APTF తదితర ఉపాధ్యాయ, అధ్యాపక సంఘాలు బలపరిచిన UTF రాష్ట్ర అధ్యక్షులు, PDF MLC అభ్యర్థి షేక్ సాబ్జీ మొదటి ప్రాధాన్యత ఓట్లతో విజయం సాధించడం అభినందనీయమని APTF రాష్ట్ర గౌరవ అధ్యక్షులు, అధ్యక్షులు మరియు ప్రధాన కార్యదర్శులు ఏ.సదాశివరావు, జి.హృదయరాజు, కె.వెంకటేశ్వరరావు హర్షం వ్యక్తంచేస్తున్నట్లు ప్రకటించారు.
విద్యారంగ - ఉపాధ్యాయ సమస్యలపై పూర్తి స్థాయిలో అవగాహన కలిగిన ఉపాధ్యాయ ఉద్యమ నాయకుడు ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా గెలుపొందడం అవసరమని అన్నారు. ఉభయ గోదావరి జిల్లాల్లో సాబ్జీ విజయానికి కృషి చేసిన APTF కార్యకర్తలకు ధన్యవాదములు తెల్పారు.
ప్రస్తుతం ఉపాధ్యాయులను వేధిస్తున్న అనేక సమస్యలు మరియు విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం శాసన మండలిలో సాబ్జీ తమ గళాన్ని గట్టిగా వినిపిస్తారనే నమ్మకం ఉందన్నారు.