2021 -22 విద్యా సంవత్సరా నికి కేంద్రీయ విద్యాలయాల్లో ప్రవేశాలకు ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఏప్రిల్ 1 నుండి ప్రారంభం కానుంది. విద్యార్థులు రిజిస్ట్రేషన్ పోర్టల్ లో ఏప్రిల్ 1 నుంచి 19వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. దేశంలోని అన్ని కేంద్రీయ విద్యాలయాల్లో కలిపి మొదటి తరగతి కోసం ఆన్ లైన్ నమోదు ప్రక్రియ జరు గనుంది. రెండవ తరగతి, ఆపై తరగతుల ప్రవేశాలకు ఏప్రిల్ 8 నుంచి ఏప్రిల్ 15 మధ్య ఆన్లైన్ మోడ్ లో రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఉంటుం ది. కోవిడ్ కారణంగా 2021-22 విద్యా సంవ త్సరానికి ఆన్లైన్ ప్రవేశం కోసం అధికారిక ఆండ్రాయిడ్ యాప్ ను డౌన్ లౌడ్ చేసుకోవచ్చు. అన్ని తరగతుల ప్రవేశాలకు 31.03.2021 నాటికి నిర్దేశిత వయస్సు ఉండాలి. కేంద్రీయ విద్యాలయ సంఘటన్ అడ్మిషన్ మార్గదర్శ కాల ప్రకారం సీట్ల రిజర్వేషన్ ఉంటుంది ప్రస్తుతం కేంద్రీయ విద్యాలయ సంఘటన్ పరి ధిలో దేశవ్యాప్తంగా 1,247 కేంద్రీయ విద్యాల యాలు పనిచేస్తున్నాయి.