మిత్రులారా
ఈనెల జీతాల బిల్లుల ఎన్నికల కారణంగా సమర్పణలో
జాప్యం జరిగిందని అందుకు అదనంగా మరో రెండు రోజులు అవకాశం కల్పించవలసిందిగా సి ఎఫ్ ఎం ఎస్ సి ఈ ఓ గారిని కోరడం జరిగిందని ఏపీటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. వెంకటేశ్వరరావు తెలిపారు. ఆమేరకు అధికారులు అంగీకరించారని ఆయన తెలిపారు. ఆదాయపు పన్ను రిటర్న్ లు, ఎన్నికలు విధులలో తలమునకలైన ఉపాధ్యాయులు ఫిబ్రవరి వేతనాలను పొందేందుకు లభించిన వెసులుబాటును వినియోగించుకోవాలని ఆయన పేర్కొన్నారు.
అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్