"ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేయాలి "ఏపీటీఎఫ్."రాష్ట్రంలో వివిధ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న 25 వేల పోస్టులను వెంటనే భర్తీ చేయాలని, భర్తీ చేసేంతవరకు ఖాళీగా ఉన్న పోస్టులకు విద్యావలంటీర్లను నియమించాల ని ఏపిటిఎఫ్ జిల్లా గౌరవ అధ్యక్షులు కమలాకర్ రావు, జిల్లా అధ్యక్షులు బి.మాధవ స్వామి లు డిమాండ్ చేశారు. బనగానపల్లె మండలం లో సభ్యత్వ నమోదు కార్యక్రమం లో పాల్గొని మాట్లాడడం జరిగింది. రేషనలైజేషన్ ద్వారా అనేక పాఠశాలలు ఏకోపాధ్యాయ పాఠశాలలుగా మిగిలిపోయాయని అలాగే ఉన్నత పాఠశాలలో అనేక స్కూల్ అసిస్టెంట్లు ఖాళీలు ఏర్పడ్డాయని వెంటనే వాటిని భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా ప్రధానోపాధ్యాయులకు , ఉపాధ్యాయులకు యాప్ ల భారాన్ని తగ్గించాలని అధికారులను కోరారు. అనేక పాఠశాలల్లో క్యాడర్ స్ట్రెంత్ లో లో సమస్యలు ఏర్పడి ఉపాధ్యాయులకు మూడు నెలలైనా జీతాలు అందక అవస్థలు పడుతున్నారని ఆ సమస్యను వెంటనే పరిష్క రించి జీతాలు అందే విధంగా చూడాలని అధికారులను కోరారు. సభ్యత్వ నమోదు కార్యక్రమం లో పాల్గొన్న ఉపాధ్యాయులు మధుసూదన్ రావు, గోపాల్ రావు ,నాగరాజు, లింగ మయ్య, రామకృష్ణ,అనిల్ కుమార్ ,వెంకటకృష్ణ, సుబ్బరాయుడు ,బ్రహ్మయ్య, య, మద్దిలేటి బాలాజీ నాయక్ యుగంధర్ తదితరులు పాల్గొన్నారు