధ్యక్షులు హృదయ రాజు డైరెక్టరేట్ లో జే.డి సర్వీసెస్ గారిని కలిసి కొన్ని ప్రాతినిధ్యంలు చేయడం జరిగింది. బదిలీల్లో టీచర్స్ కు ఏవైనా అభ్యంతరాలు ఉంటే జనవరి 21 నుండి జనవరి 30 - 2021 వరకు గడువు నిచ్చారని ఐతే వెబ్ ఆధారిత కౌన్సెలింగ్ ద్వారా బదిలీలు కాబడిన వారి మొత్తం జాబితాలు అందుబాటులో లేనందున పిర్యాదులు చేయుటకు అవకాశం లేదు కాబట్టి అన్ని జిల్లాల్లో అన్ని కేడర్లకు సంబంధించి బదిలీ కాబడిన ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయుల ఉత్తర్వుల జాబితాలను అందజేయాలని కోరడం జరిగింది. జేడి గారు జాబితాలను ఇస్తామని,DEO ల లాగిన్ లో ఉంచుతామని హామీ ఇచ్చారు.
బదిలీల నోటిఫికేషన్ లో మిగిలినపోయిన డ్రాయింగ్, క్రాఫ్ట్ తదితర మ్యానువల్ కౌన్సెలింగ్ చేయాలనుకున్న కేడర్ల బదిలీల గురించి ప్రతిపాదించగా ఎన్నికల కోడ్ అమల్లో వున్నందున జరపలేమని అన్నారు. మరియు అకడమిక్ పరంగా 6వ తరగతి విద్యార్థులను కేవలం ఇంగ్లీష్ మీడియం లోనే అడ్మిషన్స్ చేర్చుకోవాలా అనేదానిపై స్పష్టత ఇవ్వాలని చర్చించడం జరిగింది.సంబంధిత అధికారుల దృష్టికి తీసుకుని వెళ్తామన్నారు.
CFMS లో వున్న INCIDENTS లను పరిష్కరించడం జరిగింది.Spl Edu స్కూల్ అసిస్టెంట్స్ వారివి ఇంకా ప్రాసెస్ లో ఉన్నవి. మెడికల్ రియంబర్స్మెంట్ బిల్స్ pursue చేయడం జరిగింది.
- అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు, APTF:1938