*ఏపీటీఎఫ్ నూతన కార్యవర్గం ఏర్పాటు*
నెల్లూరు జిలా పొదలకూరు,
ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ (ఏపీటీఎఫ్) పొదలకూరు మండల నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. పొదలకూరులోని ఏపీటీఎఫ్ కార్యాలయంలో బుధవారం సమావేశమైన ఏపీటీఎఫ్ బాధ్యులు కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది. ఏపీటీఎఫ్ పొదలకూరు మండల శాఖ అధ్యక్షుడు గా కె లక్ష్మీనారాయణ, ప్రధాన కార్యదర్శి గా ఆర్ మాల్యాద్రి, గౌరవాధ్యక్షులుగా కె రాధయ్య, ఉపాధ్యక్షులుగా షేక్ ఖాజారహంతుల్లా, డీవీ రావు, ఓ శ్రీనివాసులు, సహాధ్యక్షులుగా ఎం మధుసూదన్ రావు, అదనపు కార్యదర్శిగా జీ వెంకట కృష్ణయ్య, మహిళా కార్యదర్శులు గా ఏ జ్యోతి, డబ్ల్యూ విజయలక్ష్మి, కార్యదర్శులు గా ఎన్ మహదేవయ్య, ఎన్ రామకృష్ణయ్య, ఎస్ వెంకటేశ్వర్లు లు ఎంపికయ్యారు. ఎన్నికల అధికారిగా ఈగా దుర్గారెడ్డి వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో ఏపీటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం పిచ్చిబాబు పాల్గొన్నారు. కాగా నూతన కార్యవర్గ సభ్యులు మాట్లాడుతూ పీఆర్సీ ని వెంటనే అమలు చేయాలని, డీఎస్సీ నిర్వహించి కాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు.